Gold Purchases: భారత్ ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా ఎంత శాతం?
Sakshi Education
అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన పసిడి నిల్వల పెంపుపై దృష్టి సారిస్తోంది.
2021 క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) రికార్డు స్థాయిలో 29 టన్నులు కొనుగోలు చేసింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఆర్‌బీఐ పసిడి నిల్వలో 27 శాతం పెరుగుదల కనిపించింది. తాజా గణాంకాల ప్రకారం...
- ఆర్‌బీఐ నిర్వహణలో ఉండే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా ఉండే పసిడి పరిమాణం 2021 జూన్ 30 నాటికి 705.6 టన్నులకు చేరింది. 2018 ప్రారంభంలో ఈ పరిమాణం 558.1 టన్నులు.
- ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం ఫారెక్స్ నిల్వల్లో 2021, ఆగస్టు 27తో ముగిసే త్రైమాసికానికి పసిడి వాటా దాదాపు 6 శాతంగా ఉంది.
- ఆగస్టు 27వ తేదీతో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 633.558 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.46 లక్షల కోట్లు) చేరాయి.
అత్యధిక పసిడి నిల్వలు ఉన్న టాప్–10 దేశాలు దేశం నిల్వలు నిల్వల్లో వాటా (శాతాల్లో) అమెరికా 8,133.5 77.5 జర్మనీ 3,362.4 74.5 ఇటలీ 2,451.8 69.3 ఫ్రాన్స్ 2,436.2 64.5 రష్యా 2,298.5 22.0 చైనా 1,948.3 3.3 స్విట్జర్లాండ్ 1,040.0 5.4 జపాన్ 765.2 3.1 భారత్ 705.6 6.0 నెదర్లాండ్స్ 612.5 67.4
Published date : 23 Sep 2021 01:09PM