Skip to main content

మార్చి 2019 ఎకానమీ

భారత వృద్ధి రేటు 6.8 శాతం : ఫిచ్
Current Affairs 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఊహించినదానికన్నా బలహీనమైన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా మార్చి 22న విడుదల చేసిన అవుట్‌లుక్‌లో పేర్కొంది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధిని 7.2 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. 2020-21లో భారత వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు 2018, 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం, 3.1 శాతంగా అంచనావేసిన ఫిచ్ దీనిని వరుసగా 3.2 శాతం, 2.8 శాతానికి ఫిచ్ తగ్గించింది. 2017-18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు 6.8 శాతం
ఎప్పుడు : 2019-2020 ఆర్థిక సంవత్సరం
ఎవరు : రేటింగ్ ఏజెన్సీ ఫిచ్

వ్యాపారంలో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం
Current Affairs అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విసృ్తతికి పరస్పర సహకారం లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ చైనా (బీఓసీ) మార్చి 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో రెండు బ్యాంకుల క్లయింట్లు విసృ్తత స్థాయిలో సేవలనూ పొందవచ్చు. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విసృ్తతికి రెండు బ్యాంకులూ వేర్వేరుగానూ తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐకి షాంఘైలో బ్రాంచీ ఉంది. అలాగే మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ అయిన బీఓసీ ముంబైలో తన బ్రాంచీని విసృ్తతం చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ చైనా ఒప్పందం
ఎప్పుడు : మార్చి 19
ఎందుకు : అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విసృ్తతికి

బంగారం నిల్వలు పెంచుకుంటున్న రిజర్వ్ బ్యాంక్

వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. జనవరిలో 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం భారత విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) పసిడి వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018లో 6.2 శాతంగా ఉన్న పరిమాణం జనవరిలో మరికాస్త పెరిగి 6.4 శాతానికి చేరింది. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. 612.5 టన్నులతో నెదర్లాండ్‌‌స 10వ స్థానంలో ఉంది. రెండు దేశాల నిల్వల మధ్య వ్యత్యాసం కేవలం 5.5 టన్నులు మాత్రమే ఉండటంతో.. త్వరలోనే భారత్ 10వ స్థానానికి చేరొచ్చన్న డబ్ల్యూజీసీ భావిస్తోంది. నెదర్లాండ్‌‌స సెంట్రల్ బ్యాంక్ పసిడి నిల్వల్లో గత దశాబ్దకాలంగా పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. అంతక్రితం దాకా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్‌తో ఒప్పందాల కారణంగా నెదర్లాండ్‌‌స పసిడి విక్రయిస్తూ నిల్వలను తగ్గించుకుంటూ వచ్చింది. తాజా నిల్వల గణాంకాల ప్రకారం భారత్ త్వరలోనే నెదర్లాండ్‌‌స స్థానాన్ని ఆక్రమించే అవకాశముందని అంచనాలున్నాయి.
సెంట్రల్ బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు...

దేశం

టన్నులు

ఫారెక్స్‌లో వాటా %

అమెరికా

8,133.5

75

జర్మనీ

369.7

70.6

ఐఎంఎఫ్

2,814

-

ఇటలీ

2,451.8

66.9

ఫ్రాన్స్

2,436

60.8

రష్యా

2,119.2

18.9

చైనా

1,864.3

2.5

స్విట్జర్లాండ్

1,040

5.6

జపాన్

765.2

2.5

నెదర్లాండ్‌‌స

612.5

65.7

భారత్

607

6.4

ఈసీబీ

504.8

28.3

(2019 జనవరిలో డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం)
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగారం నిల్వలు పెంచుకుంటున్న రిజర్వ్ బ్యాంక్
ఎక్కడ : భారత్
ఎందుకు : వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో..

ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్ సీజీఎం జె.స్వామినాథన్ మార్చి 15న బ్యాంక్ ఆవరణలో సేవలను ప్రారంభించారు.
16,500 ఏటీఎంల్లో సేవలు..
దేశంలోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎం సెంటరల్లో యోనో క్యాష్ సేవలను వినియోగించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దేశంలోని 16,500 ఏటీఎంలు యోనో క్యాష్ పాయింట్లుగా మారతాయని పేర్కొంది. భౌతికంగా డెబిట్ కార్డు లేకుండా విత్‌డ్రా సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచిందని బ్యాంక్ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా
ఎప్పుడు : మార్చి 15 నుంచి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలు

తొలిసారిగా రూ. 20 నాణేలు ఆవిష్కరణ
Current Affairs ప్రస్తుతం ఉన్న నాణేలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.20 నాణేలను అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీలో మార్చి7న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 నాణేన్ని ఆవిష్కరించారు. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనితో పాటు రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 నాణేల్లో కూడా కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అంధులు కూడా సులువుగా గుర్తించగలిగే రీతిలో వీటిని రూపొందించారు.
రూ.20 నాణెం బరువు సుమారు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. పాత, కొత్త నాణేలకు మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించేలా ఈ కాయిన్స్ ముద్రణ ఉంటుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 20 నాణేలు ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ

గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు
ఆదాయ పన్ను చట్టం-1961 సెక్షన్ 10 (10)(3) ప్రకారం గ్రాట్యుటీపై ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక శాఖ రెట్టింపు చేసిందని కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ మార్చి 7న తెలిపారు. ఇప్పటి వరకు రూ.10 లక్షలు ఆపైన గ్రాట్యుటీపై ఆదాయ పన్ను భారం పడుతుండగా ఇకపై రూ.20 లక్షల వరకు ఈ పరిమితి పెరగనుంది. ఈ నిర్ణయం అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం 2018 మార్చిలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితులు, సంస్థల చెల్లింపు సామర్థ్యం, ఉద్యోగుల వేతనం ఆధారంగా గ్రాట్యుటీ చెల్లింపు పరిమితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ

సెంట్రల్ బ్యాంక్ రేటింగ్ అప్‌గ్రేడ్ : మూడీస్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మార్చి 11న తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రప్రభుత్వం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ-3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది.
2019, ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెంట్రల్ బ్యాంక్, ఓవర్‌సీస్ బ్యాంక్ డిపాజిట్స్ రేటింగ్ అప్‌గ్రేడ్
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్

వ్యవస్థలోకి రాని నగదు 10720 కోట్లు : ఆర్ బీఐ
2016 నవంబర్ 8న నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) చేసేనాటికి వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం రూ.15.31 లక్షల కోట్లుగా ఉన్నాయని కేవలం రూ.10,720 కోట్లు మాత్రమే తిరిగి వ్యవస్థలోకి రాలేదని మార్చి 11న వివరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం స్వల్పకాలంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వానికి వివరించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెద్దనోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి రాని నగదు రూ.10,720 కోట్లు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)

సంస్కరణల అజెండా అమల్లో పీఎన్‌బీ అగ్రస్థానం
Current Affairs సంస్కరల అజెండాను సమర్థంగా అమలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు బీసీజీ-ఐబీఏ రూపొందించిన ఈజ్ (ఎన్‌హాన్స్ డ్ యాక్సెస్, సర్వీస్ ఎక్సలెన్స్) సూచీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28న విడుదల చేశారు. డిజిటలైజేషన్, రుణ వితరణ సహా 6 విభాగాల్లో 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ సూచీలో 100 పాయింట్లకు గాను పీఎన్‌బీ 78.4 పాయింట్లు పొంది మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బీఓబీ (77.8 పాయింట్లు), ఎస్‌బీఐ (74.6 పాయింట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69 పాయింట్లు), కెనరా బ్యాంకు (67.5 పాయింట్లు), సిండికేట్ బ్యాంక్ (67.1 పాయింట్లు) నిలిచాయి.
సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ-ఐబీఏ ఈజ్ సూచీని రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంస్కరణల అజెండా అమల్లో పీఎన్‌బీ అగ్రస్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : బీసీజీ-ఐబీఏ

మార్కెట్ల బలోపేతం దిశగా సెబీ నిర్ణయాలు
దేశీయ ఈక్విటీ, క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం, విసృ్తతం చేసే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) మార్చి 1న నిర్ణయాలు తీసుకుంది. ట్రేడింగ్ చార్జీల భారాన్ని తగ్గించడం నుంచి స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లను అనుమతించడం వరకు ఎన్నో కీలక నిర్ణయాలను వెలువరించింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ను మరింత చౌకగా మార్చే దిశగా ఫీజులను భారీగా తగ్గించింది. ప్రస్తుతం సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగి ఉన్నారు.
సెబీ నిర్ణయాలు..

  • బ్రోకర్లు చెల్లించే ఫీజులను 33.33 శాతం తగ్గించింది. దీని ప్రకారం కోటి రూపాయల లావాదేవీల విలువపై రూ.15 చార్జీ కాస్తా రూ.10కి తగ్గింది.
  • వ్యవసాయ ఉత్పత్తుల (అగ్రి కమోడిటీలు)పై ఫీజును ఏకంగా 93.33 శాతం తగ్గించింది. రూ.కోటి విలువ లావాదేవీలపై చార్జీని రూ.15 నుంచి రూ.1 చేసింది.
  • కస్టోడియన్లకు ఏటా రెన్యువల్‌కు బదులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.
  • స్టాక్ ఎక్సేంజ్‌లు చెల్లించే రెగ్యులేటరీ ఫీజును 80 శాతం తగ్గించింది. ప్రస్తుతం రూ.10 కోట్లపైన టర్నోవర్‌కు కోటి రూపాయలకు రూ.6 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉండగా, దీన్ని రూ.1.20కు తగ్గించింది.
  • ఆఫర్ డాక్యుమెంట్ల రీఫైలింగ్‌పై ఫీజును 50 శాతం తగ్గించింది. పరిశీలన లెటర్ జారీ చేసిన నాటి నుంచి ఏడాది లోపు రీఫైలింగ్‌కు ఇది వర్తిస్తుంది.
  • కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌కు మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)ను అనుమతించింది.
  • గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) ఇష్యూలో అవకతవకలకు పాల్పడ్డందుకు కామెక్స్ టెక్నాలజీపై ఐదేళ్లు, ఆ సంస్థకు చెందిన మాజీ డెరైక్టర్లు ఆది కూపర్, కిషోర్ హెగ్డేలపై రెండేళ్లపాటు సెబీ నిషేధం విధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మార్కెట్ల బలోపేతం దిశగా నిర్ణయాలు
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)

ప్రపంచ జీడీపీ 3.3 శాతానికి తగ్గింపు : ఓఈసీడీ
2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్థిక సహకార- అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) 2018, నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఈ సందర్భంగా ఓఈసీడీ పేర్కొంది.
మరోవైపు జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా ఓఈసీడీ సవరించింది. 19 దేశాల యూరో జోన్ వృద్ధి అంచనాలను 1.8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. అలాగే జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7 శాతానికి సవరించగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్ 0.2 శాతానికి తగ్గించింది. బ్రిటన్ వృద్ధి అంచనాలను 1.4 శాతం నుంచి 0.8 శాతానికి సవరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 ఏడాదికి ప్రపంచ జీడీపీ 3.3 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఆర్థిక సహకార- అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)
Published date : 13 Mar 2019 05:23PM

Photo Stories