World Press Freedom Day 2023: ప్రతికా స్వేచ్ఛలో దిగజారిన భారత్ ర్యాంక్... వారానికి ఇద్దరు చొప్పున జర్నలిస్టుల హత్య
![World Press Freedom Day](/sites/default/files/images/2023/05/03/press-freedom-1683116106.jpg)
చదవండి: మే అంతా పరీక్షా కాలం.. 7 పరీక్షలు ఈ నెలలోనే... రూల్స్ మార్చేసిన టీఎస్‌పీఎస్‌సీ
పత్రికారంగంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం, వృత్తి నిర్వహణలో జర్నలిస్టుల స్వేచ్ఛ, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో వారి సహకారం వంటి అంశాలపై ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా చర్చిస్తుంటారు.
ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. పత్రికారంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల హత్యలను ప్రెస్ ఎంబ్లెన్స్ క్యాంపెయిన్(PEC) తాజా గణాంకాలను వెల్లడించింది.
![Press Freedom](/sites/default/files/inline-images/Press%20Freedom%201.jpg)
2013 నుంచి ఇప్పటివరకు మొత్తం 1136 మంది జర్నలిస్టులు వృత్తి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. సగటున సంవత్సరంలో 113 మంది, వారానికి ఇద్దరు చొప్పున జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారు.
చదవండి: పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి
2022వ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 142వ స్థానంలో ఉంటే అది ఈ సంవత్సరం 150వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 380కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి. ఈ ఏడాది ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ మొదటి స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది.
![Press Freedom](/sites/default/files/inline-images/press.jpg)
ఈ యేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16 మంది జర్నలిస్టులు హత్యకు గురికాగా.. 2022లో 116, 2021లో 79, 2020లో 92, 2019లో 75, 2018లో 117, 2017లో 99, 2016లో 135, 2015లో 138, 2014లో 129, 2013లో 141 మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లు PEC నివేదిక తెలిపింది.
చాలా దేశాల్లో డిజిటల్ సాంకేతికత, స్వతంత్ర మీడియా వృద్ధి, అపరిమిత సమాచార వ్యాప్తిని సులభతరం చేశాయి. అయినప్పటికీ మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతోంది. ప్రాథమిక మానవ హక్కులపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తోంది.