GST Collection: జీఎస్‌టీ వసూళ్లు.. రూ.1.46 లక్షల కోట్లు
జీఎస్‌టీ వ సూళ్లు రూ.1.4 లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కాగా, ఆగస్టు తర్వాత తక్కువ వసూళ్లు జరగడం నవంబర్‌లోనే మొదటిసారి. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు విభాగాల వారీగా..
☛ సెంట్రల్ జీఎస్‌టీ రూ.25,681 కోట్లు
☛ స్టేట్ జీఎస్‌టీ రూ.32,651 కోట్లు
☛ ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.77,103 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.38,635 కోట్లుసహా).
☛ సెస్ రూ.10,432 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.817
కోట్లతో సహా)
☛ ‘ఒకే దేశం– ఒకే పన్ను’ నినాదంతో 2017 జూలైలో పలు రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రారంభమైన జీఎస్‌టీ వ్యవస్థలో 2022 ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,67,650 కోట్లుగా నమోదయ్యాయి.
Inspirational Story : ఇరవై ఒక్కవేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. నా సక్సెస్ సిక్రెట్ ఇదే..
2022 నుంచి ఇలా...
నెల | జీఎస్‌టీ ఆదాయం (రూ.కోట్లలో) |
జనవరి 2022 | 1,40,986 |
ఫిబ్రవరి | 1,33,026 |
మార్చి | 1,42,095 |
ఏప్రిల్ | 1,67,650 |
మే | 1,40,885 |
జూన్ | 1,44,616 |
జూలై | 1,48,995 |
ఆగస్టు | 1,43,612 |
సెప్టెంబర్ | 1,47,686 |
అక్టోబర్ | 1,51,718 |
నవంబర్ | 1,45,867 |