ఆగస్టు 2017 అంతర్జాతీయం
Sakshi Education
భారత్ అమెరికాకు కీలక భాగస్వామి: ట్రంప్
అమెరికా ప్రవేశపెట్టిన కొత్త ‘దక్షిణాసియా విధానం’ భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వర్జీనియా రాష్ట్రం అర్లింగ్టన్‌లోని ఫోర్ట్ మేయర్‌లో తన పాలనా యంత్రాంగంలోని ముఖ్య అధికారులు సహా సుమారు 2 వేల మందిని ఉద్దేశించి ఆగస్టు 22న ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ భద్రత, ఆర్థిక రంగాల్లో అమెరికాకు కీలక భాగస్వావి అన్నారు.
ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని పేర్కొన్న ట్రంప్ శాంతి నెలకొల్పేందుకు భారత్‌తో కలసి పనిచేయాలని సూచించారు. అఫ్గాన్‌లోని తమ సైనికులను వెనక్కి రప్పించే విషయంలో ఎలాంటి కాలపరిమితి లేదని, అక్కడ శాంతి, స్థిరత్వం తీసుకొచ్చేందుకు భారత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం 8,500 దళాలు అఫ్గాన్‌లో ఉండగా మరో 4 వేల దళాలను అక్కడికి పంపనున్నట్లు సమాచారం.
ఐఎస్‌ఏకు త్వరలో ఐరాస అనుబంధ గుర్తింపు
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రారంభించిన అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్‌ఏ)కు 2017 డిసెంబర్ నాటికి ఐరాస అనుబంధ గుర్తింపు లభించనుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 23న వెల్లడించారు. 121 దేశాల్లో అతి తక్కువ వ్యయంతో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టులపై పరిశోధన కోసం ఐఎస్‌ఏ పనిచేస్తుంది. ఇందుకోసం 10 ఏళ్లలో 300 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
2015 నవంబర్ 30న పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌కు ఐరాస అనుబంధ గుర్తింపు
ఎప్పుడు : 2017 డిసెంబర్ నాటికి
ఎందుకు : పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం
చైనాలో బ్రిక్స్ పరిపాలనా సెమినార్
బ్రిక్స్ పరిపాలనా సెమినార్ ఆగస్టు 17, 18 తేదీల్లో దక్షిణ చైనాలో జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, దక్షిణా ఆఫ్రికా)తో పాటు అభివృద్ధి చెందిన దేశాల నుంచి 160కిపైగా ప్రతినిధులు ఈ సెమినార్‌కు హాజరయ్యారు. “Openness, Inclusiveness, Mutual Benefits and Win-Win: Working Together to Build a Community of Shared Future for Mankind” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సమావేశాల్లో.. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు.
9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని జియామెన్ నగరంలో జరుగుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిక్స్ పరిపాలనా సెమినార్
ఎప్పుడు : ఆగస్టు 17, 18
ఎవరు : బ్రిక్స్ కూటమి
ఎక్కడ : చైనా
డోక్లాం వివాదం పరిష్కారం: భారత్
భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైందని ఆగస్టు 28న భారత్ ప్రకటించింది. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరడంతో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడిందని తెలిపింది. ఈ మేరకు వీలైనంత త్వరగా డోక్లాం నుంచి సరిహద్దు బలగాల్ని వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు తమ బలగాల్ని ఉపసంహరించలేదని, పరిస్థితుల మేరకు మార్పులు ఉంటాయని చైనా పేర్కొంది.
వివాదానికి కారణం
భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని భూభాగమే డోక్లాం. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో యుద్ధట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా రోడ్డు నిర్మాణానికి చైనా జూన్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. రోడ్డు పూర్తయితే ఈశాన్య రాష్ట్రాలతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం (చికెన్ నెక్) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావించిన భారత్ భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని మోహరించి దాన్ని అడ్డుకుంది. దీంతో భారత బంకర్లను చైనా ధ్వంసం చేసింది.
ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్ ప్రారంభం
అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఐసీఈఎక్స్) డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ఆగస్టు 28న ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్‌స ఎక్స్చేంజ్‌గా నిలిచింది. తొలి దశలో కంపల్సరీ డెలివరీతో 1 క్యారెట్ పరిమాణంలో కాంట్రాక్ట్స్‌ను ప్రారంభించామని.. డైమండ్ లావాదేవీలు నిర్వహించేవారికి ఇది పూర్తి పారదర్శకమైన కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుందని ఐసీఈఎక్స్ మేనేజింగ్ డెరైక్టర్ సంజిత్ ప్రసాద్ తెలిపారు. ట్రేడింగ్ పరిమాణం రోజుకు దాదాపు రూ.5,000 కోట్ల మేర ఉండే వీలుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ తొలి డైమండ్ ఫ్యూచర్స్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్
ఎక్కడ : ముంబై
అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్
ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలి యాలోని మెల్‌బోర్న్ నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌స యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది నగరాల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
షాంఘై ర్యాంకింగ్స్ లో హార్వర్డ్‌కు అగ్రస్థానం
షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ విడుదల చేసిన ‘అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకు సాధించింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండో ర్యాంకు, మసాచుసెట్స్ టెక్నాలజీ వర్సిటీ మూడో ర్యాంకు, కాలిఫోర్నియా వర్సిటీ నాల్గో ర్యాంకు సాధించాయి. ప్రిన్‌సటన్, ఆక్స్‌ఫర్డ్, కొలంబియా, కాలిఫోర్నియా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, షికాగో వర్సిటీలు తొలి 10 జాబితాలో స్థానం పొందాయి. చైనాలోని ప్రతిష్టాత్మకమైన సింగువా వర్సిటీ తొలిసారిగా టాప్ 50లో చోటు దక్కించుకుంది. ఆసియా నుంచి మెరుగైన ర్యాంకు పొందిన వాటిలో టోక్యో యూనివర్సిటీ(24) ఉంది. యూరప్ నుంచి స్విస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఉత్తమ ర్యాంకు పొందింది. 2003 నుంచి షాంఘై సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమమైన తొలి 500 విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షాంఘై యూనివర్సిటీ ర్యాంకింగ్స్
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : మొదటి స్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ
ఎక్కడ : అమెరికా
ఖతార్ సరిహద్దు తెరిచిన సౌదీ
హజ్ యాత్ర సందర్భంగా సౌదీ అరేబియా-ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు ముందడుగు పడింది. హజ్ యాత్రికుల కోసం ఖతార్ సరిహద్దును తిరిగి తెరవాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రియాద్‌వాసులు హజ్ యాత్రకు రావడానికి మార్గం సుగమమైంది. ఖతార్ రాజ కుటుంబ సభ్యుడైన షేక్ అబ్దుల్లా అల్ తానీతో జెడ్డాలో ప్రత్యేకంగా సమావేశమైన సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక జెట్ విమానాలను సౌదీలోని జెడ్డా నుంచి ఖతార్ రాజధాని దోహాకు పంపించనున్నట్లు సౌదీ మీడియా తెలిపింది. దీనికయ్యే ఖర్చంతా సౌదీ రాజు భరిస్తారంది. ఉగ్రవాదానికి మద్దతిస్తోందంటూ సౌదీ, ఈజిప్టు, బహ్రెయిన్, యూఏఈ.. ఇటీవల ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి.
చైనాలో తొలి సైబర్ కోర్టు ప్రారంభం
ఇంటర్నెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి తొలి సైబర్ కోర్టును చైనా ప్రారంభించింది. జెజియాంగ్ ప్రావిన్‌సలో ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రమైన హాంగ్జూ నగరంలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వాణిజ్య వివాదాలతో పాటు కాపీరైట్ చట్టం ఉల్లంఘనలను ఈ న్యాయస్థానం విచారిస్తుంది. ఈ కోర్టులో విచారణ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. 2017 ఏడాది జూన్ నాటికి చైనాలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 751 మిలియన్లకు చేరుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాలో ప్రపంచ తొలి సైబర్ కోర్టు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 17
ఎక్కడ : హాంగ్జూ, చైనా
ఎందుకు : ఆన్‌లైన్ వాణిజ్య వివాదాల పరిష్కారానికి
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాలు ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఉత్తర కొరియా అభ్యంతరాల మధ్యే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. వేలాది మంది సైనికులు ఈ ఉల్చి-ఫ్రీడం గార్డియన్ సంయుక్త సైనిక కసరత్తు నిర్వహించారు. దక్షిణ కొరియాలో రెండు వారాల పాటు సాగే ఈ విన్యాసాల్లో క్షేత్ర స్థాయిలో కాల్పులు, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివేవీ లేకుండా కంప్యూటర్ల ఆధారంగా సాధన జరుగుతుంది. వీటిలో సుమారు 17,500 మంది అమెరికా సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. కాగా ఇవి రక్షణాత్మక విన్యాసాలేనని, ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవి కాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ పేర్కొన్నారు.
స్పెయిన్ ఉగ్రదాడిలో 13 మంది మృతి
స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్‌లో ఆగస్టు 17న ఓ వ్యాను పర్యాటకులపైకి దూసుకుపోవడంతో 13 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని పోలీసులు ధ్రువీకరించారు.
అమెరికాపై క్షిపణి దాడి చేస్తాం: ఉత్తర కొరియా
పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరమైన గ్వామ్ ద్వీపం సమీపంలో క్షిపణి దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. తమ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందించింది. గ్వామ్ ద్వీపంపై మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి హ్వాసంగ్-12తో దాడికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ సైనికాధికారిని ఉటంకిస్తూ ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. తమ అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం అన్ని వైపుల నుంచి గ్వామ్‌పై విరుచుకుపడతామని తెలిపింది.
మరోవైపు ఉత్తర కొరియా హెచ్చరికలపై ట్రంప్ దీటుగా స్పందించారు. అణ్వాయుధాలను ఆధునికీకరించే ఫైలుపైనే అధ్యక్షుడిగా తొలి సంతకాన్ని పెట్టానని.. ప్రస్తుతం అణ్వాయుధాల విభాగంలో అమెరికా ఎన్నడూ లేనంత శక్తిమంతంగా, బలంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాపై క్షిపణి దాడి చేస్తామని హెచ్చరిక
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఉత్తర కొరియా
భారత్‌లో సన్‌రైజ్ ప్రాజెక్టుకు బ్రిటన్ సాయం
భారత్‌లోని మూరుమూల గ్రామాల్లో ఐదు స్వయం సమృద్ధి సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 12 బ్రిటిష్, భారత విశ్వవిద్యాలయాలకు 7 మిలియన్ పౌండ్ల (రూ.58.09 కోట్లు)ను బ్రిటన్ ప్రభుత్వం గ్రాంటుగా అందజేసింది. ఇందులో భాగంగా భారత్‌లో సౌరశక్తి పరికరాల కోసం కొత్త తయారీ విధానాన్ని అభివృద్ధి చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో సన్‌రైజ్ ప్రాజెక్టుకు 7 మిలియన్ పౌండ్ల సాయం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : బ్రిటన్
ఎందుకు : 5 స్వయం సమృద్ధి సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు
80 దేశాలకు ఖతర్ వీసాఫ్రీ ఆఫర్
భారత్ సహా 80 దేశాల నుంచి ఖతర్‌కు వచ్చే పర్యాటకులకు వీసాలు అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం ఆగస్టు 9న ప్రకటించింది. నాలుగు అరబ్బు దేశాల నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటుండటం, 2022లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకునేందుకు ఖతర్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త వీసా విధానం ప్రకారం 33 దేశాల (వీటిలో ఎక్కువగా యూరప్ దేశాలు ఉన్నాయి) పర్యాటకులు ఖతర్‌కు వచ్చి 90 రోజులు ఉండొచ్చు. మరో 47 దేశాల ప్రజలు 30 రోజుల వరకు వీసా లేకుండా ఖతర్‌లో ఉండొచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 80 దేశాలకు ఉచిత వీసా
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఖతర్
ఎందుకు : ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునేందుకు
కాట్మాండులో 15వ బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం
15వ బిమ్‌స్టెక్ (Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation-BIMSTEC) మంత్రుల సమావేశం నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగింది. ఆగస్టు 10, 11 తేదీల్లో జరిగిన ఈ సమావేశాన్ని నేపాల ప్రధానమంత్రి షేర్ బహదూర్ దుబా ప్రారంభించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, తీవ్రవాదం, దౌత్య సంబంధాలపై చర్చించిన నేతలు.. 2016లో జరిగిన గోవా రిట్రీట్ తీర్మానాల అమలుకు మరింత సమర్థంగా కృషి చేయాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 10, 11
ఎక్కడ : ఖాట్మండు, నేపాల్
గ్లోబల్ ట్యాంక్ రేసు నుంచి భారత్ ఔట్
రష్యాలో జరిగిన అంతర్జాతీయ ‘ట్యాంక్ బైథ్లాన్’ పోటీల తదుపరి దశ నుంచి భారత ఆర్మీ జట్టు వైదొలిగింది. భారత ప్రధాన యుద్ధ ట్యాంకు టీ-90లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్‌లో భాగంగా రష్యాలోని అలాబినో పర్వత ప్రాంతంలో జూలై 29న ప్రారంభమైన ఈ పోటీల్లో (28 ఈవెంట్లు ఉంటాయి) భారత్, చైనా, రష్యా సహా 19 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో టాప్-12 జట్లు రెండో దశ రిలే రేసుకు ఎంపికయ్యాయి. భారత్ గత మూడేళ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటోంది. ఈసారి పోటీల్లో భారత్ తొలిసారిగా టీ-90 ట్యాంకులతో బరిలో దిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్యాంకు బైథ్లాన్ 2017
ఎవరు : 19 దేశాలు
ఎక్కడ : రష్యాలో
అంటార్కిటికాలో 100 అగ్నిపర్వతాల గుర్తింపు
అంటార్కిటికాలో 100కు పైగా అగ్నిపర్వతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికా మంచు ఫలకానికి 2 కిలోమీటర్ల దిగువన ఈ పర్వతాలు ఉన్నాయని యూకేలోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. భూమిపై అతి ఎక్కువ అగ్నిపర్వతాలు గల ప్రాంతం ఇదేనని పేర్కొన్నారు. ఇవి 100 మీటర్ల నుంచి 3,850 మీటర్ల ఎత్తు ఉన్నాయని.. అన్ని పర్వతాలు దట్టమైన మంచు పొరలతో కప్పిఉన్నాయని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంటార్కిటికాలో 100కుపైగా అగ్నిపర్వతాల గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు
ఎక్కడ : యూకే
ఉత్తర కొరియా దిగుమతులను నిలిపేసిన చైనా
ఐక్యరాజ్యసమితి కొత్త ఆంక్షల నేపథ్యంలో.. మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. బొగ్గు, ఇనుము, ముడి ఇనుము, సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతులను ఆగస్టు 15 నుంచి నిషేధిస్తున్నామని వెల్లడించింది. గత ఫిబ్రవరి నుంచే బొగ్గు దిగుమతిని నిలిపివేయగా.. తాజాగా ఇనుము తదితరాలను నిలిపి వేస్తున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షలను అమలు చేయడం వల్ల చైనాకు సుమారు రూ.6,500 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తర కొరియా దిగుమతుల నిలిపివేత
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : చైనా
ఎందుకు : ఐరాస ఆంక్షల నేపథ్యంలో
పోలియో రహిత దేశంగా సోమాలియా
సోమాలియాను పోలియో రహిత దేశంగా ఐక్యరాజ్య సమితి ఆగస్టు 14న ప్రకటించింది. గత మూడేళ్లుగా ఆ దేశంలో ఎలాంటి పోలియో కేసులు నమోదు కానందున.. ఐరాస ఈ మేరకు ప్రకటన చేసింది. ఆఫ్గనిస్తాన్, నైజీరియా, పాకిస్తాన్ దేశాల్లో మాత్రం ఇంకా పోలియో కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పోలియో రహిత దేశంగా సోమాలియా
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎందుకు : 3 ఏళ్లుగా నమోదు కాని పోలియో కేసులు
ఉద్గారాల తగ్గింపుపై ఐరాసకు భారత్ హామీ
కర్బన ఉద్గారాల తగ్గింపుపై క్యోటో ప్రోటోకాల్‌కు అనుగుణంగా 2020 నాటికి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కట్టుబడిఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి ఆగస్టు 8న భారత్ హామీ పత్రం సమర్పించింది. 1997 డిసెంబర్‌లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్ 2005 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధనకు ఆయా దేశాలు కట్టుబడాల్సిన తొలి కాలవ్యవధి 2008-2012.
ఖతార్‌లోని దోహాలో 2012లో జరిగిన వాతావరణ సదస్సులో ఈ ఒప్పందానికి సవరణ తీసుకొచ్చారు. దీన్ని దోహా సవరణగా పిలుస్తారు. 2013 జనవరి నుంచి 2020 డిసెంబర్ వరకు సాధించాల్సిన లక్ష్యాలు, ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి.
ఆసియాన్ 50వ వార్షికోత్సవ ప్రకటన
ఆగ్నేసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 8న సమాఖ్య నేతలు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ఆసియాన్ 50వ వార్షికోత్సవాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా, ఆసియాన్ సమాజ నిర్మాణం సాధించిన విజయంగా పేర్కొంది.
రైజ్ బిల్లుకి ట్రంప్ ఆమోదం
అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) జారీకి అనుసరించిన లాటరీ విధానానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు స్వస్తి పలకనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. ఈ మేరకు గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్‌డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా బిల్లులో ప్రతిపాదించిన అంశాల ప్రకారం భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ, 26-30 ఏళ్ల మధ్య వయసు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం, మంచి వేతనం ఉంటే గ్రీన్‌కార్డులు పొందడం తేలిక కానుంది. ప్రస్తుతం అమెరికా ఏడాదికి 10 లక్షల గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. పదేళ్లలో సగానికి తగ్గించేలా ఈ బిల్లును రూపొందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైజ్ బిల్లుకి ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : అమెరికా
ఎందుకు : అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) జారీకి
కాలగర్భంలో 4000భాషలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న మూడింట రెండొంతుల భాషలు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచంలో మొత్తంగా 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 ఏడాదికల్లా 4000 భాషలు క్రమేపీ మూగబోయే ప్రమాదం ఉందని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పీఎల్‌ఎస్‌ఐ) తెలిపింది. 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం నిర్వహించిన ఈ సంస్థ.. భారత్‌లో సుమారు 400 భాషలు కనుమరుగు కానున్నాయని తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం తీరప్రాంతాల్లో మాట్లాడుతున్న భాషలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి దొరకక సంప్రదాయ మత్స్యకార వర్గాలు తీరానికి దూరమవుతున్నాయి. కాగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుతున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు కనుమరుగయ్యే ప్రమాదం లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి రావని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కనుమరుగు కానున్న 400 భాషలు
ఎప్పుడు : 2050 నాటికి
ఎవరు : పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా
ఎక్కడ : భారతదేశంలో
భారత్, చైనాలో యువ ఇంటర్నెట్ యూజర్స్ అధికం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 830 మిలియన్‌ల(83 కోట్ల) యువ ఇంటర్నెట్ వినియోగదారుల్లో 39 శాతం (320 మిలియన్) మంది భారత్, చైనాలోనే ఉన్నారు. ఐరాస అనుబంధ సంస్థ అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్(ఐటీయూ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలో యువ ఇంటర్నెట్ యూజర్స్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఐటీయూ, ఐరాస
ఎక్కడ : భారత్, చైనాలో 39 శాతం మంది
టిబెట్ పీఠభూమిపై ఎక్స్‌ప్రెస్ హైవే
ప్రపంచంలోనే ఎత్తయిన టిబెట్ పీఠభూమిపై చైనా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించింది. కింఘై ఫ్రావిన్స్‌లోని గాంగ్హె కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించారు. 634.8 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి చైనా వేల కోట్లను ఖర్చు చేసింది. దీన్ని సగటున 4 వేల మీటర్ల ఎత్తులో నిర్మించారు. రహదారిలో 36 శాతం పెర్మాఫ్రాస్ట్(మంచు)నేలపై ఉంటుంది. వాహనాల వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత మార్పుల కారణంగా నేల కరిగిపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను స్థిరంగా ఉంచి నిర్మాణం చేపట్టారు.
2050 నాటికి 15 కోట్ల మందికి పౌష్టికాహార లోపం
వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నతి పెరగడంతోపాటు వరి, గోధుమ వంటి పంటల్లో ప్రొటీన్ వంటి పౌష్టికాహార పదార్థాలు లుప్తమవుతాయని శాస్త్రవేత్తలు ఆగస్టు 2న హెచ్చరించారు. పర్యవసానంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పౌష్టికాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Published date : 17 Aug 2017 12:47PM