Indian Economy: 52.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత్ జీడీపీ.. ఇండియా తర్వాతే అమెరికా
Sakshi Education
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళుతోంది. రానున్న 50 ఏళ్లలో భారత జీడీపీ మరింత వేగంగా వృద్ధి నమోదు చేసే అవకాశముందని ప్రముఖ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2075 నాటికి భారత్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి గా అవతరించనుందని పేర్కొంది.
అమెరికా ను దాటేసి ఈ ఘనత సాధిస్తుందని తెలిపింది. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని.. చైనా తర్వాతి స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. అయితే ఇది సాకారమవ్వాలంటే శ్రామిక శక్తిలో భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రతిభ కలిగిన యువతకు శిక్షణ, నైపుణ్యాలను కల్పించడంపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత్ ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుండటమే గాక.. భారతీయుల తలసరి ఆదాయం పెరుగుతోందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది.
Published date : 11 Jul 2023 05:15PM