ఏప్రిల్ 2021 ఎకానమీ
Sakshi Education
రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీగా నియమితులైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్?
నియంత్రణలను క్రమబద్దీకరించడం, ఆయా నిబంధనల అమల్లో క్లిష్టతలను తగ్గించడం తదితర అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తిరిగి దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి రెండవ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ (ఆర్‌ఆర్‌ఏ 2.0)ని ఏప్రిల్ 15న ఏర్పాటు చేసింది. రెగ్యులేషన్స్ రివ్యూ అథారిటీగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం. రాజేశ్వర్ రావు నియమితులైనట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ అథారిటీ 2021 మే 1వ తేదీ నుంచీ ఏడాదిపాటు (కాలపరిమితి పొడిగించని పక్షంలో) కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
1999లో తొలి ఆర్‌ఆర్‌ఏ ఏర్పాటు...
తొలి ఆర్‌ఆర్‌ఏను ఆర్‌బీఐ 1999 ఏప్రిల్ 1న ఏడాది కాలానికి ఏర్పాటు చేసింది. ప్రజలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రాతిపదికన అప్పటి ఆర్‌ఆర్‌ఏ రెగ్యులేషన్లు, సర్క్యులర్లు, రిపోర్టింగ్ వ్యవస్థలను సమీక్షించింది. తొలి రివ్యూ అథారిటీ సిఫారసులకు అనుగుణంగా నియంత్రణా వ్యవస్థల విధివిధానాల అమల్లో పాదర్శకత, సరళత్వం, పటిష్టత తీసుకురావడం జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండవ రెగ్యులేటరీ రివ్యూ అథారిటీ (ఆర్‌ఆర్‌ఏ 2.0) ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : నియంత్రణలను క్రమబద్దీకరించడం, ఆయా నిబంధనల అమల్లో క్లిష్టతలను తగ్గించడం తదితర అంశాలపై దృష్టి సారించేందుకు...
భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్‌కు వీడ్కోలు పలికిన బ్యాంక్?
భారత్‌లో క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు తదితర కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీబ్యాంక్ ఏప్రిల్ 15న ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు శతాబ్దం క్రితం 1902లో సిటీబ్యాంక్.. భారత్‌లో అడుగుపెట్టింది. 1985 నుంచి కన్సూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తోంది.
ఏవియేషన్ అకాడమీతో బోయింగ్ జట్టు
విమాన తయారీ దిగ్గజం బోయింగ్ తాజాగా ఇండియన్ ఏవియేషన్ అకాడమీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం... దేశీయ విమానయాన రంగంలోని భాగస్వాములకు సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై శిక్షణ ఇస్తారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం... వాణిజ్య వైమానిక సేవల కంపెనీలు, విమానాశ్రయాలు, ఎయిర్ ట్రాఫిక్ సర్వీసులకు సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అవసరం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిటైల్ బ్యాంకింగ్‌కు వీడ్కోలు పలికిన బ్యాంక్?
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీబ్యాంక్
ఎక్కడ : భారత్
ఎందుకు : అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా...
ఏ పథకం కింద కోవిడ్ వారియర్స్‌కు కొత్త బీమా విధానం అమల్లోకి రానుంది?
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ(పీఎంజీకేపీ) కింద కోవిడ్–19 వారియర్స్‌కు 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి కొత్త బీమా విధానం అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్ 19న తెలిపింది. నిర్వహణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు దీని ద్వారా రూ.50 లక్షలు అందుతాయి.
18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా..
2021, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా వేసేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది. కానీ 18 ఏళ్ల నుంచి 45 లోపు వారికి నిర్ధిష్ట రుసుము చెల్లించడం ద్వారా టీకా వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. తొలి విడతగా జనవరి 16, 2021 నుంచి ఆరోగ్య రంగ సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అనంతరం మార్చి 20 నుంచి రెండో దశలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
దేశీయ స్టార్టప్స్‌ను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన... స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం 2021, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏప్రిల్ 19న తెలిపారు. ప్రారంభ దశలో కీలకమైన మూలధనం లేకపోవటంతో టేకాఫ్ చేయలేకపోతున్న స్టార్టప్స్‌కు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న వ్యాపార ఆలోచనలకు ఈ స్కీమ్ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పథకం–వివరాలు
ఏమిటి : 2021, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : దేశీయ స్టార్టప్స్‌ను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు...
డబ్ల్యూఎల్‌పీ రెండో హబ్‌గా ఎంపికైన భారతీయ నగరం?
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్ (డబ్ల్యూఎల్‌పీ) భారత్‌లో తమ కార్యకలాపాలకు రెండో హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఈ మేరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో రెండింటితో జట్టు కట్టింది.
ఫిబ్రవరిలో తొలిసారిగా...
డబ్ల్యూఎల్‌పీ 2021 ఫిబ్రవరిలో తొలిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గోతో చేతులు కలిపింది. డబ్ల్యూఎల్‌పీకి దేశీయంగా ముంబై తొలి హబ్ కాగా, హైదరాబాద్ రెండోది కానుంది.
10కి పైగా దేశాలు...
ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికాలోని వ్యాపార సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య మార్గాలను మెరుగుపర్చడంతో పాటు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై డబ్ల్యూఎల్‌పీ గ్రూప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా తదితర 10 పైగా దేశాలు ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం డబ్ల్యూఎల్‌పీ సీఈవోగా మైక్ భాస్కరన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఎల్‌పీ రెండో హబ్‌గా ఎంపికైన భారతీయ నగరం?
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : హైదరాబాద్
ఎక్కడ : భారత్
ఎందుకు : వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు
ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. 2021లో భారత్ వృద్ధి రేటు?
2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. అలాగే 2022 ఏడాదిలో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 6న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో ఈ విషయాలను వెల్లడించింది.
ఐఎంఎఫ్ అవుట్‌లుక్–ముఖ్యాంశాలు
ఏర్పాటు: 1945, డిసెంబర్ 27
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
అధికార భాష: ఇంగ్లీష్
మేనేజింగ్ డెరైక్టర్: క్రిస్టాలినా జార్జివా
చీఫ్ ఎకనమిస్ట్: గీతా గోపినాథ్
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుంది.
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : 2021 ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో..
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని ఏప్రిల్ 7న ఆర్‌బీఐ ఎంపీసీ వెల్లడించింది.
వృద్ధి 10.5 శాతం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్‌బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే..
రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్‌బీఐ లక్ష్యంగా ఉంది.
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని...
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగొలు చేసిన స్టార్టప్?
టెస్ట్ ప్రిపరేషన్ సేవల దిగ్గజం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్(ఏఈఎస్‌ఎల్ )ను... ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్ కొనుగోలు చేసింది. తద్వారా ఆఫ్‌లైన్ విద్యా విభాగంలోనూ బైజూస్ తన కార్యకలాపాలు విస్తరించనుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 7,300 కోట్లు) ఉంటుంది. బైజూస్ ఇప్పటిదాకా కుదుర్చుకున్న డీల్స్‌లో ఇదే అతి పెద్దది కాగా ఎడ్–టెక్ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి. కొంత నగదు, కొంత ఈక్విటీ రూపంలో ఈ డీల్ ఉంటుందని ఏప్రిల్ 5న ఆకాష్ తెలిపింది.
33 ఏళ్ల ఆకాష్ ప్రస్థానం ..
ఏఈఎస్‌ఎల్ దాదాపు 33 ఏళ్లుగా మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మొదలైన వాటికి సంబంధించి విద్యార్థులకు శిక్షణనిస్తోంది. దేశవ్యాప్తంగా 215 సెంటర్లు (ఫ్రాంచైజీలు సహా), 2.5 లక్షల పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. 2019లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇందులో 37.5 శాతం వాటాను కొనుగోలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగొలు చేసిన స్టార్టప్?
ఎప్పుడు : ఏప్రిల్5
ఎవరు : ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్
ఎందుకు : ఆఫ్‌లైన్ విద్యా విభాగంలోనూ బైజూస్ తన కార్యకలాపాలను విస్తరించేందుకు
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశం?
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా అమెరికా నిలిచింది. అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏప్రిల్ 7న విడుదల చేసిన 35వ వార్షిక బిలియనీర్ల జాబితా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం... అమెరికాలో 724 మంది, చైనాలో 698 మంది, భారత్‌లో 140 మంది బిలియనీర్లు ఉన్నారు. జర్మనీ (136), రష్యా (117) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బిలియనీర్స్ జాబితాలో సంపన్నుల సంఖ్య 660 పెరిగి 2,755కి చేరింది. వీరి సంపద విలువ 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
నివేదికలోని ముఖ్యమైన అంశాలు...
ఏమిటి : అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశం అమెరికా
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్
ఎక్కడ : ప్రపంచంలో

- వచ్చే నాలుగేళ్లలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద రూ.945 కోట్లు కార్పస్ ఫండ్‌గా అందించబడుతుంది.
- 300 ఇంక్యుబేటర్ల ద్వారా సుమారు 3,600 స్టార్టప్స్‌కు సీడ్ పండ్‌ను అందించాలన్నది ఈ లక్ష్యం.
- ఈ స్కీమ్ అమలు, పర్యవేక్షణకు ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈఏసీ ఎంపిక చేసిన ఇంక్యుబేటర్లకు రూ.5 కోట్ల వరకు గ్రాంట్స్ మంజూరు చేస్తారు.
- మరికొన్ని రకాల స్టార్టప్స్‌కు వాటి స్థాయిని బట్టి... రూ.20 లక్షలు, రూ.50 లక్షల వరకు ఫండ్స్ అందిస్తారు.
ఏమిటి : 2021, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : దేశీయ స్టార్టప్స్‌ను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు...
డబ్ల్యూఎల్‌పీ రెండో హబ్‌గా ఎంపికైన భారతీయ నగరం?
వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్ (డబ్ల్యూఎల్‌పీ) భారత్‌లో తమ కార్యకలాపాలకు రెండో హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఈ మేరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో రెండింటితో జట్టు కట్టింది.
ఫిబ్రవరిలో తొలిసారిగా...
డబ్ల్యూఎల్‌పీ 2021 ఫిబ్రవరిలో తొలిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గోతో చేతులు కలిపింది. డబ్ల్యూఎల్‌పీకి దేశీయంగా ముంబై తొలి హబ్ కాగా, హైదరాబాద్ రెండోది కానుంది.
10కి పైగా దేశాలు...
ఆఫ్రికా, ఆసియా, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికాలోని వ్యాపార సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాణిజ్య మార్గాలను మెరుగుపర్చడంతో పాటు కొత్త మార్గాలను అభివృద్ధి చేయడం తదితర అంశాలపై డబ్ల్యూఎల్‌పీ గ్రూప్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా తదితర 10 పైగా దేశాలు ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం డబ్ల్యూఎల్‌పీ సీఈవోగా మైక్ భాస్కరన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూఎల్‌పీ రెండో హబ్‌గా ఎంపికైన భారతీయ నగరం?
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : హైదరాబాద్
ఎక్కడ : భారత్
ఎందుకు : వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు
ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. 2021లో భారత్ వృద్ధి రేటు?
2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. అలాగే 2022 ఏడాదిలో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 6న విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో ఈ విషయాలను వెల్లడించింది.
ఐఎంఎఫ్ అవుట్‌లుక్–ముఖ్యాంశాలు
- –2020 ఏడాదిలో 2.3 శాతం వృద్ధి సాధించిన చైనా... 2021లో 8.6 శాతం, 2022లో 5.6 శాతం వృద్ధిని సాధిస్తుంది.
- 2020లో 3.3 శాతం క్షీణించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుంది.
ఏర్పాటు: 1945, డిసెంబర్ 27
ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డీసీ (అమెరికా)
అధికార భాష: ఇంగ్లీష్
మేనేజింగ్ డెరైక్టర్: క్రిస్టాలినా జార్జివా
చీఫ్ ఎకనమిస్ట్: గీతా గోపినాథ్
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదవుతుంది.
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు : 2021 ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో..
ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని ఏప్రిల్ 7న ఆర్‌బీఐ ఎంపీసీ వెల్లడించింది.
వృద్ధి 10.5 శాతం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్‌బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే..
రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్‌బీఐ లక్ష్యంగా ఉంది.
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని...
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగొలు చేసిన స్టార్టప్?
టెస్ట్ ప్రిపరేషన్ సేవల దిగ్గజం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్(ఏఈఎస్‌ఎల్ )ను... ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్ కొనుగోలు చేసింది. తద్వారా ఆఫ్‌లైన్ విద్యా విభాగంలోనూ బైజూస్ తన కార్యకలాపాలు విస్తరించనుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 7,300 కోట్లు) ఉంటుంది. బైజూస్ ఇప్పటిదాకా కుదుర్చుకున్న డీల్స్‌లో ఇదే అతి పెద్దది కాగా ఎడ్–టెక్ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి. కొంత నగదు, కొంత ఈక్విటీ రూపంలో ఈ డీల్ ఉంటుందని ఏప్రిల్ 5న ఆకాష్ తెలిపింది.
33 ఏళ్ల ఆకాష్ ప్రస్థానం ..
ఏఈఎస్‌ఎల్ దాదాపు 33 ఏళ్లుగా మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మొదలైన వాటికి సంబంధించి విద్యార్థులకు శిక్షణనిస్తోంది. దేశవ్యాప్తంగా 215 సెంటర్లు (ఫ్రాంచైజీలు సహా), 2.5 లక్షల పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. 2019లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ ఇందులో 37.5 శాతం వాటాను కొనుగోలు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను కొనుగొలు చేసిన స్టార్టప్?
ఎప్పుడు : ఏప్రిల్5
ఎవరు : ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్
ఎందుకు : ఆఫ్‌లైన్ విద్యా విభాగంలోనూ బైజూస్ తన కార్యకలాపాలను విస్తరించేందుకు
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశం?
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశంగా అమెరికా నిలిచింది. అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏప్రిల్ 7న విడుదల చేసిన 35వ వార్షిక బిలియనీర్ల జాబితా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం... అమెరికాలో 724 మంది, చైనాలో 698 మంది, భారత్‌లో 140 మంది బిలియనీర్లు ఉన్నారు. జర్మనీ (136), రష్యా (117) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బిలియనీర్స్ జాబితాలో సంపన్నుల సంఖ్య 660 పెరిగి 2,755కి చేరింది. వీరి సంపద విలువ 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
నివేదికలోని ముఖ్యమైన అంశాలు...
- అమెజాన్ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 177 బిలియన్ డాలర్లకు చేరింది.
- ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 151 బిలియన్ డాలర్ల సంపదతో (126 బిలియన్ డాలర్ల వృద్ధి) రెండో స్థానంలో ఉన్నారు.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానం దక్కించుకున్నారు. 84.5 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ 10 అంతర్జాతీయ బిలియనీర్స్ జాబితాలో మరోసారి పదో స్థానం దక్కించుకున్నారు.
ఏమిటి : అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశం అమెరికా
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 16 Apr 2021 05:32PM