World Air Quality Index : ఆసియా టాప్ - 10 కాలుష్య నగరాల్లో.. 8 భారత్ లోనే
Sakshi Education
ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి.
India Dominates Top 10 Most Polluted Cities In Asia
చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి.