Skip to main content

Direct Tax Collection: 2022–23లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.61 లక్షల కోట్లు

భారత్‌ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 18 శాతం పెరిగి, రూ.16.61 లక్షల కోట్లకు ఎగశాయి.
Direct Tax

ఆర్థిక శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.12 లక్షల కోట్లు. రిఫండ్స్‌ను సర్దుబాటు చేయకుండా స్థూలంగా చూస్తే, పన్ను వసూళ్లు రూ.19.68 లక్షల కోట్లని ఆర్థికశాఖ వివరించింది. వీటిలో నుంచి మార్చి 31 వరకూ రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్‌ జరిగాయి. 

 

Published date : 04 Apr 2023 06:01PM

Photo Stories