Skip to main content

WEF లైట్‌హౌస్‌ నెట్‌వర్క్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ప్లాంటు

గ్లోబల్‌ లైట్‌హౌస్‌ నెట్‌వర్క్‌ (జీఎల్‌ఎన్‌)లో కొత్తగా 11 ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సైట్లను చేర్చినట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వెల్లడించింది.
World Economic Forum Recognises Dr. Reddy's Hyderabad
World Economic Forum Recognises Dr. Reddy's Hyderabad

ఈ జాబితాలో భారత్‌ నుంచి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) హైదరాబాద్‌ ప్లాంటు, శ్రీసిటీలోని మాండెలీజ్‌ ఫ్యాక్టరీ, ఇండోర్‌లోని సిప్లా ప్లాంటు ఉన్నాయి. 

Also read: సెప్టెంబర్‌లో GST వసూళ్లు రూ.1.47లక్షల కోట్లు

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషి యల్  ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్, బిగ్‌ డేటా అనలిటిక్స్‌ వంటి విప్లవాత్మకమైన సాంకేతికతలను ఉపయోగించడంలో ముందుంటున్న 100 పైగా తయారీ సంస్థలు జీఎల్‌ఎన్‌లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న నాణ్యత ప్రమాణాల అంచనాలను అందుకునేందుకు డీఆర్‌ఎల్‌ హైదరాబాద్‌ ప్లాంటు భారీ స్థాయిలో డిజిటలీకరణ చేపట్టినట్లు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. తయారీ వ్యయాలను 43 శాతం మేర తగ్గించుకున్నట్లు పేర్కొంది. పాతికేళ్ల హైదరాబాద్‌ ప్లాంటుకు డిజిటల్‌ లైట్‌హౌస్‌ ఫ్యాక్టరీ హోదా దక్కడం గర్వకారణమని డీఆర్‌ఎల్‌ గ్లోబల్‌ హెడ్‌ (తయారీ విభాగం) సంజయ్‌ శర్మ తెలిపారు. 

Also read: S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్‌’ భారత్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్‌ ఆటోమేషన్స్‌ మొదలైన వాటితో శ్రీ సిటీలోని ప్లాంటులో మాండెలీజ్‌ సంస్థ తయారీ వ్యయాలను 38 శాతం తగ్గించుకుందని, కార్మికుల ఉత్పాదకతను 89 శాతం మేర పెంచుకుందని డబ్ల్యూఈఎఫ్‌ వివరించింది. అంతర్జాతీయంగా మాండెలీజ్‌కు ఉన్న ఫ్యాక్టరీలకు ఈ ప్లాంటు ప్రామాణికంగా మారిందని తెలిపింది. లైట్‌హౌస్‌ నెట్‌వర్క్‌లోని నాలుగు సంస్థలకు అత్యుత్తమమైన సస్టెయినబిలిటీ లైట్‌హౌస్‌ల హోదా ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది.  

Also read: Small savings schemes interest rates పెంపు

Published date : 12 Oct 2022 06:36PM

Photo Stories