ఫిబ్రవరి 2020 ఎకానమీ
Sakshi Education
జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్‌వ్స) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2020, ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.091 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 476.092 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 1.701 బిలియన్ డాలర్లు పెరిగి 473 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 2.763 బిలియన్ డాలర్లు పెరిగి 441.949 బిలియన్ డాలర్లకి చేరాయి. బంగారం నిల్వలు 344 మిలియన్ డాలర్లు తగ్గి 29.123 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
భారత జీడీపీ వృద్ధి రేటు 6 శాతం: ఎస్‌అండ్‌పీ
2020-2021లో భారతదేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ- స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) అంచనావేసింది. 2021-2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్ సార్వభౌమ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’గా కొనసాగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని ‘బీబీబీ’ రేటింగ్ సూచిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-2021లో భారతజీడీపీ వృద్ధి రేటు 6 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ)
2020లో భారత్ వృద్ధి 5.4 శాతమే: మూడీస్
భారత్ ఆర్థిక వృద్ధి 2020 అంచనాలకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్ కోత పెట్టింది. దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటును 6.6 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఫిబ్రవరి 17న అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. ఆర్థిక రికవరీ అంచనాలకన్నా నెమ్మదిగా ఉండటమే వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని మూడీస్ తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఇక 2021లో భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకూ మూడీస్ కోత పెట్టింది. ఈ రేటును 6.7 శాతం నుంచి 6.6 శాతానికి కుదించింది.
ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
2019లో బ్రిటన్, ఫ్రాన్స్ లను అధిగమించి భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని యూఎస్‌కు చెందిన విశ్లేషణా సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ఒకటి తెలిపింది. భారత్ జీడీపీ విలువను 2.94 ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. బ్రిటన్ ఎకానమీ పరిమాణాన్ని 2.83 ట్రిలియన్ డాలర్లుగా, ఫ్రాన్స్ కు సంబంధించి ఈ విలువను 2.71 ట్రిలియన్ డాలర్లుగా పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020లో భారత్ వృద్ధి 5.4 శాతమే
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్
ఎన్‌పీఏల భారం తగ్గుతోంది: నిర్మలా
ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 10న లోక్‌సభలో తెలిపారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఎన్‌పీఏల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్‌లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌పీఏల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ప్రపంచ వృద్ధి అంచనాలు 2.2 శాతానికి కుదింపు
2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘చైనాలో బైటపడిన కోవిడ్-19(కరోనా) వైరస్ ప్రపంచ ఎకానమీకి ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది‘ అని ఈఐయూ తన నివేదికలో పేర్కొంది.
చైనా జీడీపీ వృద్ధి 5.4 శాతం..
కోవిడ్-19 ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. ‘2020, మార్చి ఆఖరు నాటికల్లా వైరస్ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం’ అని ఈఐయూ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ వృద్ధి అంచనాలు 2.2 శాతానికి కుదింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)
ఎందుకు : కోవిడ్-19 ప్రపంచ ఎకానమీకి ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో...
వివాద్ సే విశ్వాస్ పథకం పరిధి విస్తరణ
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం పరిధిని విస్తరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘వివాద్ సే విశ్వాస్ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది. తాజా బిల్లు ప్రకారం రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు కూడా వివాద్ సే విశ్వాస్ పథకంలోకి వస్తాయి. అలాగే పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి.
మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లుకి ఆమోదం
12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు ఉద్దేశించిన ‘మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు-2020’కి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ బిల్లు తోడ్పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వివాద్ సే విశ్వాస్ పథకం పరిధి విస్తరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు కూడా వివాద్ సే విశ్వాస్ పథకంలోకి తెచ్చేందుకు
బంగారం డిమాండ్ 9 శాతం తగ్గింది : డబ్ల్యూజీసీ
ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్ తగ్గడానికి దారితీసిందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 30న ఒక నివేదికను విడుదల చేసింది.
డబ్ల్యూజీసీ నివేదికలోని ప్రధానాంశాలు..
ఏమిటి : బంగారం డిమాండ్ 2019లో 9 శాతం తగ్గింది
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ)
ఎక్కడ : భారత్
ఎందుకు : ధరల తీవ్రత కారణంగా
అమల్లోకి రూ. 5 లక్షల డిపాజిట్ బీమా
బ్యాంకు డిపాజిట్లకు పెంచిన బీమా కవరేజీ ఫిబ్రవరి 4 నుంచే అమల్లోకి తెచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు 2020-21 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐలో భాగమైన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఈసీజీసీ) ఈ కవరేజీ ఇస్తుంది.
బీమా కవరేజీ పెంపుకు డీఎఫ్‌ఎస్ ఆమోదం
డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) ఆమోదం తెలిపింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దీన్ని సవరించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 4న తెలిపారు. ప్రతి రూ. 100 డిపాజిట్‌పై బ్యాంకులు ఇకపై 12 పైసల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమల్లోకి రూ. 5 లక్షల డిపాజిట్ బీమా
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు శక్తికాంతదాస్ ప్రకటించారు.
వృద్ధి రేటు 5 శాతం
2019-20లో దేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2020-21లో 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020-21 తొలి ఆరు నెలల్లో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5-6 శాతానికి తగ్గించింది.
సీఆర్‌ఆర్ నిబంధనల సడలింపు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్‌ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది 2020 ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం-ముఖ్యాంశాలు
ఏమిటి : యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)
ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
కొత్త, పాత విధానాల్లో ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదాయ పన్ను శాఖ ఫిబ్రవరి 6న ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్ మొదలైన వివరాలన్నీ ఇందులో పొందుపరిస్తే.. పాత, కొత్త విధానాల్లో పన్ను భారాలను తెలుసుకోవచ్చు.
బడ్జెట్‌లో..
కొన్ని మినహాయింపులను వదులుకున్న పక్షంలో తక్కువ పన్ను భారం వర్తించేలా 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విధానంలో ఆదాయాన్ని బట్టి 5, 10, 30 శాతాల్లో పన్నులు ఉంటున్నాయి. ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ఆదాయ పన్ను శాఖ
ఎందుకు : ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా

- 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు. 2019లో 690 టన్నులుగా ఉంది.
- విలువ పరంగా మాత్రం భారత్ పసిడి డిమాండ్ రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరిగింది.
- దేశ పసిడి డిమాండ్‌లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంది.
- చైనా తర్వాత పసిడి డిమాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 2020లో ఈ మెటల్ డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా. ప్రభుత్వం తీసుకునే పలు చర్యలతో ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండడం దీనికి కారణం.
ఏమిటి : బంగారం డిమాండ్ 2019లో 9 శాతం తగ్గింది
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ)
ఎక్కడ : భారత్
ఎందుకు : ధరల తీవ్రత కారణంగా
అమల్లోకి రూ. 5 లక్షల డిపాజిట్ బీమా
బ్యాంకు డిపాజిట్లకు పెంచిన బీమా కవరేజీ ఫిబ్రవరి 4 నుంచే అమల్లోకి తెచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు 2020-21 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐలో భాగమైన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఈసీజీసీ) ఈ కవరేజీ ఇస్తుంది.
బీమా కవరేజీ పెంపుకు డీఎఫ్‌ఎస్ ఆమోదం
డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) ఆమోదం తెలిపింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దీన్ని సవరించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 4న తెలిపారు. ప్రతి రూ. 100 డిపాజిట్‌పై బ్యాంకులు ఇకపై 12 పైసల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమల్లోకి రూ. 5 లక్షల డిపాజిట్ బీమా
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ఆర్‌బీఐ ముందుకు వచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు శక్తికాంతదాస్ ప్రకటించారు.
వృద్ధి రేటు 5 శాతం
2019-20లో దేశ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. 2020-21లో 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020-21 తొలి ఆరు నెలల్లో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5-6 శాతానికి తగ్గించింది.
సీఆర్‌ఆర్ నిబంధనల సడలింపు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్‌ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది 2020 ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం-ముఖ్యాంశాలు
- వడ్డీ రేట్ల యథాతథ స్థితికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.
- దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి.
- ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్‌బీఐ పేర్కొంది.
- తదుపరి ఆర్‌బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది.
ఏమిటి : యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)
ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
కొత్త, పాత విధానాల్లో ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదాయ పన్ను శాఖ ఫిబ్రవరి 6న ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్‌ను ఆవిష్కరించింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్ మొదలైన వివరాలన్నీ ఇందులో పొందుపరిస్తే.. పాత, కొత్త విధానాల్లో పన్ను భారాలను తెలుసుకోవచ్చు.
బడ్జెట్‌లో..
కొన్ని మినహాయింపులను వదులుకున్న పక్షంలో తక్కువ పన్ను భారం వర్తించేలా 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విధానంలో ఆదాయాన్ని బట్టి 5, 10, 30 శాతాల్లో పన్నులు ఉంటున్నాయి. ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : ఆదాయ పన్ను శాఖ
ఎందుకు : ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా
Published date : 01 Mar 2020 03:02PM