Mark Zuckerberg: ఫేస్‌బుక్ కంపెనీ నూతన పేరు ఏమిటీ?
ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింంది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అక్టోబర్ 28న కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొత్త లోగో ఆవిష్కరణ జరిగింది. ఇంతకుముందు ఫేస్‌బుక్ కంపెనీ కింద కొనసాగిన సామాజిక మాధ్యమాలు– ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి. అంటే మాతృసంస్థ పేరు మాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు.
అందుకే పేరు మార్పు...
భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్ పేరును మార్చినట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. ‘మెటా’ అనేది గ్రీకు పదమని చెప్పారు. ‘యాప్స్’ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన ‘మెటావర్స్’దిశగా మెటా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. వర్చువల్–రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవల వినియోగం, తత్సబంధ అంశాలు ‘మెటావర్స్’ పరిధిలోకి వస్తాయి.
చదవండి: ఏఐఐబీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెటాగా ఫేస్‌బుక్ కంపెనీ పేరు మార్పు
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్
ఎందుకు : భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్