BRICS Countries: సీఆర్‌ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు ఉద్దేశం?
కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) రీసెర్చ్ గ్రూప్ రూపొందించిన బ్రిక్స్ ఎకనమిక్ బులిటన్ పేర్కొంది. నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని వివరించింది. బ్రిక్స్ సెంట్రల్ బ్యాంకుల సభ్యులతో కలిసి సీఆర్‌ఏ రూపొందించిన ఈ బులిటిన్‌ను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. బ్రిక్స్ పరిశోధన, ఆర్థిక విశ్లేషణ, నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సీఆర్‌ఏ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటయ్యింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్‌కు ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష స్థానంలో ఉంది.
రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్ డోసు: ఐసీఎంఆర్
కోవిడ్–19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న 9 నెలల అనంతరం కరోనా టీకా బూస్టర్ డోసును ఇవ్వవచ్చని పార్లమెంటరీ కమిటీకి ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) సూచించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి దేశంలో 86 శాతం మందికి కనీసం ఒక్కడోసు పూర్తైందని ఐసీఎంఆర్ బలరామ్ భార్గవ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 32కు చేరుకున్నట్లు కేంద్రం డిసెంబర్ 10న తెలిపింది.
చదవండి: క్రెడిట్ సూసీ అంచనా ప్రకారం.. 2021–22 దేశ వృద్ధి రేటు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ మహమ్మారి బ్రిక్స్ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ (సీఆర్‌ఏ) రీసెర్చ్ గ్రూప్
ఎక్కడ : బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా
ఎందుకు : నిరుద్యోగం, పేదరికం, లింగ వివక్షత, వలసలు... ఇలా పలు సామాజిక అంశాలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్