Economic Crisis: ఎంపీల పర్యటనలు, లగ్జరీ కార్ల కొనుగోళ్లు బంద్..
Sakshi Education
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది.
ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చింది.
Pakistan: ప్రపంచదేశాల ముందు చేయి చాస్తున్న పాకిస్తాన్
Published date : 27 Jan 2023 06:18PM