FM Nirmala Sitharaman: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్–2021ను ఎక్కడ నిర్వహించారు?
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) సెప్టెంబర్ 28న న్యూఢిల్లీలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021’ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. అనంతరం ‘బాధ్యతాయుత చెల్లింపుల విషయమై ఐక్యరాజ్యసమితి సూత్రాలు’ అనే నివేదికను ఆవిష్కరించారు. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో క్లయింట్ల డేటా గోప్యత విషయంలో రాజీ పడకూడదని ఈ సందర్భంగా మంత్రి నిర్మల పేర్కొన్నారు. డిజిటల్ మోసాలను నివారించడంలో ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు) సంస్థలు కీలక పాత్ర పోషించగలవని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ అన్నారు.
రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం: క్రిసిల్
రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని తెలిపింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే ఇది దాదాపు సమానమేనని వివరించింది.
చదవండి: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీఎస్‌టీ సమీక్ష కమిటీకి నేతృత్వం వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2021 కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ