Leading Wealthy Women 2022 : రోష్నీ నాడార్ మల్హోత్రా టాప్

జూలై 27న విడుదలైన కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్–హరూన్ జాబితా ‘లీడింగ్ వెల్తీ ఉమెన్ 2021’లో రూ.84,330 కోట్ల నెట్‌వర్త్ (ఆస్తుల విలువ)తో రోష్ని నాడార్ మొదటి స్థానంలో నిలిచారు. 2021లో ఆమె సంపద 54 శాతం పెరిగింది. ఆమె హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన శివ్‌నాడార్ కుమార్తె. ఈ జాబితాలో ‘నైకా’ వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్ (59) రెండో స్థానంలో ఉన్నారు. ఆమె సంపద విలువ రూ. 57,520 కోట్లుగా ఉంది. అంతేకాదు, స్వయంగా ఎదిగిన అత్యంత సంపన్న మహిళగా నాయర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి తప్పుకుని.. సౌందర్య ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ‘నైకా’ పేరుతో ఏర్పాటు చేసి ఆమె రాణిస్తున్నారు. గతేడాది చివర్లో నైకాను ఐపీవోకు తీసుకొచ్చి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ చేశారు. దీంతో ఆమె సంపద విలువ గతేడాది 963 శాతం వృద్ధి చెందింది. బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా రూ.29,030 కోట్ల నెట్‌వర్త్‌తో మూడో స్థానంలో ఉన్నారు. 2021లో ఆమె సందప విలువ 21 శాతం క్షీణించింది.
Also read: Inspiring Story: అక్షరమే ఆమె ఆరోగ్య బలం... 82 ఏళ్ల వయసులో తొలి పుస్తకం
తెలుగు రాష్ట్రాల నుంచి దివిస్ ల్యాబరేటరీస్ డైరెక్టర్ అయిన నీలిమ మోటపర్తి ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. దివిస్‌లో ఆమె వాటాల విలువ రూ.28,180 కోట్లుగా ఉంది. దివిస్ ల్యాబ్‌లో మెటిరీయల్ సోర్సింగ్, ప్రొక్యూర్‌మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్ విభాగాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమె దివిస్ ల్యాబ్ వ్యవస్థాపకుడైన మురళీ కృష్ణ ప్రసాద్ దివి కుమార్తె.
Also read: Padma Shri Awardee: పోరాటమే chutni devi ‘మంత్రం’
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP