Skip to main content

GDP Growth: ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం?

India GDP Growth

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్‌ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని నవంబర్‌ 30న వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

2021–22పై అంచనాలు ఇలా..

  • 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా సవాళ్లతో భారత ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి 9.3 శాతం–9.6 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
  • అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) నవంబర్‌ 30న ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్‌ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8 శాతం ఉంటుందని విశ్లేషించింది.

చ‌ద‌వండి: ప్రభుత్వ రంగ సంస్థ సీఈఎల్‌ను ఏ కంపెనీకి విక్రయించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వేగంగా వృద్ధి చెందుతున్న దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 30
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : భారత్‌.. 2021–22 ఏడాది రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకున్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 Dec 2021 03:05PM

Photo Stories