Skip to main content

African Union Joins in G20: జీ20 కూట‌మిలోకి ఆఫ్రికా యూనియన్

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో  55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి.
African Union Joins in G20
African Union Joins in G20

దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు. అనంతరం ప్రధాని మోదీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్  ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్‌లో కూర్చోవాల్సిందిగా కోరారు. సభ్యదేశాల ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అసోమానీని తన సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

G-20 Summit: G20 ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారో తెలుసా!

Published date : 11 Sep 2023 03:35PM

Photo Stories