Skip to main content

Turkey Earthquake: టర్కీలో భూకంపం.. 50 మందికి గాయాలు

ట‌ర్కీలోని డ్యూజ్ పట్టణ సమీపంలో న‌వంబ‌ర్ 23న భూకంపం సంభవించింది. భూకంపం దాటికి 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1 నమోదైంది.

టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు తూర్పున దాదాపు 210 కి.మీ దూరంలో డ్యూజ్ పట్టణం ఉంది. ఈ ప్రకంపనలు ఇస్తాంబుల్, దేశ రాజధాని అంకారాలో సంభవించాయ‌ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. భూకంపం లోతు 2 కిమీ నుంచి 10 కిమీ వరకు ఉండచ్చని అధికారులు అంచనా వేశారు. 

ఇండోనేసియాలో భూకంపం.. 268 మంది మృతి
ఇండోనేసియాలోని జావా దీవిలో నవంబర్‌ 21న వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్‌ చెప్పారు. 13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. నవంబర్‌ 22న దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు.

చ‌ద‌వండి:  జీ20 సారథిగా భారత్‌కు దక్కిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటే..

Published date : 23 Nov 2022 04:02PM

Photo Stories