India Sets Export Record: 2021–22 ఏడాదిలో దేశ ఎగుమతలు ఎంత శాతం పెరిగాయి?
India Achieves 400 Billion Dollars Goods Exports Target: దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని మార్చి 23న కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల(సుమారు రూ.30 లక్షల కోట్లు) ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరం 2020–21తో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్ డాలర్లుగా మార్చి 22 నాటికి నమోదైనట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు.
వాణిజ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
- దేశ ఎగుమతులు 2020–21లో 292 బిలియన్ డాలర్లు, 2018–19లో 330 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది.
- భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి.
- 2021–22 ఆర్థిక ఏడాదిలో ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి.
Global House Price Index 2021: ఇళ్ల రేట్లలో భారత్‌కు ఎన్నో ర్యాంకు లభించింది?
అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం: ప్రధాని మోదీ
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
రాష్ట్రాల సహకారంతో..
ట్విట్టర్‌లో ప్రధాని మోదీ.. ఎగుమతులకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను పోస్ట్ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి.
The Wealth Report - 2022: ఎన్ని డాలర్లు కలిగిన వారిని అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణిస్తారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల(సుమారు రూ.30 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి.
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : కేంద్ర వాణిజ్య శాఖ
ఎందుకు : దేశ ఉత్పత్తుల పెరగడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్