Skip to main content

Telecom Company: భారత్‌ నుంచి లీడర్‌షిప్‌ ర్యాంకింగ్‌ దక్కించుకున్న ఏకైక సంస్థ?

Jio

అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్‌షిప్‌ రేటింగ్‌ దక్కింది. లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ... 2021 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌ 9న విడుదల చేసిన ఈ జాబితాలో, భారత్‌ నుంచి లీడర్‌షిప్‌ ర్యాంకింగ్‌ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్‌ సంస్థ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్‌ లభించింది.

ముఖ్యాంశాలు..

  • ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ గల 272 కంపెనీలపై అధ్యయనం చేసి 2021 ఏడాది జాబితాను సీడీపీ రూపొందించింది. 
  • వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చారు.
  • 2020 ఏడాది ’బి’ రేటింగ్‌ నుంచి జియో 2021 ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్‌టెల్‌ రేటింగ్‌ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది.

సీడీపీ గురించి..

సీడీపీ అనేది అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ. ఇది కంపెనీలు, నగరాలు తమ పర్యావరణ ప్రభావాన్ని వెల్లడించడంలో సహాయపడుతుంది. 2002 నుండి 8,400 కంపెనీలు సీడీపీ ద్వారా పర్యావరణ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాయి. సీడీపీ సంస్థను గతంలో కార్బన్‌ డిస్‌క్లోజర్‌ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు.
చ‌ద‌వండి: ఎన్‌ఎంపీ కింద ఎన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
 2021 సంవత్సరానికి సంబంధించి సీడీపీ విడుదల చేసిన జాబితాలో భారత్‌ నుంచి లీడర్‌షిప్‌ ర్యాంకింగ్‌ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్‌ సంస్థ? 
ఎప్పుడు : డిసెంబర్‌ 9
ఎవరు    : దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో
ఎందుకు : వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా ఉత్తమ పనితీరు కనబరిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Dec 2021 05:07PM

Photo Stories