Skip to main content

Growth Rate: ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. గత ఏడేళ్లలో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి శాతం ఎంత?

Money

తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. పలు అంశాల్లో జాతీయ సగటుకు రెండింతలకుపైగా వృద్ధిని సాధించింది. ప్రస్తుత ధరల ప్రాతిపదికన.. 2013–14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ విలువ.. 2020–21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు తెలంగాణ రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచాయి. గత ఏడేళ్లలో రాష్ట్రం సొంత పన్నులు, పన్నేతర ఆదాయాన్ని సైతం భారీగా పెంచుకుంది. కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం భారీగా రుణాలు తీసుకుంటుండటంతో ఏటేటా అప్పులు కూడా పెరిగిపోయాయి.  బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రెవెన్యూ మిగులును చూపుతున్నా.. భారీ ఆర్థికలోటు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

ఆర్‌బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు... 

  • పప్పుధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి దేశ సగటు 34.2 శాతంకాగా.. రాష్ట్రం 108.8 శాతం వృద్ధిని సాధించింది. 
  • వరి ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా సగటున 12.7 శాతం, రాష్ట్రం 67.3 శాతం వృద్ధి నమోదైంది. 
  • పత్తిసాగులో దేశవ్యాప్తంగా సగటున 3.6 శాతం, రాష్ట్రం 79.8 శాతం వృద్ధి సాధించాయి. 
  • మాంసం ఉత్పత్తిలో దేశ సగటు వృద్ధి 28.5 శాతంకాగా.. రాష్ట్రం 67.9 శాతం వృద్ధి నమోదు చేసింది. 
  • సాగునీటి సౌకర్యాలలో రాష్ట్రం 34.2 శాతం వృద్ధి సాధించగా.. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి –11.1గా ఉంది. 
  • మొత్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సగటున 2.2 శాతం, రాష్ట్రం 22.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 

రాష్ట్ర జీఎస్డీపీ విలువ (రూ.కోట్లలో)
2013–14లో 4,51,580.40 
2020–21లో 9,80,407.01

రాష్ట్ర సొంత ఆదాయం తీరు (రూ. కోట్లలో)
పన్నుల ఆదాయం

2014–15లో 29,288
2020–21లో 85,300

రాష్ట్ర అప్పులు.. (రూ.కోట్లలో)
2015లో 72,658 
2021 నాటికి 2,52,325 

ఏడేళ్లలో రంగాల వారీగా రాష్ట్రంలో నమోదైన వృద్ధి.. (రూ.కోట్లలో)

అంశం

2013–14

2020–21

వృద్ధిరేటు

మొత్తం జీఎస్డీపీ విలువ

4,51,580.40

9,80,407.01

117

వ్యవసాయ రంగంలో..

47,092.85

80,574.00

71

తయారీ రంగంలో..

57,148.39

94,020.80

64.5

నిర్మాణ రంగంలో..

24,582.42

37,029.76

50.6

పారిశ్రామిక రంగంలో..

1,02,825.74

1,79,884.62

74.9

సేవల రంగంలో..

2,42,272.96

5,33,230.87

120

బ్యాంకింగ్, బీమా రంగంలో

26,595.53

53,145.22

99.8

జీఎస్డీపీ అంటే..?
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ/జీఎస్డీపీ) అంటారు. సదరు దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటన్నది దీనితో అంచనా వేయవచ్చు.
 

చ‌ద‌వండి: నాలుగు ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం ఈ–కామర్స్‌ సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 117 శాతంగా నమోదైంది.  
ఎప్పుడు  : నవంబర్ 25
ఎవరు    : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక 
ఎందుకు  : ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు తెలంగాణ రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచినందున..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 26 Nov 2021 05:45PM

Photo Stories