Skip to main content

GDP Growth Rate: 2026–27 జీడీపీ వృద్ధి రేటు ..

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2026–27 ఆర్థిక సంవత్సరం వరకూ సగటున 6.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ సీనియర్‌ ఎకనమిస్ట్‌ (ఆసియా–పసిఫిక్‌) విశ్రుత్‌ రాణా అంచనావేశారు.
GDP Growth Rate
GDP Growth Rate

దేశీయ వినియోగమే ఎకానమీ పురోగతికి ప్రధాన కారణంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. 2022–23లో ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతంకాగా, ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఎగుమతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లు వృద్ధి రేటుకు కొంత ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. వడ్డీరేట్ల పెంపు, వినియోగ డిమాండ్‌పై ఈ ప్రతికూలతలు తక్షణం ఎకానమీ బలహీనతకు కారణంగా పేర్కొన్నారు. పెట్టుబడుల పరంగా చూస్తే దేశీయ రికవరీ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. 
 Daily Current Affairs in Telugu: 29 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 29 Jun 2023 04:14PM

Photo Stories