Skip to main content

GST : అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో రూ.1.52 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ వసూళ్లు 16.5 శాతం అధికం. ఇక ఈ స్థాయిలో వసూళ్లు జరగడం జీఎస్‌టీ చరిత్రలో రెండవసారి.
October GST collection stands at Rs 1.52 lakh crore
October GST collection stands at Rs 1.52 lakh crore

ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో రూ.1.68 లక్షల కోట్లు నమోదుకాగా, సెప్టెంబర్‌లో ఈ విలువ రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది.  పండుగల సీజన్‌లో ఎకానమీ ఉత్సాహభరిత క్రియాశీలతను తాజా గణాంకాలు ప్రతిబింబిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Also read: Retail inflation: సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.41%


 గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. 

అక్టోబర్‌లో మొత్తం రూ.1,51,718 కోట్ల వసూళ్లు జరిగాయి. ఇందులో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.26,039 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ రూ.33,396 కోట్లు. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.81,778 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.37,297 కోట్లుసహా). సెస్‌ రూ.10,505 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.10,505 కోట్లుసహా) 

Also read: FY23 GDP growth: భారత్‌ వృద్ధికి IMF రెండో కోత

జీఎస్‌టీ వసూళ్లు వరుసగా 8 నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. 

2022 సెప్టెంబర్‌ నెలలో 8.3 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్‌ ఆయ్యాయి. 2022 అక్టోబర్‌ నెలలో ఈ సంఖ్య 7.7 కోట్లుగా ఉంది.

2022 నుంచి ఇలా... 

Also read: సెప్టెంబర్‌లో GST వసూళ్లు రూ.1.47లక్షల కోట్లు

నెల            జీఎస్‌టీ ఆదాయం  (రూ.కోట్లలో) 
జనవరి 2022     1,40,986 
ఫిబ్రవరి        1,33,026 
మార్చి        1,42,095 
ఏప్రిల్‌        1,67,650 
మే         1,40,885 
జూన్‌        1,44,616 
జూలై        1,48,995 
ఆగస్టు         1,43,612 
సెప్టెంబర్‌         1,47,686 
అక్టోబర్‌        1,51,718

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Nov 2022 03:41PM

Photo Stories