Innovation Centre: ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం చేసుకున్న సంస్థ?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీ హైదరాబాద్)లో సుజుకీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు కానుంది. టెక్నాలజీ రిసెర్చ్ పార్క్‌లో దీనిని అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్‌ఎమ్‌సీ), ఐఐటీ హైదరాబాద్ మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరింది. భారత్, జపాన్ మార్కెట్ కోసం ఆవిష్కరణలపై ఈ కేంద్రం దృష్టిసారిస్తుంది.
6.57 శాతంగా దేశ నిరుద్యోగ..
దేశంలో నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గుతోంది. 2022, జనవరిలో ఈ సమస్య 6.57 శాతంగా ఉంది. 2021 మార్చి తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టడం, నిబంధనలు సడలించడంతో మార్కెట్ తిరిగి పుంజుకుందని పేర్కొంది. సీఎంఐఈ తెలిపిన వివరాల ప్రకారం..
- 2022, జనవరిలో నిరుద్యోగిత రేటు భారత్ పట్టణ ప్రాంతంలో 8.16 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 5.84 శాతంగా ఉంది.
- 2021, డిసెంబర్‌లో నిరుద్యోగ సమస్య 7.91 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో 9.30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.28 శాతంగా ఉంది.
- 2021 డిసెంబర్ నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 5.3 కోట్లుగా అంచనా.
సుహానా సైనీ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్‌లో జనవరి 4న జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది.
Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్ 2022–23
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీ హైదరాబాద్)తో ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : సుజుకీ మోటార్ కార్పొరేషన్
ఎందుకు : ఐఐటీ హైదరాబాద్‌లో సుజుకీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్