Skip to main content

Friendship Recession: మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్‌ కామత్‌ ఏమన్నారు?

Nikhil Kamath

ప్రపంచాన్ని మరో కొత్త మాంద్యం చుట్టుముడుతుందట.. అదే ‘స్నేహ మాంద్యం’ (friendship recession). ప్రముఖ స్టాక్‌ బ్రోకరింగ్‌ సంస్థ జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, ఇటీవలే తన సోదరుడు, వ్యాపార భాగస్వామి నితిన్‌తో కలిసి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో చేరిన నిఖిల్‌ కామత్ ఈ మాట అన్నారు. జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను ఇలా గుర్తు చేశారు.

ఒంటరితనం, స్నేహ బంధానికి సంబంధించి అమెరికన్ పర్‌స్పెక్టివ్స్ సర్వే గ్రాఫిక్ చిత్రాలను నిఖిల్‌ కామత్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆప్యాయతను పంచే మిత్రులు, సంక్షోభ సమయాల్లో ధైర్యాన్నిచ్చే ఆత్మీయ స్నేహితులు తగ్గిపోవడాన్ని స్నేహ మాంద్యంగా ఆ చిత్రాల్లో పేర్కొన్నారు. ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం అని కూడా అందులో రాసి ఉంది.

చ‌ద‌వండి: Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి

తనకు సోదరులలాంటి ఐదుగురు స్నేహితులు ఉన్నారని, వారి కోసం తాను ఏదైనా చేస్తానని నిఖిల్‌ కామత్‌ వెల్లడించారు. స్నేహ బంధం జీవితాన్ని మారుస్తుందన్నారు. ఈ ట్వీట్‌లో ఆయన స్నేహానికి సంబంధించిన విషయాలతోపాటు మానవ సంబంధాలు, వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తుచేశారు. వీటికి  సంబంధించిన వివరణాత్మక గ్రాఫ్‌ను షేర్‌ చేశారు.

Published date : 27 May 2023 03:29PM

Photo Stories