New Wave Of Covid Variant: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే ప్రమాదం!
Sakshi Education
కరోనాకు పుట్టిల్లయిన చైనా మరో వేవ్‌తో వణికిపోతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీతో నెల రోజులుగా అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
జూన్ చివరికి కరోనా తారస్థాయికి చేరి వారానికి ఏకంగా 6.5 కోట్ల కేసులు నమోదు కావచ్చన్న అంతర్జాతీయ మీడియా కథనాలు ఆందోళన పెంచుతున్నాయి. దీనికి సరైన వ్యాక్సిన్ రాకపోతే చైనా మృత్యు దిబ్బగా మారుతుందని చైనా అంటువ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులపై ఈ వేరియెంట్ అత్యధిక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌లను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ తెలిపారు.
Published date : 27 May 2023 09:18AM