జులై 2017 ఎకానమీ
Sakshi Education
గ్యాస్‌పై నెలకు రూ.4 పెంపు : కేంద్రం
సబ్సిడీపై అందించే వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరలను ఇక నుంచి ప్రతి నెలా పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నెలకు రూ.4 చొప్పున పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించింది. 2018 మార్చి కల్లా ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31న లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 పెంపు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాయితీ గ్యాస్‌పై ప్రతి నెల రూ. 4 పెంపు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : ఎల్పీజీపై అన్ని రాయితీలను తొలగించే చర్యల్లో భాగంగా
బ్యాంకు ఖాతా నంబరు పోర్టబిలిటీకి ఆర్‌బీఐ సూచన
మొబైల్ నంబరు పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకు అకౌంటు నంబరు పోర్టబిలిటీ అమలు చేసే దిశగా బ్యాంకులు కసరత్తు చేయాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సూచించారు. మరింత పోటీతత్వంతో పనిచేసేందుకు, ఖాతాదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ అంబుడ్‌సమన్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ముంద్రా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆర్‌బీఐ జూలై 31న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంకు ఖాతా నంబర్ పోర్టబిలిటీపై బ్యాంకులకు సూచన
ఎప్పుడు : జూలై 31
ఎవరు : ఆర్‌బీఐ
ఎందుకు : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు
వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’
వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు ఉపకరించే ఈ-రకం అనే పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ప్రారంభించింది. ప్రభుత్వ వేలందారు ఎంఎస్‌టీసీ, కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన సీఆర్‌డబ్ల్యూసీలు సంయుక్తంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌తో కలసి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ‘ఈ-రకం’ పోర్టల్
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌లో అమ్మేందుకు
బ్యాంకులకు 2.4 లక్షల కోట్ల హెయిర్ కట్: క్రిసిల్
భారీగా పేరుకుపోయిన 50 మొండి బకాయిలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు (60 శాతం) వదులుకోవాల్సి (హెయిర్‌కట్) రావొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. మెటల్స్, నిర్మాణ, విద్యుత్ రంగాలకు చెందిన ఈ బకాయిలు బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్లో దాదాపు సగం. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకున్నా వాటికి 40% మొత్తమే దక్కుతుందని తెలిపింది.
2017లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం: ఏడీబీ
గతంలో అంచనా వేసిన 7.4% వృద్ధి రేటు సాధన దిశగా భారత్ ముందుకెళుతోందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదే రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. అటు ఆసియా ప్రాంత వృద్ధి రేటు అంచనాలను మాత్రం గతంలో ప్రకటించిన 5.7% నుంచి 5.9%కి పెంచుతున్నట్లు తెలిపింది. ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2017 నివేదికకు అనుబంధ నివేదికలో వర్ధమాన ఆసియా దేశాలకు సంబంధించి అంచనాలను ఈ మేరకు సవరించింది.
2018లో వర్ధమాన ఆసియా వృద్ధిని 5.7% నుంచి 5.8%కి పెంచింది. ఇక 2017-18లో భారత వృద్ధి 7.4% ఉండగలదని, 2018-19లో 7.6%కి పెరగగలదని ఏడీబీ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాల నిర్వహణ సులభతరం కావడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) దోహదపడగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18లో భారత్ వృద్ధి రేటు 7.4 శాతం
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఏడీబీ
ఏటీఎంలో ఐసీఐసీఐ పర్సనల్ లోన్స్
ఐసీఐసీఐ బ్యాంకు రుణ మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ ఏటీఎంల ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను తక్షణం అందించే విధానాన్ని ప్రారంభించింది. వేతన అకౌంట్ కలిగి ఉన్న వారికి ఈ అవకాశం కల్పించింది. క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీలు అందించే సిబిల్ స్కోర్ సమాచారం ఆధారంగా ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌కు అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వీరికి ఏటీఎంలో లావాదేవీ నిర్వహించిన తర్వాత స్క్రీన్‌పై రుణ అర్హతకు సంబంధించిన ఒక మేసేజ్ కనిపిస్తుంది. రుణం తీసుకోవాలని భావిస్తే ఐదేళ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు మొత్తాన్ని పొందొచ్చు. ఇది కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ఏటీఎం స్క్రీన్‌పై రుణ వడ్డీ రేటు, ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు వంటి వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీఎంలో పర్సనల్ లోన్స్
ఎప్పుడు : జూలై 20
ఎవరు : ఐసీఐసీఐ బ్యాంకు
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వేతన ఖాతాదారుల కోసం
రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్
రిలయన్స్ జియో నుంచి ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్ అందిస్తామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జూలై 22న ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.
జియో ఫోన్‌ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం. ఈ ఫోన్ పొందేందుకు వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇస్తారు. జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్‌ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్‌లను ప్రవేశపెడతామని ముకేశ్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉచితంగా జియో 4జీ ఫీచర్ ఫోన్
ఎప్పుడు : జూలై 21
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
2016లో 18 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదు
ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్‌స వ్యాధితో మరణించేవారి సంఖ్య తగ్గుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ ఎయిడ్స్’ విభాగం తెలిపింది. 2005లో దాదాపు 19 లక్షల మంది ఈ వ్యాధితో మరణించగా.. 2016 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు తగ్గిందని తన నివేదికలో వెల్లడించింది. చాలామంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. గతేడాది కొత్తగా 18 లక్షల హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు పేర్కొంది.
ఒక్క 2016లోనే 1.95 కోట్ల మందికి యాంటీ రెట్రోవైరల్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మైఖేల్ సిడిబే తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7.61 కోట్ల మందికి హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ సోకగా.. దాదాపు 3.5 కోట్ల మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలు ఇన్ఫెక్షన్ అదుపులో గణనీయమైన పురోగతి సాధించినట్లు వివరించారు. 2010 నుంచి ఈ ప్రాంతంలో ఎయిడ్స్ మరణాలు 42 శాతం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాగా 2016లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదైన 95 శాతం హెచ్‌ఐవీ కేసులు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లోని 10 దేశాల నుంచే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ పది దేశాల్లో భారత్, చైనా, పాకిస్తాన్ ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎన్ ఎయిడ్‌స రిపోర్ట్ - 2017
ఎప్పుడు : జూలై 19
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
వయ వందన యోజన పథకం ప్రారంభం
వయోవృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (పీఎంవీవీవై) పేరుతో ఎల్‌ఐసీ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూలై 21న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దీన్ని తీసుకోవచ్చు. 60 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తించే ఈ పథకంలో 10 ఏళ్ల పాటు 8 శాతం వార్షిక రిటర్నులు లభిస్తాయి. వడ్డీ ఆదాయాన్ని ప్రతి నెల, లేదా 3 నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి పొందే వీలుంటుంది. ఈ సంవత్సరం మే 4న ప్రారంభమైన ఈ పెన్షన్ పథకంలో 2018 మే 3వ తేదీ వరకు చేరవచ్చు. ఈ పథకానికి జీఎస్టీ వర్తించదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వయ వందన యోజన పథకం ప్రారంభం
ఎప్పుడు : జూలై 21
ఎవరు : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : వయో వృద్ధుల కోసం
భారత వృద్ధి అంచనా యథాతథం
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో భారత వృద్ధి రేటు అంచనాను యథాతథంగా(7.2 శాతంగా) కొనసాగించింది. ఇది 2018-19లో 7.7 శాతానికి చేరుతుందని జూలై 24న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో) అప్‌డేట్ నివేదికలో పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ రెండేళ్లు భారత వృద్ధిరేటు చైనా కంటే అధికంగానే ఉండనుంది. చైనా వృద్ధి 2017లో 6.7 శాతంగా, 2018లో 6.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ గతంలో ప్రకటించింది. గతంలో ప్రకటించిన అంచనాలను తాజా నివేదికలో ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచింది. అయితే భారత వృద్ధిరేటు అంచనాలను యథాతథంగా ఉంచినప్పటికీ.. చైనాను మించగలదని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాలతో గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.1 శాతానికే పరిమితమైంది. అయితే ఇది ఊహించిన దానికంటే అధికమని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్
ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీము కింద త్వరలో మరో రెండు సంస్థలు ప్రాంతీయ విమానయాన సేవలు (ఆర్‌సీఎస్) ప్రారంభించనున్నాయి. ఇందుకోసం విమానాలను సమకూర్చుకున్నట్లు ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్.. కేంద్రానికి తెలియజేశాయి. సెప్టెంబర్ ఆఖరు నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నట్లు ఈ సంస్థలు తెలిపాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.
ఆర్‌సీఎస్ కింద మొత్తం 128 రూట్లు గుర్తించిన కేంద్రం విమానయాన సేవలకు అయిదు సంస్థలను ఎంపిక చేసింది. అలయన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, టర్బోమేఘా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఎయిర్ ఒడిషాకి 50 రూట్లు, ఎయిర్ డెక్కన్‌కి 34 రూట్లు దక్కాయి. రెండు సంస్థలు 19 సీట్ల సామర్థ్యం ఉండే ఆరు బీచ్‌క్రాఫ్ట్ బీ-1900డి విమానాలను సమకూర్చుకున్నాయి.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విమాన సేవలను విస్తరించేలా.. కేంద్రం గంట పాటు ప్రయాణం ఉండే రూట్లలో టికెట్ చార్జీలు గరిష్టంగా రూ. 2,500కి పరిమితం చేసింది. విమానయాన సంస్థలు తమ విమానాల సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం ఈ స్కీము కింద కేటాయించాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడాన్ సేవలు ప్రారంభించనున్న మరో రెండు ఎయిర్‌లైన్స్
ఎప్పుడు : జూలై 12
ఎవరు : ఎయిర్ ఒడిషా, ఎయిర్ డెక్కన్
జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22
జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22ను కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా జూలై 12న ఆవిష్కరించారు. 2027 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. ఈ సారి ప్రణాళికల అమలులో భాగంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలపై అధిక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.
2030 నాటికి భారత్‌ను మలేరియా రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (NFME)ని 2016లో ప్రారంభించింది.
2017-22 ప్రణాళికలు

- మలేరియా వ్యాప్తిని గుర్తించే వ్యవస్థల బలోపేతం
- మలేరియా వేగంగా వ్యాప్తి చెందకుండా గుర్తించిన వెంటనే నిర్మూలించే వ్యవస్థల ఏర్పాటు
- Long Lasting Impregnated Nets ద్వారా మలేరియా నివారణపై అవగాహన
- దోమల నివారణకు వ్యవస్థల బలోపేతం
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ మలేరియా నిర్మూలన ప్రణాళిక 2017-22
ఎప్పుడు : జూలై 12
ఎవరు : కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఎందుకు : మలేరియా నిర్మూలన కోసం
ఆరోగ్య ఖర్చులపై ఐసీఆర్‌డబ్ల్యూ సర్వే
దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే ఆరోగ్య సంబంధిత వ్యయాల్లో రూ.33,500 కోట్లు ఆదా అవుతాయని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ) సర్వే వెల్లడించింది. ఈ మొత్తం 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. అలాగే... 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలు, కౌమార దశలోనే ప్రసవాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని తెలిపింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది.
మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ఆరోగ్య ఖర్చులపై సర్వే
ఎప్పుడు : జూలై 15
ఎవరు : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్
2.5 కోట్లకు చేరిన ఉజ్వల లబ్ధిదారులు
పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ అందించే ఉద్దేశంతో 2016 మేలో కేంద్రం ప్రారంభించిన ఉజ్వల ఎల్‌పీజీ పథకం 2.5 కోట్ల మందికి చేరువైంది. బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 15న ఇచ్చిన కనెక్షన్‌తో లబ్ధిదారుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉజ్వల లబ్ధ్దిదారులు 2.5 కోట్లు
ఎప్పుడు : జూలై 15
ఎవరు : కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
జూన్‌లో 0.90 శాతంగా నమోదైనటోకు ద్రవ్యోల్బణం
కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 8 నెలల కనిష్టానికి చేరింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.90 శాతంగా నమోదైంది.
రూ.2కే స్పైస్ జెట్‌ను దక్కించుకున్న అజయ్ సింగ్
రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ మళ్లీ తన చేతుల్లోకి తీసుకొని అభివృద్ధి చేశాడు. అయితే... మారన్‌ల నుంచి కొనుగోలు చేసేందుకు అజయ్ సింగ్ చెల్లించింది కేవలం రెండు రూపాయలే. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు. దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు.
2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది.
బయట పడిందిలా..
అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. ప్రస్తుతం డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న నేపథ్యంలో ఈ సమాచారం బయటికొచ్చింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్‌వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 2కే స్పైస్ జెట్ కొనుగోలు
ఎప్పుడు : 2015లో
ఎవరు : అజయ్ సింగ్
జీఎస్‌టీ సందేహాల నివృత్తికి యాప్
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల సందేహాల్ని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘జీఎస్‌టీ రేట్స్ ఫైండర్’ (GST Rates Finder) పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ జూలై 9న ప్రారంభించారు. దీని ద్వారా ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిస్తున్నారన్న పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు. అలాగే సేవలపై పన్ను రేట్లు కూడా లభ్యమవుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : GST Rates Finder
ఎప్పుడు : జూలై 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జీఎస్‌టీపై సందేహాల నివృత్తికి
చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభం
చేనేత కార్మికుల వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం నాలుగో జాతీయ చేనేత జనాభా లెక్కల సేకరణను జూలై 8న ప్రారంభించింది. చేనేత అనుబంధ కార్మికుల వివరాలను కూడా సేకరించనున్న ఈ ప్రక్రియలో కార్మికులకు ఫొటో గుర్తింపు కార్డులు అందజేస్తారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఈ కార్డులు అర్హత కల్పిస్తాయి. ఈ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తికానుంది.
2009-10 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 43.31 లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చేనేత కార్మికుల జనాభా సేకరణ ప్రారంభం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వాస్తవ పరిస్థితిని తెలుసుకుని, వారి సంక్షేమం కోసం విధానాలు రూపొందించేందుకు
2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్
మరో దశాబ్ద కాలానికి భారత్ పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి చేరుకుంటుందని అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) నివేదిక వెల్లడించింది. 2026 నాటికి భారత్ పాల ఉత్పత్తిలో మిగతా దేశాలకంటే ముందు వరుసలో నిలుస్తుందని నివేదికలో పేర్కొంది. పదేళ్లలో ప్రపంచ జనాభా 730 నుంచి 820 కోట్లకు పెరుగుతుందని, భారత్, ఆఫ్రికా దేశాల్లో 56 శాతం జనాభావృద్ధి నమోదవుతుందని నివేదిక వెల్లడించింది. అంటే.. భారతదేశ జనాభా 130 కోట్ల నుంచి దాదాపు 150 కోట్లకు పెరగవచ్చని అంచనా వేసింది. చైనా జనాభాను మించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది. మానవ వనరులే పెట్టుబడిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయిలో భారత్, మరికొన్ని ఆఫ్రికా దేశాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తాని నివేదికలో అభిప్రాయపడింది. అంతేకాక ఆహార ఉత్పత్తులతోపాటు ఇతర అవసరాల కోసం ఈ దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని, వీటిని నెరవేర్చేందుకు తీసుకునే చర్యల ఫలితంగా ఎన్నో రంగాల్లో ఈ దేశాలు ముందంజలో నిలుస్తాయని నివేదిక ద్వారా తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2026 నాటికి పాల ఉత్పత్తిలో తొలి స్థానానికి భారత్
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
పాన్‌తో ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి
జూలై 1 నుంచి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)తో ఆధార్ కార్డును తప్పనిసరిగా జతచేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పాన్ కార్డుకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్‌ను గానీ, లేదా ఆధార్‌లో నమోదు చేసుకున్నట్లు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను గానీ తప్పనిసరిగా అనుసంధానించాలి. ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసే సమయంలోగానీ, బ్యాంకు ఖాతాను ఓపెన్ చేసే సమయంలో గానీ పాన్, ఆధార్‌లు తప్పనిసరిగా అనుసంధానించాల్సిందే. వ్యక్తుల ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాన్‌తో ఆధార్ జతచేయడం తప్పనిసరి
ఎప్పుడు : జూలై 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం
ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం
భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు జూన్ 28న కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఆదుకుంది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి వాటాల ఉపసంహరణ కోసం
వస్తు, సేవల పన్ను విధానం ప్రారంభం
ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రారంభమైంది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఇది ఏ ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం ఘనత కాదని, భవ్య భారతం కోసం సమష్టిగా చేసిన కృషి ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. జీఎస్టీని ‘ఉత్తమమైన, సరళమైన పన్ను’గా అభివర్ణించారు. దేశ ప్రజాస్వామ్య పరిణతికి జీఎస్టీ ఓ సాధికార రూపమని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఎరువులపై 5 శాతం జీఎస్టీ
జీఎస్టీ అమలుకు కొద్ది గంటల ముందు జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై రైతులకు సంబంధించిన రెండు అంశాలపై పన్నురేటును తగ్గించింది. గతంలో 12 శాతం పరిధిలో ఉన్న ఎరువులను 5 శాతం పరిధిలోకి.. 28 శాతంగా ఉన్న ట్రాక్టర్ల విడిభాగాలను 18 శాతంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
18 సమావేశాలు..
2016 సెప్టెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి సమావేశమైంది. ఆనాటి నుంచి నేటి వరకు 18 సార్లు ఈ మండలి సమావేశమైంది. విసృ్తతమైన అంశాలపై కూలంకశంగా చర్చించి 5, 12, 18, 28 శాతం పన్ను పరిధిని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎస్టీ అమలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పార్లమెంట్ సెంట్రల్ హాల్
ఎందుకు : దేశంలో ఏకీకృత పన్నుల కోసం
2018 నాటికి 10.2 శాతానికి ఎన్‌పీఏలు : ఆర్‌బీఐ
2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంచనా వేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ జూన్ 30న తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు..

- నికర మొండిబకాయిల (ఎన్‌ఎన్‌పీఏ) రేషియో 2016 సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉంటే, 2017 మార్చినాటికి ఈ రేటు 5.5 శాతానికి పెరిగింది.
- ఒత్తిడిలో ఉన్న రుణ నిష్పత్తి (స్ట్రెస్డ్ అడ్వాన్సెస్ రేషియో) మాత్రం 12 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసింది. వ్యవసాయం, సేవలు, రిటైల్ రంగాల్లో ఈ తరహా రుణ నిష్పత్తి తగ్గితే, పారిశ్రామిక రంగం విషయంలో మాత్రం 22.3 శాతం నుంచి 23 శాతానికి చేరింది.
- ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం-ద్రవ్యలోటు 2016-17లో 3.5 శాతంగా ఉంటే, ఇది 2017-18లో 3.2 శాతానికి తగ్గుతుందని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 10.2 శాతానికి ఎన్‌పీఏలు
ఎప్పుడు : 2018 నాటికి
ఎవరు : ఆర్‌బీఐ
ఎక్కడ : భారత్‌లో
2016-17లో 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు
2016-17 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు 55 శాతం పెరిగాయని నీతి ఆయోగ్ జూలై 3న వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ విధానం మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్‌లో 500, 1000 రూపాయిల నోట్లు రద్దు చేయటంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.
2011-12 నుంచి 2015-16 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు ఏటా సగటున 28 శాతం మేర పురోగతి నమోదు చేశాయని నీతి ఆయోగ్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 55 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు
ఎప్పుడు : 2016-17లో
ఎవరు : నీతి ఆయోగ్

Published date : 22 Jul 2017 04:27PM