జనవరి 2017 ఎకానమీ
Sakshi Education
2016-17 భారత వృద్ధిరేటు 6.8 శాతం: ఫిక్కీ
2016-17లో భారత్ ఆర్థిక వృద్ధి 6.8 శాతంగా నమోదవుతుందని పారిశ్రామిక మండలి (FICCI) ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. 2016 డిసెంబర్- 2017 జనవరి మధ్య కాలంలో వివిధ రంగాల నిపుణుల అంచనాలతో ఫిక్కీ ఈ నివేదిక రూపొందించింది.
అధ్యయనంలోని ముఖ్యాంశాలు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB ప్రయోగాత్మక సేవలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్, జార్ఖండ్ రాజధాని రాంచీలో జనవరి 30న తపాలా శాఖ ఈ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి IPPB సిద్ధిపేటలో ప్రారంభం కానుంది. ఈ బ్యాంకు రూ. 25 వేల లోపు డిపాజిట్లపై 4.5 శాతం, రూ.25 వేల-రూ.50 వేల మధ్య డిపాజిట్లపై 5 శాతం, రూ.50 నుంచి లక్ష లోపు డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ ఇవ్వనుంది.
2016-17 కేంద్ర ఆర్థిక సర్వే
2016-17 ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైందని పేర్కొన్న ఆయన జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 0.3 శాతంగా ఉంటుందని చెప్పారు.
నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 నుంచి 0.5 శాతం మేర తగ్గిందని సర్వే పేర్కొంది. పెద్దనోట్ల రద్దు వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.
సర్వేలోని ముఖ్యాంశాలు
సార్వత్రిక కనీస ఆదాయం
దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సార్వత్రిక కనీస ఆదాయం-UBI అనే కొత్త ఆలోచనను ఆర్థిక సర్వే పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా పేదలకు కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవడమే యూబీఐ లక్ష్యం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న రాయితీలను పూర్తిగా రద్దు చేసి వాటిని బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు.
యూబీఐ లక్ష్యాలు, ప్రయోజనాలు
స్వచ్ఛ ధన్ అభియాన్ ప్రారంభం
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన అనుమానాస్పద డిపాజిట్లను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు జనవరి 31న ఐటీ శాఖ స్వచ్ఛ ధన్ అభియాన్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. దీని ప్రకారం రూ. 5 లక్షలకు మించి అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఆదాయ వివరాలతో కూడిన వివరణలు కోరుతూ వారందరికీ ఈ మెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు పంపనున్నారు.
పంట రుణాలపై రూ.660 కోట్ల వడ్డీ మాఫీ
సహకార బ్యాంకుల నుంచి 2016, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలపై 2016, నవంబర్, డిసెంబర్‌లకు కేంద్రం రూ.660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జనవరి 24న జరిగిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్, డిసెంబర్‌లకు సంబంధించి వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.
జూలై 1 నుంచి జీఎస్టీ అమలు
దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీని ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థలు, పన్ను చెల్లింపుదారులపై 90 శాతం నియంత్రణ రాష్ట్రాలకు దఖలు పడనుంది. 10 శాతం హక్కులు కేంద్రానికి ఉంటాయి. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రం, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉంటాయి.

- 2016-17 ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.1 శాతంగా నమోదవుతుందని కేంద్రం పేర్కొనగా ఫిక్కీ మాత్రం 6.8 శాతంగానే అంచనా వేసింది.
- 2016-17లో వ్యవసాయ రంగం కొంత మెరుగ్గా ఉండే అవకాశం. సేవలు, పారిశ్రామిక రంగాల వృద్ధి 8.5 శాతం, 5.7 శాతంగా నమోదయ్యే అవకాశం.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB ప్రయోగాత్మక సేవలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్, జార్ఖండ్ రాజధాని రాంచీలో జనవరి 30న తపాలా శాఖ ఈ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి IPPB సిద్ధిపేటలో ప్రారంభం కానుంది. ఈ బ్యాంకు రూ. 25 వేల లోపు డిపాజిట్లపై 4.5 శాతం, రూ.25 వేల-రూ.50 వేల మధ్య డిపాజిట్లపై 5 శాతం, రూ.50 నుంచి లక్ష లోపు డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ ఇవ్వనుంది.
2016-17 కేంద్ర ఆర్థిక సర్వే
2016-17 ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైందని పేర్కొన్న ఆయన జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 0.3 శాతంగా ఉంటుందని చెప్పారు.
నోట్ల రద్దు కారణంగా ఆర్థిక ప్రగతి 0.25 నుంచి 0.5 శాతం మేర తగ్గిందని సర్వే పేర్కొంది. పెద్దనోట్ల రద్దు వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది.
సర్వేలోని ముఖ్యాంశాలు
- 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా.
- 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి 4.1 శాతం. 2015-16 కన్నా ఇది 1.2 శాతం ఎక్కువ.
- 2016-17లో 7.4 శాతం నుంచి 5.2 శాతానికి మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి.
- 2016-17లో సేవల రంగం వృద్ధి 8.8 శాతం
- దేశీయ వ్యవస్థలో నల్లధనం రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ. 7.3 లక్షల కోట్లుగా అంచనా.
- రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచన
- నల్లధనం స్వచ్ఛంద వెల్లడికి ఉద్దేశించిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PMGKY) ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా.
- జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం.
- బ్యాంకింగ్‌లో మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహెబిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సూచన.
సార్వత్రిక కనీస ఆదాయం
దేశంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సార్వత్రిక కనీస ఆదాయం-UBI అనే కొత్త ఆలోచనను ఆర్థిక సర్వే పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా పేదలకు కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవడమే యూబీఐ లక్ష్యం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న రాయితీలను పూర్తిగా రద్దు చేసి వాటిని బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా ప్రజలకు అందిస్తారు.
యూబీఐ లక్ష్యాలు, ప్రయోజనాలు
- ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం సార్వత్రిక కనీస ఆదాయం-UBI పథకం దేశంలో పేదరికాన్ని 0.5 శాతం మేర తగ్గిస్తుంది.
- పథకం అమలుకి అయ్యే వ్యయం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 4 నుంచి 5 శాతం.
- ఆహారం, పెట్రోలియం, ఎరువులు తదితర అంశాల్లో ప్రస్తుతం మధ్య తరగితికి ఇస్తున్న రాయితీల విలువ జీడీపీలో 3 శాతం.
- టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం 1947లో దేశ జనాభాలో 70 శాతం పేదరికం ఉంటే, 2011-12 నాటికి 22 శాతానికి తగ్గింది.
- ఇప్పటికే ఫిన్లాండ్ దేశంలో పైలట్ ప్రాతిపదికన ఈ తరహా పథకం అమలవుతోంది.
స్వచ్ఛ ధన్ అభియాన్ ప్రారంభం
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన అనుమానాస్పద డిపాజిట్లను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు జనవరి 31న ఐటీ శాఖ స్వచ్ఛ ధన్ అభియాన్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. దీని ప్రకారం రూ. 5 లక్షలకు మించి అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఆదాయ వివరాలతో కూడిన వివరణలు కోరుతూ వారందరికీ ఈ మెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు పంపనున్నారు.
పంట రుణాలపై రూ.660 కోట్ల వడ్డీ మాఫీ
సహకార బ్యాంకుల నుంచి 2016, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలపై 2016, నవంబర్, డిసెంబర్‌లకు కేంద్రం రూ.660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జనవరి 24న జరిగిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్, డిసెంబర్‌లకు సంబంధించి వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు
ప్రభుత్వ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో కూడిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 47వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 17-20 వరకు జరిగింది. దీన్ని ‘బాధ్యతాయుత-సత్వరం స్పందించే నాయకత్వం’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగో పారిశ్రామిక విప్లవానికి సన్నద్ధం అయ్యేందుకు వీలుగా సరికొత్త నాయకత్వ నమూనా, పెట్టుబడిదారీ విధానంలో సంస్కరణలు లాంటి అంశాలపై 400కు పైగా చర్చా కార్యక్రమాలు జరిగాయి. వీటిలో సామాజిక సమ్మిళితం, మానవాభివృద్ధికి వ్యూహాలు లాంటివి చర్చకు వచ్చాయి. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్ శ్వాబ్ ఉపన్యాసంతో ప్రారంభమైన ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 1200 మంది సీఈవోలు, 50 మంది ప్రభుత్వాధినేతలు ఉన్నారు.
‘వర్షిత’ పింఛన్ పథకానికి కేబినెట్ ఆమోదం
వృద్ధుల సామాజిక భద్రత కోసం రూపొందించిన వర్షిత పెన్షన్ బీమా యోజన-2017 పథకానికి కేంద్రమంత్రి మండలి జనవరి 24న ఆమోదం తెలిపింది. ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకం కింద పదేళ్లపాటు ఎనిమిది శాతం వడ్డీతో బీమా లభిస్తుంది. ఈ పథకం 60 లేదా అంతకుమించిన వయసు కలిగినవారికి వర్తిస్తుంది.
వృద్ధిరేటు అంచనాను 7 శాతానికికుదించిన వరల్డ్ బ్యాంక్
2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని ప్రపంచ బ్యాంక్ జనవరి 11న 7 శాతానికి కుదించింది. గతంలో వృద్ధిరేటును 7.6 శాతంగా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ వృద్ధిరేటు అంచనా.. ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) అంచనా(7.1 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కాగా, వృద్ధిరేటు మందగమనానికి రూ.500, రూ.1000 నోట్ల రద్దే కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అయితే ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితంగా రానున్న సంవత్సరాల్లో వృద్ధిరేటు 7.6 శాతం నుంచి 7.8 శాతానికి చేరుకుంటుందని అభిప్రాయపడింది.
3.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2016, డిసెంబర్‌లో 3.39 శాతానికి చేరింది. ఇది 2015, డిసెంబర్‌లో -1.06 శాతంగా నమోదైంది. అంతర్జాతీయంగా, దేశీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో డబ్ల్యూపీఐలో పెరుగుదల చోటుచేసుకుంది. ఇది 2016, నవంబర్‌లో 3.15 శాతంగా నమోదైంది.
భారత జీడీపీ వృద్ధిరేటును 6.6 శాతంగా పేర్కొన్న ఐఎంఎఫ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-17) భారత జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభావం వల్ల వృద్ధిరేటు తగ్గుతుందని జనవరి 16న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతంలో వృద్ధిరేటును ఐఎంఎఫ్ 7.6 శాతంగా అంచనా వేసింది. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సర వృద్ధిరేటును 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. 2018-19లో వృద్ధిరేటును 7.7 శాతంగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చైనా వృద్ధిరేటు 6.7 శాతంగా, 2017లో 6.5 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం
ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) జనవరి 16న విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం దక్కింది. ఈ సూచీలో లిథువేనియా మొదటి స్థానంలో నిలవగా, అజర్‌బైజాన్, హంగేరీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రష్యా 13వ స్థానంలో, చైనా 15వ స్థానంలో, పాకిస్తాన్ 52వ స్థానంలో ఉన్నాయి. స్థూల జాతీయోత్పత్తితోపాటు వృద్ధి, అభివృద్ధి, సమానత్వం, సుస్థిరత వంటి 12 అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఈ సూచీని రూపొందించారు.
ప్రతిభా పాటవాల సూచీలో భారత్‌కు 92వ ర్యాంక్ దక్కింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచీలో భారత్ గతేడాది 89వ స్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ బ్యాంక్ కార్యకలాపాలు
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ మేరకు జనవరి 12న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్తాన్‌లో బ్యాంకింగ్ సేవలు మొదలు పెట్టిన ఎయిర్‌టెల్ ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ఖాతాదారుడి ఫోన్ నంబర్‌నే అకౌంటు నంబర్ కాగా పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి 7.25 శాతం వడ్డీ చెల్లిస్తారు.
ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 17 శాతం
2017 ప్రపంచ స్థూల ఉత్పత్తి-జీడీపీలో భారత్ వాటా 17% చేరుతుందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ-పీడబ్ల్యూసీకు చెందిన ‘గ్లోబల్ ఎకనమిక్ వాచ్’ నివేదిక పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తున్న భారత్ 2016లో 7.5 శాతానికిపైగా వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది.
2017-18లో భారత్‌లో పెరగనున్న నిరుద్యోగం
భారత్‌లో 2017-18 మధ్యకాలంలో నిరుద్యోగం స్వల్పంగా పెరగొచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు యునెటైడ్ నేషన్స్ ఐఎల్‌ఓ తాజాగా 2017 వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషియల్ ఔట్‌లుక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు

- భారత్‌లో నిరుద్యోగులు 1.77 కోట్ల నుంచి 1.78 కోట్లకు, వచ్చే ఏడాది 1.8 కోట్లకు పెరగొచ్చని అంచనా. 2017-18లో నిరుద్యోగ రేటు 3.4 శాతంగా కొనసాగుతుంది.
- గతేడాది దక్షిణాసియా ప్రాంతంలో జరిగిన మొత్తం ఉపాధి సృష్టిలో (1.34 కోట్ల ఉద్యోగాలు) అధిక భాగం భారత్‌దే.
- అంతర్జాతీయ నిరుద్యోగ రేటు 2017లో 5.8%కి పెరగొచ్చని అంచనా. ఇది గతేడాది 5.7 శాతంగా ఉంది.
- 2017లో వర్ధమాన దేశాల్లో నిరుద్యోగం పెరిగితే (5.6% నుంచి 5.7%కి), అభివృద్ధి చెందిన దేశాల్లో తగ్గుతుందని (6.3% నుంచి 6.2%కి) అంచనా.
జూలై 1 నుంచి జీఎస్టీ అమలు
దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీని ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థలు, పన్ను చెల్లింపుదారులపై 90 శాతం నియంత్రణ రాష్ట్రాలకు దఖలు పడనుంది. 10 శాతం హక్కులు కేంద్రానికి ఉంటాయి. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రం, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉంటాయి.
దేశంలో తొలి అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్ ప్రారంభం
భారత తొలి అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఐఎన్‌ఎక్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న ప్రారంభించారు. గుజరాత్‌లో మూడురోజుల పాటు జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2017లో భాగంగా ఐఎన్‌ఎక్స్‌ను బీఎస్‌ఈ ప్రారంభించింది. జనవరి 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఐఎన్‌ఎక్స్ రోజుకు 22 గంటలు పనిచేస్తుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ప్రవాస భారతీయులు, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో పాల్గొనవచ్చు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో దాదాపు రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 21,190 పైచిలుకు అవగాహన ఒప్పందాల(ఎంవోయూ) లక్ష్యాన్ని గుజరాత్ నిర్దేశించుకుంది.
2016-17లో వృద్ధి అంచనా 7.1 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత్ వృద్ధిరేటు మందగమనంలో ఉండనున్నట్లు గణాంకాల శాఖ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని అంచనా.
డిజిటల్ చెల్లింపులపై వాటల్ కమిటీ సిఫార్సులు
నగదు రూపంలో లావాదేవీలను గణనీయంగా తగ్గించి, డిజిటల్ చెల్లింపులకు ఊపు తెచ్చేందుకు వీలుగా ప్రోత్సాహకాలను ప్రకటించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు రతన్ పి.వాటల్ నేతృత్వంలోని డిజిటల్ చెల్లింపుల కమిటీ సిఫార్సు చేసింది. డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన అంశాల కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు డిసెంబర్ 27న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది.
కోటి దాటిన డిజిధన్ అభియాన్ శిక్షణదారులు
డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచే కార్యక్రమం డిజిధన్ అభియాన్‌లో కేవలం 20 రోజుల్లోనే సుమారు కోటి మందికిపైగా గ్రామీణులు చేరారని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ డిసెంబర్ 28న తెలిపారు. 476 జిల్లా లు, 2782 బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 15 లక్షల మంది ఇందులో పేర్లు నమోదు చేసుకున్నారు.
2022 నాటికి పేదలందరికి పక్కా ఇళ్లు
2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంలో 2019 నాటికి కోటి ఇళ్లను నిర్మించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 లక్షల ఇళ్ల (నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువ) ను కేంద్రప్రభుత్వం నిర్మించి ఇచ్చింది.
ఈ-వ్యాలెట్ యాప్ ‘భీమ్’ను ఆవిష్కరించిన మోదీ
డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలు సులభతరం చేయడానికి అనువుగా డిసెంబర్ 30న ‘భీమ్’(భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ - BHIM) యాప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ కర్త, డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ పేరిట దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను ఇంటర్నెట్ అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ లేదా ఫీచర్ ఫోన్‌లో ఉపయోగించవచ్చు.
‘మాతృత్వ ప్రయోజన పథకం’ ప్రారంభం
గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘మాతృత్వ ప్రయోజన పథకం’ను (Pregnancy Aid Scheme) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ జనవరి 3న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆస్పత్రి ఖర్చులు, టీకాలు, పోషకాహారం కోసం పథకం కింద రూ.6,000 నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మూడు విడతలుగా జమచేస్తారు. ఇందుకయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తాయి.

Published date : 09 Jan 2017 04:35PM