ఆగస్టు 2018 అంతర్జాతీయం
Sakshi Education
బిమ్స్‌టెక్ సదస్సుకు హాజరుకానున్న మోదీ
4వ బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇన్షియేటివ్ ఫర్ మల్టీ-సెక్టొరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో ఆగస్టు 28 నుంచి 31 వరకు ఈ సదస్సుని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానిగా నేపాల్‌లో నాలుగోసారి పర్యటించనున్న మోదీ ఆ దేశంలోని పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో భారత్ ఆర్థికసాయంతో నిర్మించిన ‘ధరంశాల’ అనే ఆసుపత్రిని ప్రారంభిస్తారు. బిమ్స్‌టెక్‌లో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్ , మయన్మార్, థాయ్‌లాండ్ లు సభ్యదేశాలుగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 4వ బిమ్స్‌టెక్ సదస్సుకు హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : ఆగస్టు 28 నుంచి 31 వరకు
ఎక్కడ : కఠ్మాండు, నేపాల్
సెప్టెంబర్‌లో పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు
సెప్టెంబర్ 4న పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఆగస్టు 16న ప్రకటించింది. పాకిస్థాన్ 12వ అధ్యక్షుడిగా 2013 సెప్టెంబర్ 9న ప్రమాణస్వీకారం చేసిన మమ్నూన్ హుస్సేన్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. పాకిస్థాన్ అధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో పార్లమెంట్ సభ్యులు, దేశంలోని వివిధ ప్రావిన్సుల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. భారత్‌లో మాదిరిగానే పాకిస్థాన్ ప్రధాని సిఫారసుల మేరకు అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : పాకిస్థాన్ ఎన్నికల సంఘం
ఎక్కడ : పాకిస్థాన్
జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ విజయం
జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎమర్సన్ మునంగాగ్వా (75) విజయం సాధించారు. 50.8 శాతం ఓట్లు సాధించి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్-పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను-పీఎఫ్) పార్టీకి 144 స్థానాలు, మూవ్‌మెంట్ ఫర్ డెమోక్రటిక్ చేంజ్ (ఎండీసీ) కూటమికి 64 స్థానాలు, నేషనల్ పాట్రియాటిక్ ఫ్రంట్‌కు ఒక స్థానం లభించాయి.
జింబాబ్వేను 37 ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించిన రాబర్ట్ ముగాబేను 2017 నవంబర్‌లో పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : ఎమర్సన్ మునంగాగ్వా
ఎక్కడ : జింబాబ్వే
ఇరాన్ పై అమెరికా ఆంక్షలు
అణు ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్‌పై అమెరికా 2015లో ఎత్తేసిన ఆంక్షలను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్-అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ 2018 మే నెలలో రద్దు చేశారు. మరింత సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆంక్షలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్ పై అమెరికా ఆంక్షలు
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Published date : 18 Aug 2018 05:09PM