Motor Floater Policy: ఒకటికి మించిన వాహనాలకు ఒకే బీమా ప్లాన్
ఒక వ్యక్తికి కారు, బైకు ఉన్నా.. రెండింటికీ కలిపి ఒకే వాహన బీమా తీసుకునేలా వీలు కల్పిస్తూ.. మోటారు ఇన్సూరెన్స్ పాలసీలకు అధునాతన ఫీచర్లతో కూడిన యాడాన్‌లను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతించింది.
కొత్త యాడాన్‌లు..: మోటారు ఓన్ డ్యామేజ్ (ఓడీ) అన్నది బేసిక్ మోటారు బీమా ప్లాన్. ఇందులో వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం ఏర్పడితే కవరేజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ‘పే యాజ్ యూ డ్రైవ్, పే హౌ యూ డ్రైవ్’ అనే కాన్సెప్ట్ తోడు కానుంది. వాహనాన్ని నడిపిన మేరకు, నడిపే తీరుకు అనుగుణంగా బీమా సంస్థ టెక్నాలజీ సాయంతో ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.
Also read: GK Economy Quiz: US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట రికార్డు ఎంత?
దాహరణకు తక్కువ దూరం నడిపేవారికి తక్కువ ప్రీమియం, ఎక్కువ దూరం నడిపేవారికి కొంచెం ఎక్కువ ప్రీమియం ఇలా అన్నమాట. లేదంటే తక్కువ దూరం, సురక్షిత డ్రైవింగ్ విధానాన్ని అనుసరించే వారికి తక్కువ ప్రీమియానికే మరింత కవరేజీ లభించొచ్చు. అలాగే, ఒకే వాహనదారుడికి ఒకటికి మించిన వాహనాలు ఉంటే అన్నింటికీ కలిపి ఫ్లోటర్ పాలసీ జారీ చేసేందుకు కూడా ఐఆర్‌డీఏఐ అనుమతించింది.