Skip to main content

జనవరి 2021 ఎకానమీ

జీడీపీ అంశంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన కోఆపరేటివ్ సొసైటీ?
Current Affairs ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ)... 9వ వార్షిక వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ (డబ్ల్యూసీఎం) రిపోర్ట్-2020 ఎడిషన్ ర్యాంక్‌లను ప్రకటించింది. ఐసీఏ, యూరోపియన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రైజెస్ (యూరిస్) సంయుక్తంగా కలిసి జనవరి 21న ఒక వెబినార్‌లో ఈ ర్యాంకుల నివేదికను విడుదల చేశాయి. టర్నోవర్, తలసరి జీడీపీ రెండు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 300 సహకార సంస్థలతో ర్యాంక్‌లను ప్రకటించారు. తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) విభాగంలో... ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ- ఇఫ్కో) అగ్రస్థానంలో నిలిచింది. టర్నోవర్ పరంగా 65వ స్థానంలో నిలిచింది.
ఇఫ్కో గురించి...
  • న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఎరువుల తయారీ, విక్రయాల్లో ఇఫ్కో ఉంది.
  • దేశవ్యాప్తంగా రైతులను భాగస్వామ్యం చేయడం, భారత సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఇఫ్కో కృషి చేస్తోంది.
  • 36 వేల మంది కో-ఆపరేటివ్ సభ్యులున్న ఇఫ్కో టర్నోవర్ దాదాపు 7 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ప్రస్తుతం ఇఫ్కో ఎండీగా యూఎస్ అవస్తీ ఉన్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూసీఎం రిపోర్ట్-2020 ఎడిషన్ ర్యాంకులు జీడీపీ విభాగంలో అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ- ఇఫ్కో)
ఎక్కడ : ప్రపంచంలో

ప్రపంచ జీడీపీ 2030 నాటికి 140 ట్రిలియన్ డాలర్లు
ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2030 నాటికి 6.5 ట్రిలియన్ డాలర్లు పెరిగి 140 ట్రిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. నైపుణ్య రంగంలో భారీ పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత కేవలం భారత్‌లో 570 బిలియన్ డాలర్లు (రూ.40 లక్షల కోట్ల) జీడీపీ పురోగతి చోటుచేసుకుంటుందని వివరించింది. ఈ మేరకు జనవరి 25న ఒక నివేదికను విడుదల చేసింది.
ఆన్‌లైన్ దావోస్ అజెండా సమ్మిట్-2021 సందర్బంగా తాజా అధ్యయన నివేదికను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. 2021, జనవరి 24 నుంచి 29 వరకు జరిగే ఈ దావోస్ ఆన్‌లైన్ సదస్సులో సుమారు 1,000 మంది పైగా ప్రపంచ దేశాల నేతలు, దిగ్గజ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ జీడీపీ 2030 నాటికి 140 ట్రిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉంది
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నివేదిక
ఎందుకు : నైపుణ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉన్నందున

ఎన్‌సీఎల్‌ఏటీ నూతన బెంచ్ ఏ నగరంలో ప్రారంభమైంది?
నేషనల్ కంపెనీ అప్పీలేట్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) చెన్నై బెంచ్ జనవరి 25న ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ బ్రాంచీని ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కంపెనీల వివాదాల సత్వర పరిష్కారానికి చెన్నై బెంచ్ తోడ్పడనుంది. జైపూర్, కోల్‌కతా, కొచ్చి, ఇండోర్, అమరావతిలకు ఐదు కొత్త బెంచీలు ప్రకటించడంతో ఎన్‌సీఎల్‌టీ బెంచీల సంఖ్య 16కు చేరింది.

ఏపీఎస్‌బీబీ చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి (ఏపీఎస్‌బీబీ) చైర్మన్‌గా ఏవీ జోసెఫ్ నియమితులయ్యారు. జోసెఫ్ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్), రాష్ట్ర అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్)గా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే పీసీసీఎఫ్‌గా రిటైర్ అయిన ఎస్‌కే కౌషిక్‌ను ఏపీఎస్‌బీబీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ కంపెనీ అప్పీలేట్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) చెన్నై బెంచ్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో
ఎందుకు : దక్షిణాది రాష్ట్రాల్లో కంపెనీల వివాదాల సత్వర పరిష్కారానికి

2021 ఏడాదిలో రెండంకెల్లో వృద్ధి సాధించే ఏకై క దేశం?
కరోనా సవాళ్లు విసురుతున్న తరుణంలోనూ భారత్ 2021లో రెండంకెల్లో 11.5 శాతం వృద్ధిని నమోదుచేసుకోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2021 ఏడాది ప్రపంచ దేశాల్లో రెండంకెల్లో వృద్ధి సాధించే ఏకైక దేశంగా భారత్ ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు జనవరి 26న వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • వృద్ధి అంశంలో భారత్ తరువాతి స్థానాల్లో చైనా (8.1 శాతం), స్పెయిన్ (5.1 శాతం), ఫ్రాన్స్ (5.5 శాతం) ఉంటాయి.
  • ప్రపంచం మొత్తంగా వృద్ధి 5.5 శాతంగా నమోదవుతుంది.
  • 2020లో భారత్ 8 శాతం క్షీణ రేటు నమోదుచేసే అవకాశాలు ఉన్నప్పటికీ, 2021లో వృద్ధి గణనీయంగా పుంజుకుని 11.5 శాతంగా నమోదయ్యే వీలుంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటును కలిగిన దేశం హోదాను భారత్ తిరిగి పొందుతుంది.
  • 2020లో వృద్ధి సాధించే (2.3 శాతం) ఏకై క దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా చైనా నిలవనుంది.
  • 2022లో భారత్ వృద్ధి 6.8 శాతంగా ఉంటే, చైనా విషయంలో ఈ రేటు 5.6 శాతంగా ఉండనుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఏడాదిలో రెండంకెల్లో వృద్ధి సాధించే ఏకై క దేశం భారత్
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎక్కడ : ప్రపంచంలో

ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్?
ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. యాక్సెంచర్ తర్వాత ఐబీఎం కంపెనీ రెండో స్థానంలో, భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మూడో స్థానంలో నిలిచాయి. జనవరి 27న విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్-2021 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • యాక్సెంచర్ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా, ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది.
  • నాలుగో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • జాబితాలో హెచ్‌సీఎల్-7, విప్రో-9, టెక్ మహీంద్రా-15వ స్థానానికి చేరాయి.
  • మొత్తంగా టాప్-10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : బ్రాండ్ ఫైనాన్స్-2021
ఎక్కడ : ప్రపంచంలో

వికీపీడియాను నిర్వహిస్తోన్న సంస్థ పేరు?
Current Affairs
ఆన్‌లైన్ సమాచార నిధి ‘వికీపీడియా’ భారత్ మార్కెట్ పట్ల దీర్ఘకాలిక దృష్టిని కలిగి ఉన్నట్టు ప్రకటించింది. స్థానిక భాషా అవసరాలను అందుకోవడం ద్వారా మరింత మంది యూజర్లను వికీపీడియా ప్లాట్‌పామ్‌పైకి తీసుకురావాలని అనుకుంటున్నట్టు వికీమీడియా ఫౌండేషన్ సీఈవో క్యాథరిన్ మహేర్ జనవరి 15న తెలిపారు. భారత్ తమకు ఐదో అతిపెద్ద మార్కెట్ అని, భారత్ నుంచి ప్రతీ నెలా 75 కోట్ల పేజీ వీక్షనలు నమోదవుతున్నట్టు చెప్పారు.
వికీపీడియాను లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 2020 జనవరి 15తో వికీపీడియా 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు దీనిని ప్రారంభించారు. ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం వికీపీడియా... 300 భాషల్లో 5.5 కోట్లకు పైగా ఆర్టికల్స్‌ను, ఎటువంటి ప్రకటలు లేకుండా ఉచితంగా అందిస్తోంది. భారత్‌లో 24 భాషల్లో ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచాభివృద్ధిలో భారత్ వాటా 15 శాతం: యూబీఎస్
2025-26 నాటికి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో భారత్ 15 శాతం వాటా పొందుతుందని చైనా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అండ్ బ్రోకరేజ్ దిగ్గజ సంస్థ- యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఈ మేరకు జనవరి 19న ఒక నివేదికను విడుదల చేసింది. అయితే ప్రపంచాభివృద్ధిలో భారత్ కలిగి ఉన్న ప్రస్తుత వాటా విషయం మాత్రం నివేదిక ప్రస్తావించలేదు.
నివేదికలోని ముఖ్యాంశాలు...

  • తోటి వర్థమాన దేశాలతో పోల్చితే, ‘తయారీ’ వ్యయాల విషయంలో భారత్ తక్కువగా ఉంది.
  • గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటా ప్రస్తుతం దాదాపు జీరో. అయితే వచ్చే రెండేళ్లలో ఇది 20 నుంచి 30 శాతానికి చేరే అవకాశం ఉంది.
  • 2021-22లో భారత్ ఆర్థికాభివృద్ధి 11.5 శాతంగా ఉంటుంది.
  • 2019-20లో భారత్ ఆల్ టైమ్ హైలో 56 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆకర్షించింది.
  • కరోనా ప్రేరిత అంశాల వల్ల 2020-21లో భారత్ ఆకర్షించిన ఎఫ్‌డీఐలు 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
  • 2025-26 నాటికి ఈ ఎఫ్‌డీఐల పరిమాణం 100 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది.


ఫియట్ క్రిస్లర్, పియాజియోల విలీనం
Current Affairs
వాహన రంగంలోని రెండు దిగ్గజ కంపెనీలు ‘‘ఫియట్ క్రిస్లర్, పీఎస్‌ఏ పియాజియో’’ విలీనానికి ఆయా కంపెనీల వాటాదారులు జనవరి 4న ఆమోదాలు తెలిపారు. ఈ రెండు కంపెనీల విలీనంతో ఏర్పడే కంపెనీని ‘‘స్టెల్లాంటియస్’’ పేరుతో వ్యవహరిస్తారు. ఈ కంపెనీ వార్షిక కార్ల ఉత్పత్తి సామర్థ్యం 87 లక్షలు. ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో వాహన కంపెనీ ఇదే కానున్నది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్-నిస్సాన్‌ల తర్వాతి స్థానం ఇక నుంచి స్టెల్లాంటియస్‌దే. ఈ కంపెనీకి సీఈఓగా పీఎస్‌ఏ పియాజియో సీఈఓ కార్లోస్ తవరెస్, చైర్మన్‌గా ఫియట్ క్రిస్లర్ చైర్మన్ జాన్ ఈల్‌కాన్‌లు వ్యవహరిస్తారు.

భారత జీడీపీ ఎంత శాతం క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది?
భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21)లో మైనస్ 9.6 శాతం మేర క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ‘‘అంతర్జాతీయ ఆర్థిక అవకాశాలు’’ పేరుతో జనవరి 5న ఒక నివేదికను విడుదల చేసింది. 2021లో భారత జీడీపీ 5.4 శాతానికి కోలుకుంటుందని ఆ నివేదికలో అంచనా వేసింది.

  • ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి లో ఉంది.
  • ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడిగా డేవిడ్ ఆర్. మాల్‌పాస్ ఉన్నారు.
Published date : 12 Feb 2021 03:19PM

Photo Stories