జనవరి 2018 ఎకానమీ
Sakshi Education
ఉడాన్‌లోకి కొత్తగా 325 మార్గాలు
దేశంలో విమానయాన రంగం భారీ విస్తరణకు ప్రభుత్వం మరో సానుకూల చర్య తీసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలను మరింత పెంచేలా కొత్తగా 325 మార్గాలను ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కిందకు తీసుకొచ్చింది. ఉడాన్ రెండో విడతలో భాగంగా కొత్తగా 56 విమానాశ్రయాలు/హెలిప్యాడ్‌లను ప్రభుత్వం ఈ పథకం కిందకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకమైన ఉడాన్ కింద రెండో రౌండ్ బిడ్డింగ్ ముగిసిన అనంతరం విమానయాన సంస్థలకు కేటాయించిన మార్గాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు జనవరి 24న వెల్లడించారు. మొత్తం 15 సంస్థలకు ఈ మార్గాలను కేటాయించారు.
కొత్త మార్గాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి నగరాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి విమానాలు రానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని యుద్ధభూమి కార్గిల్‌కూ ఉడాన్ రెండో విడతలో చోటు దక్కింది. అత్యధికంగా ఇండిగో సమర్పించిన 20 ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. స్పైస్‌జెట్ ప్రతిపాదనల్లో 17 ఆమోదం పొందాయి. రోడ్డు, రైలు మార్గాలు సరిగా లేని ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత నగరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉడాన్ పథకం రెండో విడతలో వాటికే ఎక్కువ మార్గాలను కేటాయించారు. విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను కచ్చితంగా ఉడాన్ పథకానికి కేటాయించాలి. ఆ సీట్లకు గంట ప్రయాణానికి రూ.2,500 కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేయకూడదు. అదే హెలికాప్టర్లు అయితే 13 సీట్లను కేటాయించి, అర్ధగంట ప్రయాణానికి గరిష్టంగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాలి. రాయితీ కింద ప్రభుత్వం సంస్థలకు కొంత మొత్తం చెల్లిస్తుంది. మొత్తంగా రూ.620 కోట్లను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి నూతన మార్గాలు
మార్గం విమానయాన సంస్థ
హైదరాబాద్-హుబ్లీ టర్బో ఏవియేషన్, అలయన్‌స ఎయిర్, స్పైస్‌జెట్
హైదరాబాద్-కొల్హాపూర్ ఇండిగో, అలయన్‌స ఎయిర్
హైదరాబాద్-నాసిక్ అలయన్‌స ఎయిర్, స్పైస్‌జెట్
హైదరాబాద్-షోలాపూర్ అలయన్‌స ఎయిర్
హైదరాబాద్-కొప్పళ్ టర్బో ఏవియేషన్
తిరుపతి-కొల్హాపూర్ ఇండిగో
తిరుపతి-హుబ్లీ ఘొడావత్ (హెలికాప్టర్లు)
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడాన్ పథకంలోకి కొత్తగా 325 మార్గాలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ
2017-18లో బ్యాంకులకు మూలధనంగా రూ.88 వేల కోట్లు
మొండిబాకీలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) ఊతమిచ్చే దిశగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 88,139 కోట్ల అదనపు మూలధనాన్ని అందించనుంది. ఇందులో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కి రూ. 10,610 కోట్లు, ఎస్‌బీఐకి రూ. 8,800 కోట్లు దక్కనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 24న ఈ విషయాలు తెలిపారు. పీఎస్‌బీలకి అందించే అదనపు మూలధనంపై విసృ్తతంగా కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మొండిబాకీల సమస్యకు చెక్ చెప్పే దిశగా బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు.
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.2.11 లక్షల కోట్లు అందించేలా కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రణాళిక ప్రకటించింది. ఇందులో రూ.1.35 లక్షల కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ. 76,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ నుంచి నిధుల సమీకరణ రూపంలో ఉండనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యాంకులకు అదనపు మూలధనంగా రూ.88,139 కోట్లు
ఎప్పుడు : 2017-18 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ఆర్థిక సర్వే 2017-18
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తాలూకు ప్రభావాల నుంచి బయటపడి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కగా పుంజుకుంటోందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7- 7.5 శాతం స్థాయిలో వృద్ధి రేటు నమోదవుతుందని 2017-18 సంవత్సర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జనవరి 29న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ముందుంచిన ఈ సర్వే... ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మళ్లీ గత స్థానానికి చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చే సింది. ‘‘ప్రపంచ వృద్ధి రేటు 2018లో ఒక మోస్తరు స్థాయిలోనే పురోగమిస్తుంది. మనకైతే జీఎస్‌టీ పూర్తి స్థాయిలో స్థిరపడటం, పెట్టుబడులు పెరిగే అవకాశాలు, కొనసాగుతున్న సంస్కరణలు అధిక వృద్ధి రేటుకు అనుకూలాంశాలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పెరుగుతున్న చమురు ధరలు, పెరిగిన స్టాక్ ధరల్లో భారీ కరెక్షన్ వంటి సవాళ్లుంటాయి. వీటి కారణంగా విదేశీ నిధుల రాక ఆగిపోతుంది’’ అని సర్వే అభిప్రాయపడింది.
అంచనాలను మించే వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో (2017-18) జీడీపీ వృద్ధి 6.75 శాతంగా నమోదవుతుందని సర్వే పేర్కొంది. కాకపోతే ఇది 6.5 శాతంగా ఉండొచ్చని ఇటీవలే కేంద్ర గణాంకాల విభాగం పేర్కొనడం గమనార్హం. 2016-17లో జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, 2014-15లో ఇది ఏకంగా 8 శాతంగా ఉంది. 2017-18కు స్థూలంగా జోడించిన విలువ (జీవీఏ) 6.1 శాతంగా సర్వే అంచనా వేసింది. గతేడాది ఇది 6.6 శాతం. ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటాయంటూ... జీఎస్‌టీ సాధారణ స్థితికి చేరడం, రెండు రకాల బ్యాలన్‌స షీటు చర్యలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంలో (మాక్రో) స్థిరత్వం నెలకొంటుందని అంచనా వేసింది.
సవాళ్లు పొంచి ఉన్నాయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకునే చమురు ధరలు సగటున 14 శాతం పెరగ్గా, 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ 10-15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ‘‘మధ్య కాలానికి మూడు విభాగాలపై దృష్టి సారించాలి. ఇందులో ఉద్యోగాల కల్పన ఒకటి. యువతకు, ముఖ్యంగా మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలుండాలి. విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన కార్మిక శక్తిని సృష్టించడం రెండోది. సాగు ఉత్పాదనను పెంచడం మూడోది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలున్నం దున ఆర్థిక నిర్వహణ సవాలుగా ఉంటుంది’’ అని సర్వే హెచ్చరించింది. వ్యాపార నిర్వహణలో మరింత సులభతర దేశంగా భారత్‌ను మార్చేందుకు అప్పిలేట్, న్యాయ విభాగాల్లో జాప్యం, అపరిష్కృత పరిస్థితులను తొలగించాలని సూచించింది. ఇందుకోసం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని సర్వే గుర్తు చేసింది.
సర్వే ముఖ్యాంశాలు
ఆరేళ్ల కనిష్టానికి సగటు ద్రవ్యోల్బణం
2017-18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి. సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది.
డీమోనిటైజేషన్‌తో పెరిగిన గృహ పొదుపు
పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం. అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.
ఎన్‌పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర
బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్‌స షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది. ట్విన్ బ్యాలెన్‌స షీట్ (టీబీఎస్) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్‌స కింద 11 కంపెనీలకు చెందిన రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్ ఉన్నాయి.
మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే
ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట. ‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది.
నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు
కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సిబ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది. 2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల్లో ఉంటున్నారు.
ఫండ్స్ పై పెరుగుతున్న మక్కువ
గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్‌సలో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్ ఫండ్‌సపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఫండ్‌స పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్‌స పొదుపులు 11 రెట్లు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ నాటికి మ్యూచువల్ ఫండ్‌సలోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది.
వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి
పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది. సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్‌డీపీ) 2016-17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014-15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు.
ఇన్‌ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్ డాలర్లు
దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, 3.9 ట్రిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌ఐఐబీ), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి.
విదేశీయుల పర్యటనలు పెరిగాయి
పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ-వీసా, ది హెరిటేజ్ ట్రైల్ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి.
జీఎస్‌టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్
జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్నుతో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్‌టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జనవరి 24 వరకూ జీఎస్‌టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు.
ఎగుమతులూ పుంజుకుంటాయి
అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది.
విదేశీ ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం
వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. జనవరి 29న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017-18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు.
విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది.
అంతర్రాష్ట్ర వాటాలు ఇలా
అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది.
రైతు ఆదాయం 25% తగ్గొచ్చు
వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది.
రైతులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు
దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌బీఐ) రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ ‘ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్’ ద్వారా రైతులకు క్రెడిట్ కార్డులను అందిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ చేపట్టామని.. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుందని వెల్లడించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్‌బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతులకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ఎస్బీఐ
29 వస్తువులపై జీఎస్టీ పన్నుకోత
సామాన్యులకు మరింత ఊరటనిచ్చేలా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి మరోసారి పన్ను రేట్లను తగ్గించింది. తాజాగా 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో జనవరి 18న జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి 25వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన పన్ను రేట్లు ఈ నెల 25 నుంచే అమల్లోకి రానున్నాయి.
28 నుంచి 18 శాతానికి తగ్గినవి
సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌సని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్ ఓవరాల్ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్ టెన్ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి.
2018లో భారత వృద్ధి రేటు 7.4 శాతం : ఐఎంఎఫ్
భారత్ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 6.8 శాతంగానే ఉంటుందని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2018లో భారతదేశమే ముందుంటుందని తన తాజా నివేదికలో విశ్లేషించింది. పెద్దనోట్ల రద్దు, వస్తు- సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకుంటోందని తన వరల్డ్ అవుట్‌లుక్‌లో వివరించింది. 2019లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందనీ ఐఎంఎఫ్ అంచనావేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా దావోస్ (స్విట్జర్లాండ్)లో ఐఎంఎఫ్ ఈ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. 2018-19లో ఆసియా వృద్ధి 6.5 శాతంగా ఐఎంఎఫ్ అవుట్‌లుక్.
అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్‌కు 5వ ర్యాంకు
పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో భారత్ 5వ ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం ఎగబాకింది. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో కన్సల్టెన్సీ దిగ్గజం ‘పీడబ్ల్యూసీ’ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. జనవరి 23న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం... 2018లో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా జపాన్‌ను అధిగమించి భారత్ అయిదో స్థానానికి చేరింది. 2017లో భారత్ ఆరో స్థానంలో ఉంది. మరోవైపు, ఈ లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 46 శాతం మంది సీఈవోలు అమెరికాకు ఓటేశారు. చైనా (33 శాతం), జర్మనీ (20 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 15 శాతం ఓట్లతో బ్రిటన్ నాలుగో స్థానంలో, తొమ్మిది శాతం ఓట్లతో భారత్ అయిదో స్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్‌కు 5వ ర్యాంకు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : పీడబ్ల్యూసీ సర్వే
ఎంపీల్యాడ్స్ కాలపరిమితి పొడిగింపు
పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే తేదీ అయిన 2020, మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 10న ఈ మేరకు అంగీకరించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ. 11,850 కోట్లు వెచ్చించనున్నారు. ప్రారంభించిన కార్యక్రమాల పర్యవేక్షణ, సామర్థ్య పెంపు, స్థానిక అధికారుల శిక్షణ తదితరాలకు అదనంగా ఏటా రూ.5 కోట్లు వ్యయం చేయనున్నారు.
స్థానికంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితరాల అభివృద్ధికి ఏడాదికి రూ. 5 కోట్లు ఖర్చు చేసేందుకు పార్లమెంటు సభ్యులు సిఫారసు చేయొచ్చు. 1993-94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత ఆగస్టు వరకు పలు అభివృద్ధి పనులకు రూ.44,929.17 కోట్లు మంజూరు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీల్యాడ్‌స కాలపరిమితి పొడిగింపు
ఎప్పుడు : 2020, మార్చి 31 వరకు
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎఫ్‌డీఐలో కీలక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం
విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా బడ్జెట్‌కి ముందుగానే కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జనవరి 10న సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇవీ సంస్కరణలు..
2018లో భారత్ వృద్ధి 7.3 % : ప్రపంచ బ్యాంక్
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. అటుపై రెండేళ్లలో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ విశ్లేషిస్తోంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే, భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ప్రపంచబ్యాంక్ ఈ సందర్భంగా కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించింది. ఈ మేరకు 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్టస్ పేరుతో ప్రపంచబ్యాంక్ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...
ఏమిటి : 2018లో భారత్ వృద్ధి 7.3 %
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రపంచబ్యాంక్
విమానయాన రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి
కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ)ప్రోత్సహించేలా నిబంధనలను మరింత సరళతరం చేస్తూ 2018, జనవరి10న కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకొంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో 49 శాతం పెట్టుబడులు పెట్టడానికి అప్రూవల్ విధానంలో విదేశీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. అప్రూవల్ విధానం అంటే.. వివిధ శాఖల అనుమతులు తీసుకొని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించింది. ఆటోమేటిక్ రూట్ అంటే.. భద్రతాపరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డిపార్‌టమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్-డీఐపీపీ) సిఫార్సులు సరిపోతాయి. నిర్మాణ అభివృద్ధి రంగంలోనూ ఇదే తరహా వెసులుబాటు కల్పించింది.
నాణేల ముద్రణను పునరుద్ధరించండి: కేంద్రం
నాణేల ముద్రణ నిలిపేయాలంటూ దేశంలోని నాలుగు నాణేల ముద్రణ కేంద్రాలకు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాణేల ముద్రణను తిరిగి ప్రారంభించాలని, అయితే ముద్రణ వేగాన్ని తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీఎంసీఐఎల్ పరిధిలో ఉన్న 4 ముద్రణా కేంద్రాల్లో గతంలో లాగా 2 షిఫ్టుల్లో కాకుండా ఒక్క షిఫ్టులోనే ముద్రణ కొనసాగించాలని తెలిపింది.
2017-18కి గాను 7,712 మిలియన్ల నాణేలు ముద్రించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు తమకు జారీ చేసిన ఇండెంట్‌లో పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేనికారణంగా నాణేల ముద్రణ నిలిపేయాలంటూ జనవరి 9న కేంద్రం ఎస్పీఎంసీఐఎల్‌కు ఆదేశాలిచ్చింది.
తయారీ సూచీలో భారత్‌కు 30వ స్థానం
ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ 30వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూఈఎఫ్) ఈ ర్యాంక్ ల జాబితాను ప్రకటించింది. కాగా, జపాన్ ఈ సూచీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. చైనా కంటే తయారీ రంగంలో భారత్ చాలా వెనుకబడినప్పటికీ... ఇతర బ్రిక్స్ దేశాలతో(బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా) పోలిస్తే మెరుగ్గానే ఉంది. ర్యాంకింగ్‌సలో రష్యా 35, బ్రెజిల్ 41, దక్షిణాఫ్రికా 45 స్థానాల్లో ఉన్నాయి. ‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తొలిసారిగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూఈఎఫ్ ఈ వివరాలను పొందుపరిచింది.
అధునాతన పారిశ్రామిక వ్యూహాల రూపకల్పన విషయంలో దేశాలు అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించి 100 దేశాలను నాలుగు గ్రూపులుగా విభజించింది. ఇందులో భారత్ మూడో గ్రూప్(లెగసీ-బలమైన మూలాలు ఉన్నా, భవిష్యత్తులో రిస్కులు అధికం)లో ఉంది. కాగా, ఇదే గ్రూప్‌లో హంగరీ, మెక్సికో, ఫిలిప్పీన్‌స, రష్యా, థాయ్‌లాండ్, టర్కీ వంటివి ఉన్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు మాత్రం నాలుగో గ్రూప్(ప్రారంభ స్థాయి)కే పరిమితమయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తయారీ సూచీ నివేదిక
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ప్రపంచ ఆర్థిక సమాఖ్య
ఎక్కడ : 30వ స్థానంలో భారత్
2020-2022 కల్లా సగటున 7.3 శాతం జీడీపీ వృద్ధి రేటు
భారత్ 2020-2022కల్లా సగటున 7.3 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. మధ్యకాలికంగా ఇండియా వృద్ధి పటిష్టంగా వుండగలదని, 2018 నుంచి ప్రైవేటు మూలధన పెట్టుబడుల పెరుగుదల మొదలవుతుందని, దాంతో ఉత్పాదక వృద్ధిని క్రమేపీ సాధించగలుగుతుందని మోర్గాన్‌స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వివరించింది. కార్పొరేట్ రాబడి అంచనాలు, బ్యాలెన్‌స షీట్ ఫండమెంటల్స్ మెరుగుపడుతున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిస్తే...పరపతి డిమాండ్‌ను అందుకోవడం సాధ్యపడుతుందని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఈ 2018 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో రికవరీ కాగలుగుతుందని, 2016లో 6.4 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2017లో 7.5 శాతానికి, 2018లో 7.7 శాతానికి పెరుగుతుందని ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 7.3 శాతం
ఎప్పుడు : 2020-2022 కల్లా
ఎవరు : మోర్గాన్ స్టాన్లీ
ఈ-కామర్స్ దిగ్గజాలతో పతంజలి ఒప్పందం
యోగా గురు బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ.. ఆన్‌లైన్ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్‌మెడ్స్ వంటి 8 ఈ-కామర్స్ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్‌లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్‌దేవ్ జనవరి 16న చెప్పారు. ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిది ఈ-కామర్స్ దిగ్గజాలతో పతంజలి ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎందుకు : పతంజలి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు
మూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదం
ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్‌సభ జనవరి 4న ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్‌స ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్‌బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం 2017 ఆక్టోబర్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూలధన బాండ్ల జారీకి ఆమోదం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చేందుకు
2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్-2018 మార్చి) పేలవంగా ముగియనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కేవలం 6.5 శాతంగానే నమోదవుతుందని ఈ మేరకు జనవరి 5న వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలే నిజమయితే, దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లవుతుంది. నాలుగేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో సైతం ఇదే అతితక్కువ వృద్ధి గణాంకమూ అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణాల్లో కొన్నని గణాంకాలు వివరించాయి.
గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి కూడా 9.7 శాతం (రూ.1,03,219) నుంచి 8.3 శాతానికి (రూ.1,11,782) మందగించే వీలుంది.
ముఖ్యాంశాలు చూస్తే..

- 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండొచ్చు.
- 2018-19లో ఇది 7-7.5%కి చేరుతుంది
- చమురు ధరలు పెరిగినా లేక షేర్ల ధరలు పడినా విధానపరమైన చర్యలు అవసరం.
- వ్యవసాయానికి సహకారం పెంచడం, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి.
- పరోక్ష పన్నులు 50 శాతం పెరిగినట్టు జీఎస్‌టీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
- రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు ఇతర సమాఖ్య దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
- పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక పొదుపునకు ప్రోత్సాహం లభించింది.
- 2017-18లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.3 శాతం. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి.
- 2017-18లో సంస్కరణల కారణంగా సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15 శాతం పెరిగాయి.
- కార్మిక చట్టాలు మెరుగ్గా అమలు చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలి.
- స్వచ్ఛభారత్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల వసతులు పెరిగాయి. 2014లో 39 శాతమే ఉంటే, 2018 నాటికి 76%కి చేరాయి.
- సమ్మిళిత వృద్ధికి గాను విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలకు ప్రాధాన్యమివ్వాలి.
జీడీపీ | 6.5 (2017-18 ముందస్తు అంచనా) |
టోకు ద్రవ్యోల్బణం | 2.9 (2017-18 ఏప్రిల్ - డిసెంబర్) |
స్థూల ద్రవ్యోల్బణం | 3.2 (2017-18 బడ్జెట్ అంచనా) |
విదేశీ వాణిజ్యం | విదేశీ ఎగుమతులు 12.1 శాతం(2017-18 ఏప్రిల్ - డిసెంబర్) |
విదేశీ దిగుమతులు 21.8 శాతం(2017-18 ఏప్రిల్ - డిసెంబర్) | |
విదేశీ మారకపు నిల్వలు | 409.4 బిలియన్ డాలర్లు(2017-18 ఏప్రిల్ - డిసెంబర్) |
ఆహార ధాన్యాల ఉత్పత్తి | 134.7 మిలియన్ టన్నులు(2017-18 తొలి ముందస్తు అంచనా) |
2017-18లో సగటు ద్రవ్యోల్బ ణం 3.3 శాతం. ఇది ఆరేళ్ల కనిష్టస్థాయి. ఒక స్థిర ధరల వ్యవస్థవైపు ఆర్థికవ్యవస్థ పురోగమిస్తోంది. ధరల కట్టడి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటి. హౌసింగ్, ఇంధనం మిగిలిన ప్రధాన కమోడిటీ గ్రూపులన్నింటిలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. సీజనల్ ఇబ్బందుల వల్ల ఇటీవల కూరగాయలు, పండ్ల ధరలు పెరిగాయి. సరఫరాల్లో ఇబ్బందుల తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంది.
డీమోనిటైజేషన్‌తో పెరిగిన గృహ పొదుపు
పెద్ద నోట్ల రద్దు వల్ల బహుళ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం ఇందులో ఒకటి. అలాగే గృహ పొదుపు రేట్లూ పెరిగాయి. పెట్టుబడుల పునరుద్ధరణలో పొదుపు రేటు పెంపు కీలకాంశం. అలాగే సాంప్రదాయకంగా బంగారంపై చేసే వ్యయాలను నగదు సంబంధ పొదుపులవైపు మళ్లించడానికి విధానపరమైన ప్రాధాన్యత ఇవ్వాలి. నగదు వాడకం తగ్గి, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడం డీమోనిటైజేషన్ వల్ల ఒనగూరిన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి.
ఎన్‌పీఏల పరిష్కారంలో ఐబీసీది కీలకపాత్ర
బ్యాంకుల్లో పేరుకున్న రూ.8 లక్షల కోట్ల మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి కొత్త దివాలా చట్టం (ఐబీసీ) పటిష్టవంతమైన యంత్రాంగాన్ని అందిస్తోంది. పలు వివాదాల పరిష్కారానికి నిర్ధిష్టమైన కాలపరిమితులను నిర్దేశిస్తోంది. కార్పొరేట్ల బ్యాలెన్‌స షీట్లను మెరుగుపరచుకోవటానికి తగిన విధివిధానాలను అందిస్తోంది. ట్విన్ బ్యాలెన్‌స షీట్ (టీబీఎస్) చర్యలు దీర్ఘకాలిక సమస్యపరిష్కారంలో ప్రధానమైనవి. ప్రస్తుతం దివాలా ప్రొసీడింగ్‌స కింద 11 కంపెనీలకు చెందిన రూ.3.13 కోట్ల విలువైన క్లెయిమ్స్ ఉన్నాయి.
మహిళల ప్రాధాన్యాన్ని వివరించిన సర్వే
ఈ సారి సర్వేలో మహిళల ప్రాధాన్యాన్ని, లింగ వివక్షపై వ్యతిరేకతను చాటడానికి మోదీ ప్రభుత్వం గులాబీ రంగును ఎంచుకుంది. సర్వే కవర్ పేజీ సహా గులాబీ రంగులో మెరిసింది. మహిళలపై హింసకు ముగింపు పలకాలన్న ఉద్యమానికి మద్దతుగానే కవర్ పేజీకి గులాబీ రంగులద్దారన్నది నిపుణుల మాట. ‘‘కనీసం ఒక్క కుమారుడినైనా కలిగి ఉండాలన్న సామాజిక ప్రాధాన్యతను భారత్ వ్యతిరేకించాలి. స్త్రీ, పురుషులను సమానంగా అభివృద్ధి చేయాలి’’ అని పేర్కొంది. ‘‘47 శాతం మహిళలు ఎటువంటి గర్భనిరోధకాలూ వాడటం లేదు. వాడే వారిలో కూడా మూడోవంతు కన్నా తక్కువ మంది మాత్రమే పూర్తిగా మహిళలకు సంబంధించిన గర్భ నిరోధకాలు వాడుతున్నారు’’ అని సర్వే తెలియజేసింది.
నిర్మాణ రంగంలో కోటిన్నర కొత్త ఉద్యోగాలు
కొన్నాళ్లుగా స్థిరాస్తి.. నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇందులో వచ్చే అయిదేళ్లలో 1.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కలిపి రెండో స్థానంలో ఉన్నట్లు తెలియజేసింది. ‘‘2013లో ఈ రంగంలో 4 కోట్లపైగా సిబ్బంది ఉండగా.. 2017కి ఈ సంఖ్య 5.2 కోట్లకు చేరింది. 2022 నాటికి 6.7 కోట్లకు చేరొచ్చు. ఏటా 30 లక్షల ఉద్యోగాల చొప్పున అయిదేళ్లలో కోటిన్నర ఉద్యోగాల కల్పన జరగవచ్చు‘ అని సర్వే వివరించింది. రియల్టీ, కన్‌స్ట్రక్షన్ రంగంలో 90% మంది నిర్మాణ కార్యకలాపాల్లో పనిచేస్తుండగా, మిగతా 10% ఫినిషింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల్లో ఉంటున్నారు.
ఫండ్స్ పై పెరుగుతున్న మక్కువ
గత ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపు... బ్యాంక్ డిపాజిట్లలో 82%, జీవిత బీమా ఫండ్‌సలో 66 శాతం, షేర్లు, డిబెంచర్లలో 345% చొప్పున పెరిగాయి. మ్యూచువల్ ఫండ్‌సపై ఇన్వెస్టర్ల మక్కువ పెరుగుతోంది. ఫండ్‌స పొదుపులు 400 శాతం వృద్ధి చెందాయి. కేవలం రెండేళ్లలోనే ఫండ్‌స పొదుపులు 11 రెట్లు పెరిగాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ నాటికి మ్యూచువల్ ఫండ్‌సలోకి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి. దీంతో గత ఏడాది అక్టోబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తులు రూ.21.43 లక్షల కోట్లకు పెరిగింది.
వనరులు తక్కువైనా విద్య, ఆరోగ్యంపై దృష్టి
పరిమిత వనరులున్నా.. విద్య, ఆరోగ్యాలకు ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోందని సర్వే తెలిపింది. ‘భారత్ వర్ధమాన దేశం. విద్య, ఆరోగ్యం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలపై భారీగా వెచ్చించేందుకు వెసులుబాటుండదు. ప్రభుత్వం మాత్రం వీటిని మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రాధాన్యమిస్తూనే ఉంది. సామాజిక సంక్షేమం దృష్ట్యా పథకాలపై వ్యయాలను స్థూల రాష్ట్రీయోత్పత్తిలో (జీఎస్‌డీపీ) 2016-17లో 6.9%కి పెంచినట్లు తెలిపింది. 2014-15లో ఇది 6%. బాలికల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకాన్ని దేశవ్యాప్తంగా మొత్తం 640 జిల్లాలకు విస్తరించనున్నారు.
ఇన్‌ఫ్రాకు 2040కి 4.5 ట్రిలియన్ డాలర్లు
దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి వచ్చే 25 సంవత్సరాల్లో 4.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, 3.9 ట్రిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించుకోగలిగే అవకాశముంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌ఐఐబీ), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (బ్రిక్స్ బ్యాంక్) ద్వారా మౌలికానికి పెట్టుబడులను సమీకరించుకోవాలి.
విదేశీయుల పర్యటనలు పెరిగాయి
పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల దేశంలో విదేశీయుల పర్యటనలు గణనీయంగా పెరిగాయి. పర్యాటకం ద్వారా 2017లో విదేశీ మారక ఆదాయం 29 శాతం పెరిగి, 27.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక పర్యాటకుల సంఖ్య 15.6 శాతం పెరిగి, 1.02 కోట్లుగా నమోదైంది. పర్యాటకం అభివృద్ధి దిశలో ఈ-వీసా, ది హెరిటేజ్ ట్రైల్ వంటి అంశాలతో సహా ప్రభుత్వం ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా కలిసివచ్చాయి.
జీఎస్‌టీతో పెరిగిన ‘పరోక్ష’ పన్ను బేస్
జూలై నుంచీ అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్నుతో పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50 శాతంపైగా పెరిగింది. 34 లక్షల వ్యాపార సంస్థలు పన్ను పరిధిలోకి వచ్చాయి. పలు చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జీఎస్‌టీ వసూళ్ల పట్ల కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ఒకసారి వ్యవస్థ స్థిరపడిన తర్వాత, ఆయా పరిస్థితులన్నీ తొలగిపోతాయి. జనవరి 24 వరకూ జీఎస్‌టీ కింద కోటి మంది పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు.
ఎగుమతులూ పుంజుకుంటాయి
అంతర్జాతీయ వాణిజ్యం పెరగనున్న నేపథ్యంలో మున్ముందు దేశీ ఎగుమతులు కూడా పుంజుకోగలవని సర్వే అంచనా వేసింది. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని పేర్కొంది. 2016లో 2.4 శాతంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం.. 2017లో 4.2 శాతం, 2018లో 4 శాతం మేర వృద్ధి చెందగలదని అంచనా వేసింది.
విదేశీ ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం
వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. జనవరి 29న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017-18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు.
విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది.
అంతర్రాష్ట్ర వాటాలు ఇలా
అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది.
రైతు ఆదాయం 25% తగ్గొచ్చు
వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది.
రైతులకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు
దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌బీఐ) రైతులకు క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ ‘ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్’ ద్వారా రైతులకు క్రెడిట్ కార్డులను అందిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పైలట్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ చేపట్టామని.. దీని విజయం ఆధారంగా తర్వాత దేశవ్యాప్త విస్తరణ ఉంటుందని వెల్లడించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) మాదిరి కాకుండా ఎస్‌బీఐ కార్డులో 40 రోజుల క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతులకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటన
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : ఎస్బీఐ
29 వస్తువులపై జీఎస్టీ పన్నుకోత
సామాన్యులకు మరింత ఊరటనిచ్చేలా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి మరోసారి పన్ను రేట్లను తగ్గించింది. తాజాగా 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో జనవరి 18న జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి 25వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సవరించిన పన్ను రేట్లు ఈ నెల 25 నుంచే అమల్లోకి రానున్నాయి.
28 నుంచి 18 శాతానికి తగ్గినవి
- సెకండ్ హ్యాండ్‌లో కొనే పెద్ద, మధ్యస్థాయి కార్లు, ఎస్‌యూవీలు (మిగతా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ మోటార్ వాహనాలపై పన్నును 28 నుంచి 12 శాతానికి తగ్గించారు) ళీ జీవ ఇంధనాలతో నడిచే, ప్రజా రవాణాకు ఉపయోగించే బస్సులు.
- చక్కెర ఉండే స్వీట్లు, చాక్లెట్లు, 20 లీటర్ల తాగునీటి సీసాలు, ఎరువుగా ఉపయోగించే పాస్ఫరిక్ యాసిడ్, బయో డీజిల్, వేప ఆధారిత పురుగు మందులు, కొన్ని రకాల జీవ-పురుగుమందులు, డ్రిప్‌ల వంటి నీటిపారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు.
- చింతగింజల పొడి, మెహందీ కోన్లు, ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసే ఎల్‌పీజీ సిలిండర్లు.
- వెదురు/ఎండుగడ్డితో తయారైన బుట్టలు తదితర వస్తువులు, అల్లికతో తయారైన వస్తువులు, వెల్వెట్ వస్త్రాలు
- విబూది, వినికిడి పరికరాల విడి భాగాలు, తవుడు
సమ్మిళిత వృద్ధిలో పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ల కన్నా కూడా భారత్ అట్టడుగు స్థాయిలో ఉంది. వర్ధమాన దేశాలకు సంబంధించిన సమ్మిళిత వృద్ధి సూచీలో 62వ స్థానంలో నిల్చింది. చైనా 26, పాకిస్తాన్ 47వ స్థానాల్లో ఉండటం గమనార్హం. వర్ధమాన దేశాల జాబితాలో లిథువేనియా అగ్రస్థానంలో నిల్చింది. సంపన్న దేశాల జాబితాలో అత్యంత సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సదస్సు నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఈ సూచీ విశేషాలు విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ, రుణభారాల నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌సని ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
సమ్మిళిత వృద్ధి సూచీలో మొత్తం 130 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 29 సంపన్న దేశాలు, మిగతా 74 వర్ధమాన దేశాలు ఉన్నాయి. భారత్ ఓవరాల్ స్కోరు తక్కువగానే ఉన్నప్పటికీ.. పురోగమిస్తున్న టాప్ టెన్ వర్ధమాన దేశాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
గతేడాది 79 దేశాల వర్ధమాన దేశాల జాబితాలో భారత్ 60వ స్థానంలో నిల్చింది. చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి.
2018లో భారత వృద్ధి రేటు 7.4 శాతం : ఐఎంఎఫ్
భారత్ 2018లో 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు 6.8 శాతంగానే ఉంటుందని, తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2018లో భారతదేశమే ముందుంటుందని తన తాజా నివేదికలో విశ్లేషించింది. పెద్దనోట్ల రద్దు, వస్తు- సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకుంటోందని తన వరల్డ్ అవుట్‌లుక్‌లో వివరించింది. 2019లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందనీ ఐఎంఎఫ్ అంచనావేసింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా దావోస్ (స్విట్జర్లాండ్)లో ఐఎంఎఫ్ ఈ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. 2018-19లో ఆసియా వృద్ధి 6.5 శాతంగా ఐఎంఎఫ్ అవుట్‌లుక్.
అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్‌కు 5వ ర్యాంకు
పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్ల జాబితాలో భారత్ 5వ ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం ఎగబాకింది. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో కన్సల్టెన్సీ దిగ్గజం ‘పీడబ్ల్యూసీ’ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. జనవరి 23న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం... 2018లో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా జపాన్‌ను అధిగమించి భారత్ అయిదో స్థానానికి చేరింది. 2017లో భారత్ ఆరో స్థానంలో ఉంది. మరోవైపు, ఈ లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 46 శాతం మంది సీఈవోలు అమెరికాకు ఓటేశారు. చైనా (33 శాతం), జర్మనీ (20 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 15 శాతం ఓట్లతో బ్రిటన్ నాలుగో స్థానంలో, తొమ్మిది శాతం ఓట్లతో భారత్ అయిదో స్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారత్‌కు 5వ ర్యాంకు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : పీడబ్ల్యూసీ సర్వే
ఎంపీల్యాడ్స్ కాలపరిమితి పొడిగింపు
పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే తేదీ అయిన 2020, మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 10న ఈ మేరకు అంగీకరించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ. 11,850 కోట్లు వెచ్చించనున్నారు. ప్రారంభించిన కార్యక్రమాల పర్యవేక్షణ, సామర్థ్య పెంపు, స్థానిక అధికారుల శిక్షణ తదితరాలకు అదనంగా ఏటా రూ.5 కోట్లు వ్యయం చేయనున్నారు.
స్థానికంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితరాల అభివృద్ధికి ఏడాదికి రూ. 5 కోట్లు ఖర్చు చేసేందుకు పార్లమెంటు సభ్యులు సిఫారసు చేయొచ్చు. 1993-94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత ఆగస్టు వరకు పలు అభివృద్ధి పనులకు రూ.44,929.17 కోట్లు మంజూరు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంపీల్యాడ్‌స కాలపరిమితి పొడిగింపు
ఎప్పుడు : 2020, మార్చి 31 వరకు
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎఫ్‌డీఐలో కీలక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం
విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా బడ్జెట్‌కి ముందుగానే కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జనవరి 10న సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇవీ సంస్కరణలు..
- సింగిల్ బ్రాండ్ రిటైల్, నిర్మాణ రంగం, విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు.
- సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఆటోమేటిక్ విధానంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి. ఇప్పటిదాకా సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 49 శాతం దాకా ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతులు ఉండగా, అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉండేది.
- రుణ సంక్షోభంలో కూరుకున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో 49 శాతం దాకా విదేశీ ఎయిర్‌లైన్‌స ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి. - వైద్య పరికరాల తయారీ సంస్థలు, విదేశీ నిధులు అందుకునే కంపెనీలకు సేవలందించే ఆడిట్ సంస్థల్లో ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం.
- నిర్మాణ రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సేవలను.. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పరిగణించడం జరగదని స్పష్టీకరణ. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలు పొందేందుకు బ్రోకింగ్ సేవల సంస్థలకు అర్హత ఉంటుంది.
- విద్యుత్ ట్రేడింగ్ జరిగే పవర్ ఎక్స్ఛేంజీల్లో ఎఫ్‌డీఐల సడలింపు. ప్రస్తుత పాలసీ ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెకండరీ మార్కెట్‌కి మాత్రమే పరిమితంగా ఉంటున్నాయి. ఈ నిబంధనను తొలగించాలని, ఎఫ్‌ఐఐలు/ఎఫ్‌పీఐలు కూడా ప్రైమరీ మార్కెట్ ద్వారా పవర్ ఎక్స్చేంజీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రక్రియపరమైన మార్పుల్లో భాగంగా ఆటోమేటిక్ రూట్ రంగాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చే పెట్టుబడి దరఖాస్తులను పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) పరిశీలించి కేంద్రం ఆమోదానికి పంపుతుంది.
2018లో భారత్ వృద్ధి 7.3 % : ప్రపంచ బ్యాంక్
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. అటుపై రెండేళ్లలో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ విశ్లేషిస్తోంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే, భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ప్రపంచబ్యాంక్ ఈ సందర్భంగా కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించింది. ఈ మేరకు 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్టస్ పేరుతో ప్రపంచబ్యాంక్ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...
- 2017లో భారత్ వృద్ధి 6.7 శాతం అంచనా. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలుకు తొలిదశలో ఏర్పడుతున్న ఇబ్బందులు దీనికి ప్రధాన కారణాలు.
- వృద్ధి మందగమనంలో ఉన్న చైనాతో పోల్చి చూస్తే, భారత్‌లో వృద్ధి వేగం క్రమంగా పుంజుకుంటోంది. 2017లో భారత్‌కన్నా (6.7 శాతం) కొంచెం ఎక్కువగా ఉన్న చైనా వృద్ధి రేటు (6.8 శాతం), 2018లో 6.4 శాతానికి తగ్గే వీలుంది. అటుపై వచ్చే రెండేళ్లలో వృద్ధి 6.3 శాతం, 6.2 శాతానికి తగ్గవచ్చు.
- వచ్చే పదేళ్లలో భారత్ వృద్ధి సగటున 7 శాతం ఉండచ్చు. కొన్ని ఇబ్బందులు తలెత్తినా, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుంది.
ఏమిటి : 2018లో భారత్ వృద్ధి 7.3 %
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ప్రపంచబ్యాంక్
విమానయాన రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి
కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ)ప్రోత్సహించేలా నిబంధనలను మరింత సరళతరం చేస్తూ 2018, జనవరి10న కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకొంది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో 49 శాతం పెట్టుబడులు పెట్టడానికి అప్రూవల్ విధానంలో విదేశీ సంస్థలకు అనుమతి ఇచ్చింది. అప్రూవల్ విధానం అంటే.. వివిధ శాఖల అనుమతులు తీసుకొని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఆటోమేటిక్ రూట్‌లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించింది. ఆటోమేటిక్ రూట్ అంటే.. భద్రతాపరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డిపార్‌టమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్-డీఐపీపీ) సిఫార్సులు సరిపోతాయి. నిర్మాణ అభివృద్ధి రంగంలోనూ ఇదే తరహా వెసులుబాటు కల్పించింది.
నాణేల ముద్రణను పునరుద్ధరించండి: కేంద్రం
నాణేల ముద్రణ నిలిపేయాలంటూ దేశంలోని నాలుగు నాణేల ముద్రణ కేంద్రాలకు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాణేల ముద్రణను తిరిగి ప్రారంభించాలని, అయితే ముద్రణ వేగాన్ని తగ్గించాలని సూచించింది. ఈ మేరకు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీఎంసీఐఎల్ పరిధిలో ఉన్న 4 ముద్రణా కేంద్రాల్లో గతంలో లాగా 2 షిఫ్టుల్లో కాకుండా ఒక్క షిఫ్టులోనే ముద్రణ కొనసాగించాలని తెలిపింది.
2017-18కి గాను 7,712 మిలియన్ల నాణేలు ముద్రించాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు తమకు జారీ చేసిన ఇండెంట్‌లో పేర్కొంది. బ్యాంకుల్లో స్థలం లేనికారణంగా నాణేల ముద్రణ నిలిపేయాలంటూ జనవరి 9న కేంద్రం ఎస్పీఎంసీఐఎల్‌కు ఆదేశాలిచ్చింది.
తయారీ సూచీలో భారత్‌కు 30వ స్థానం
ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ 30వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూఈఎఫ్) ఈ ర్యాంక్ ల జాబితాను ప్రకటించింది. కాగా, జపాన్ ఈ సూచీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనా తొలి ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. చైనా కంటే తయారీ రంగంలో భారత్ చాలా వెనుకబడినప్పటికీ... ఇతర బ్రిక్స్ దేశాలతో(బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా) పోలిస్తే మెరుగ్గానే ఉంది. ర్యాంకింగ్‌సలో రష్యా 35, బ్రెజిల్ 41, దక్షిణాఫ్రికా 45 స్థానాల్లో ఉన్నాయి. ‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తొలిసారిగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూఈఎఫ్ ఈ వివరాలను పొందుపరిచింది.
అధునాతన పారిశ్రామిక వ్యూహాల రూపకల్పన విషయంలో దేశాలు అనుసరిస్తున్న విధానాలను విశ్లేషించి 100 దేశాలను నాలుగు గ్రూపులుగా విభజించింది. ఇందులో భారత్ మూడో గ్రూప్(లెగసీ-బలమైన మూలాలు ఉన్నా, భవిష్యత్తులో రిస్కులు అధికం)లో ఉంది. కాగా, ఇదే గ్రూప్‌లో హంగరీ, మెక్సికో, ఫిలిప్పీన్‌స, రష్యా, థాయ్‌లాండ్, టర్కీ వంటివి ఉన్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు మాత్రం నాలుగో గ్రూప్(ప్రారంభ స్థాయి)కే పరిమితమయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘భవిష్యత్తు తయారీ సంసిద్ధత’ పేరుతో తయారీ సూచీ నివేదిక
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ప్రపంచ ఆర్థిక సమాఖ్య
ఎక్కడ : 30వ స్థానంలో భారత్
2020-2022 కల్లా సగటున 7.3 శాతం జీడీపీ వృద్ధి రేటు
భారత్ 2020-2022కల్లా సగటున 7.3 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. మధ్యకాలికంగా ఇండియా వృద్ధి పటిష్టంగా వుండగలదని, 2018 నుంచి ప్రైవేటు మూలధన పెట్టుబడుల పెరుగుదల మొదలవుతుందని, దాంతో ఉత్పాదక వృద్ధిని క్రమేపీ సాధించగలుగుతుందని మోర్గాన్‌స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వివరించింది. కార్పొరేట్ రాబడి అంచనాలు, బ్యాలెన్‌స షీట్ ఫండమెంటల్స్ మెరుగుపడుతున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరిస్తే...పరపతి డిమాండ్‌ను అందుకోవడం సాధ్యపడుతుందని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఈ 2018 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో రికవరీ కాగలుగుతుందని, 2016లో 6.4 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటు 2017లో 7.5 శాతానికి, 2018లో 7.7 శాతానికి పెరుగుతుందని ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత జీడీపీ వృద్ధి రేటు సగటున 7.3 శాతం
ఎప్పుడు : 2020-2022 కల్లా
ఎవరు : మోర్గాన్ స్టాన్లీ
ఈ-కామర్స్ దిగ్గజాలతో పతంజలి ఒప్పందం
యోగా గురు బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ.. ఆన్‌లైన్ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్‌మెడ్స్ వంటి 8 ఈ-కామర్స్ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్‌లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్‌దేవ్ జనవరి 16న చెప్పారు. ఆన్‌లైన్ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎనిమిది ఈ-కామర్స్ దిగ్గజాలతో పతంజలి ఒప్పందం
ఎప్పుడు : జనవరి 16
ఎందుకు : పతంజలి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు
మూలధన బాండ్లకు లోక్‌సభ ఆమోదం
ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చే ప్రతిపాదనకు లోక్‌సభ జనవరి 4న ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మరిన్ని సంస్కరణలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం.. ఏ బ్యాంకుకు ఎంత ఇవ్వాలి తదితర అంశాలకు సంబంధించి ఆర్థిక సర్వీసుల విభాగం ఇప్పటికే సమగ్రమైన ప్రణాళిక రూపొందించిందని సప్లిమెంటరీ డిమాండ్‌స ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన వివరించారు. మొండిబాకీలను పెంచుకుంటూ కూర్చున్న పీఎస్‌బీలకు అదనపు మూలధనం సరైనది కాకపోయినప్పటికీ... వాటిని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
రూ. 7.33 లక్షల కోట్ల మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను పటిష్టపర్చేందుకు రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్ల ప్రణాళికను కేంద్రం 2017 ఆక్టోబర్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1.35 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీతో పాటు బ్యాంకుల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.58,000 కోట్లు సమకూర్చనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూలధన బాండ్ల జారీకి ఆమోదం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) గట్టెక్కించే దిశగా బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చేందుకు
2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్-2018 మార్చి) పేలవంగా ముగియనుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు వెల్లడించింది. వృద్ధి రేటు కేవలం 6.5 శాతంగానే నమోదవుతుందని ఈ మేరకు జనవరి 5న వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలే నిజమయితే, దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టస్థాయికి పడిపోయినట్లవుతుంది. నాలుగేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో సైతం ఇదే అతితక్కువ వృద్ధి గణాంకమూ అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పేలవ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం ఇందుకు ప్రధాన కారణాల్లో కొన్నని గణాంకాలు వివరించాయి.
గణాంకాల ప్రకారం తలసరి ఆదాయ వృద్ధి కూడా 9.7 శాతం (రూ.1,03,219) నుంచి 8.3 శాతానికి (రూ.1,11,782) మందగించే వీలుంది.
ముఖ్యాంశాలు చూస్తే..
- 2014 మేలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2014-15లో వృద్ధి రేటు 7.5 శాతం. 2015-16లో ఈ రేటు 8 శాతమయితే, 2016-17లో 7.1 శాతంగా నమోదయి్యంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3%గా నమోదవడం తెలిసిందే.
- తాజా అంచనాల ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో వృద్ధి రేటు 7.9 శాతం (2016-17) నుంచి 4.6%కి పడిపోనుంది.
- ఇక వ్యవసాయ రంగం చూస్తే (అటవీ, మత్స్య రంగాలూ కలుపుకుని) వృద్ధి రేటు 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోనుంది.
- 2017-18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. 2019-20 నాటికి 7.4%కి పెరుగుతుందని విశ్లేషించింది.
- ఇక 2017-18కి ఓఈసీడీ వృద్ధి అంచనా 6.7శాతం.
- ఫిచ్ రేటింగ్‌స 6.9% నుంచి 6.7%కి తగ్గించింది. 2018-19కి 7.4% నుంచి 7.3%కి తగ్గించింది.
- ఇక మూడీస్ విషయంలో 2017-18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
- 2017-20 మధ్య సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ విశ్లేషిస్తోంది.
- ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7%.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017-18 వృద్ధి రేటు అంచనా 6.5 శాతం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : కేంద్ర గణాంకాల శాఖ
ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో అదానీ గ్రూప్
అంతర్జాతీయంగా సోలార్ విద్యుదుత్పత్తి సంస్థల్లో అదానీ గ్రూపు స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలో యుటిలిటీ సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి పరంగా టాప్-15 జాబితాలో చేరిన అదానీ గ్రూపు 12వ స్థానం దక్కించుకుంది. గ్రీన్‌టెక్ మీడియా రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకై న భారతీయ కంపెనీ అదానీ ఒక్కటే. ఈ జాబితాలో ఫస్ట్ సోలార్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 4,619 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన చేస్తుండగా, దీనికి అదనంగా 4,802 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. అదానీ గ్రూపు 788 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ సోలార్ దిగ్గజాల్లో 12వ స్థానంలో అదానీ గ్రూప్
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : గ్రీన్‌టెక్ మీడియా
2018-19లో భారత వృద్ధి రేటు 7.6 శాతం: క్రిసిల్
రానున్న ఆర్థిక సంవత్సరాని(2018-19)కి దేశ జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందన్న అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ మరోసారి పునరుద్ఘాటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించడానికి డీమోనిటైజేషన్, జీఎస్టీ వల్ల స్వల్ప కాలంలో ఎదురైన ప్రతికూలతలు, వ్యవసాయ వృద్ధి బలహీనంగా ఉండడమే కారణాలుగా పేర్కొంది. జీఎస్టీ ప్రతికూల ప్రభావం కొనసాగుతుందన్న అంచనాలతోనే రానున్న ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.6 శాతంగా పేర్కొంటున్నట్టు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత వృద్ధి రేటు అంచనా 7.6 శాతం
ఎప్పుడు : 2018-19లో
ఎవరు : క్రిసిల్
జౌళి సంచుల్లో ఆహార ధాన్యాలు, పంచదార
ఈ ఏడాది జూన్ వరకు ఆహార ధాన్యాలు, పంచదారను తప్పనిసరిగా జౌళి సంచుల్లోనే ప్యాక్ చేయాలని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) జనవరి 3న నిర్ణయించింది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, పంచదార ఉత్పత్తుల్లో 20 శాతాన్ని జౌళి సంచుల్లో ప్యాక్ చేస్తే 40 లక్షల మంది రైతులు; 3.7 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ప్యాకింగ్‌కు పర్యావరణ అనుకూల జౌళిని వినియోగించేలా దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం, మేఘాలయ, త్రిపురల్లోని రైతులు, కార్మికులకు మేలు జరుగుతుంది.
‘ఆర్‌కామ్’ను కొనుగోలు చేయనున్న జియో
అనిల్ అంబానీకి చెందిన రిలయన్‌స కమ్యూనికేషన్‌స ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్‌స జియో కొనుగోలు చేయనుంది. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్‌స నోడ్‌సను (ఎంసీఎన్) రిలయన్‌స ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్‌స జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్‌స జియో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.24,000 - 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఈ ఆస్తుల విక్రయం ఊరటనిచ్చే విషయం. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్ జియో
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆర్‌కామ్, జియో మధ్య ఒప్పందం
మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్
అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్‌పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే... బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో భారత్‌దే మొదటి స్థానం. ఈ మేరకు డిసెంబర్ 28న ఓ నివేదిక విడుదల చేసిన కేర్ రేటింగ్స్.. భారత బ్యాంకుల మొండి బకాయిల భారం రూ.9.5 లక్షల కోట్లని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలిచింది.
యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు-గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. ఈ నాలుగు దేశాలు జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి.
ఎన్‌పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు- బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : కేర్ రేటింగ్స్
రూ. 2వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్
డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డులు, భీమ్ యాప్ ద్వారా రూ.2,000 దాకా చెల్లింపులపై లావాదేవీల చార్జీలను రద్దు చేసింది. ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా సదరు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీల భారాన్ని ప్రభుత్వమే రెండేళ్ల పాటు భరించనున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయంతో ఖజానాపై రూ. 2,512 కోట్ల మేర ప్రభావం పడనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ. 2 వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్
ఎప్పుడు : జనవరి 1 నుంచి
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
ఎందుకు : డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు

Published date : 05 Jan 2018 03:14PM