Skip to main content

Disinvestment: ప్రభుత్వ రంగ సంస్థ సీఈఎల్‌ను ఏ కంపెనీకి విక్రయించనున్నారు?

CEL

నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ సంస్థకు ప్రభుత్వ రంగ సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ను విక్రయించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ. 210 కోట్ల విలువైన ఈ ఒప్పంద ప్రక్రియ.. 2022 మార్చి నాటికి పూర్తి కానుంది. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కింద 1974లో సీఈఎల్‌ ఏర్పాటైంది. సోలార్‌ ఫొటోవోల్టెయిక్‌ (ఎస్‌పీవీ) విభాగంలో దిగ్గజంగా ఎదిగింది. సొంతంగా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కూడా ఉన్నాయి. రైళ్లు సురక్షితంగా నడిచేందుకు రైల్వే సిగ్నలింగ్‌ సిస్టమ్‌లో ఉపయోగించే యాక్సిల్‌ కౌంటర్‌ సిస్టమ్‌లు వంటివి అభివృద్ధి చేసింది.

ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?

సహ రుణాలు ఇచ్చేందుకు కాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌తో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు వ్యూహాత్మక, అనుకూల రుణ పరిష్కారాలను ఆఫర్‌ చేస్తారు. ఈ భాగస్వామ్యం ద్వారా సరైన వ్యక్తులకు నాణ్యమైన రుణాలు చేరతాయని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా తెలిపారు.
చ‌ద‌వండి: కాగ్‌ లెక్కల ప్రకారం.. 2019–20లో రాష్ట్ర వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : నందల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ సంస్థకు ప్రభుత్వ రంగ సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ను విక్రయించే ప్రతిపాదనకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్‌ 29
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Nov 2021 03:28PM

Photo Stories