ఆగష్టు 2019 ఎకానమీ
Sakshi Education
ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్
ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఎఫ్‌ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు ఆగస్టు 23న ముగిశాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు గ్రే లిస్టులో ఉన్న విషయం విదితమే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్
ఎందుకు : ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందని
ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం : నిర్మలా
మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆగస్టు 23న నిర్వహించిన మీడియా సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు కీలక నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి ప్రకటనలోని ముఖ్య నిర్ణయాలు
అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల అమలు
అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం డ చేయనున్నట్టు చైనా ప్రకటించింది. అలాగే 2019, డిసెంబర్ 15 నుంచి అమెరికన్ తయారీ వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25 శాతం లేదా 5 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు ఆగస్టు 23న వెల్లడించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు అమలు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : చైనా
కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్ల నిధులు
కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్ణయించింది. బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులు, ఆర్‌బీఐ బోర్డు సూచనల ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆగస్టు 26న బిమల్ జలాన్ కమిటీ సిఫారసులను ఆమోదించింది. ఈ కమిటీ సిఫారసుల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి ఆర్‌బీఐ బదిలీ చేయనుంది.
ఆర్‌బీఐ ప్రకటన సారాంశం...
కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్‌బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది) అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రప్రభుత్వానికి రూ.1,76,051 కోట్ల నిధులు బదిలీ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదు: ఎస్‌బీఐ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రభుత్వం నుంచి తమకు మూలధన నిధుల సాయం అవసరం లేదని, తగినన్ని నిధుల లభ్యత ఉందని ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఆగస్టు 27న వెల్లడించింది. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు, రుణ వితరణ సామర్థ్యం ఇనుమడింపజేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్షణమే రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 23న ప్రకటించిన విషయం తెలిసిందే.
జీడీపీ అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) వృద్ధి రేటు అంచనాలకు ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్ కోత విధించింది. ఈ మేరకు వృద్ధి రేటును 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గిస్తున్నట్లు ఆగస్టు 28న వెల్లడించింది. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది. 2019, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 5.7 శాతంగానే ఉంటుందని అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలకు కోత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
ఎందుకు : వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాల కారణంగా
సీఐఐ సమావేశంలో నిర్మలా సీతారామన్
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 9న నిర్వహించిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిర్మలా మాట్లాడుతూ... మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతోనూ మంత్రి సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర మంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్‌బీఐ అనుమతి
దేశంలో మామూలు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే దేశంలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు వీలు కలుగుతుంది. ఆర్‌బీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేసే బ్యాంకుల జాబితా ఆర్‌బీఐ యాక్ట్, 1934 రెండవ షెడ్యూల్‌లో ఉంటుంది. ఈ రెండవ షెడ్యూల్‌లో ‘బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్’ పేరును కూడా చేర్చడం జరిగిందని సెంట్రల్ బ్యాంక్ ఆగస్టు 1న ప్రకటించింది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను కూడా రెండవ షెడ్యూల్‌లో చేర్చినట్లు కూడా తెలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంక్ ఆఫ్ చైనాకు అనుమతి
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : దేశంలో మామూలు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడానికి
సావరిన్ గోల్డ్ బాండ్ ధర స్థిరీకరణ
సావరిన్ గోల్డ్ బాండ్‌స 2019-2020 (సిరీస్ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 2న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది.
2018 జీడీపీ ర్యాంకులు విడుదల
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల జాబితాను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జీడీపీ పరంగా 20.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో భారత్ ఏడో ర్యాంకును పొందింది.
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకులు
2017లో భారత్ ఫ్రాన్స్ ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం తెలిసిందే. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2024 నాటికి భారత జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. 2019 ఏడాది వరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018 జీడీపీ ర్యాంకుల జాబితా విడుదల
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా
కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.11 కోట్ల జరిమానా విధించింది. వీటిలో అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 2 కోట్ల చొప్పున), బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.1.5 కోట్ల చొప్పున) ఉన్నాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌పై రూ. కోటి జరిమానా విధించడం జరిగింది.
మరోవైపు సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను కార్పొరేషన్ బ్యాంక్‌పై రూ.కోటి జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన
ఎంపీసీ ద్వైమాసిక సమావేశం ప్రారంభం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ఆగస్టు 5న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన ప్రారంభమైన ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆగస్టు 7వ తేదీన ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడనుంది.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. ప్రస్తుతం రెపో రేటు 5.75 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
కీలక పాలసీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 35 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి, రివర్స్ రెపో 5.15 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపుతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గడంతోపాటు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది.
పాలసీ ముఖ్యాంశాలు...
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ
యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా గోసంరక్షణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 7న ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గోసంరక్షణశాలల్లోని లక్ష గోవులను ఎంపిక చేసిన రైతులకు, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు అందజేస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రకారం నెలకు రూ.900 వేతనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. తొలిదశలో ఈ కొత్త స్కీమ్ కింద రూ.109 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎందుకు : యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో
ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఎఫ్‌ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు ఆగస్టు 23న ముగిశాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు గ్రే లిస్టులో ఉన్న విషయం విదితమే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్
ఎందుకు : ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందని
ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం : నిర్మలా
మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆగస్టు 23న నిర్వహించిన మీడియా సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు కీలక నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి ప్రకటనలోని ముఖ్య నిర్ణయాలు
- దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్‌చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది.
- స్టార్టప్‌లు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఆదాయపన్ను చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదు.
- ఆర్‌బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలి.
- వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనుంది.
- హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం.
- ఎంఎస్‌ఎంఈలకు జీఎస్‌టీ రిఫండ్‌లను ప్రభుత్వం ఇకపై 30 రోజుల్లోపు చెల్లించనుంది.
- 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 వాహనాలనే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బీఎస్-4 వాహనాల నిల్వలు పెరిగిపోతుండడం, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో... 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ గడువు వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నట్టు మంత్రి చెప్పారు.
అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల అమలు
అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం డ చేయనున్నట్టు చైనా ప్రకటించింది. అలాగే 2019, డిసెంబర్ 15 నుంచి అమెరికన్ తయారీ వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25 శాతం లేదా 5 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు ఆగస్టు 23న వెల్లడించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు అమలు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : చైనా
కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్ల నిధులు
కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్ణయించింది. బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులు, ఆర్‌బీఐ బోర్డు సూచనల ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆగస్టు 26న బిమల్ జలాన్ కమిటీ సిఫారసులను ఆమోదించింది. ఈ కమిటీ సిఫారసుల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి ఆర్‌బీఐ బదిలీ చేయనుంది.
ఆర్‌బీఐ ప్రకటన సారాంశం...
కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్‌బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది) అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రప్రభుత్వానికి రూ.1,76,051 కోట్ల నిధులు బదిలీ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేదు: ఎస్‌బీఐ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రభుత్వం నుంచి తమకు మూలధన నిధుల సాయం అవసరం లేదని, తగినన్ని నిధుల లభ్యత ఉందని ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఆగస్టు 27న వెల్లడించింది. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు, రుణ వితరణ సామర్థ్యం ఇనుమడింపజేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్షణమే రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 23న ప్రకటించిన విషయం తెలిసిందే.
జీడీపీ అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) వృద్ధి రేటు అంచనాలకు ఇండియా రేటింగ్‌స అండ్ రీసెర్చ్ కోత విధించింది. ఈ మేరకు వృద్ధి రేటును 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గిస్తున్నట్లు ఆగస్టు 28న వెల్లడించింది. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది. 2019, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 5.7 శాతంగానే ఉంటుందని అంచనా వేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలకు కోత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
ఎందుకు : వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాల కారణంగా
సీఐఐ సమావేశంలో నిర్మలా సీతారామన్
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 9న నిర్వహించిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నిర్మలా మాట్లాడుతూ... మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతోనూ మంత్రి సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర మంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్‌బీఐ అనుమతి
దేశంలో మామూలు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే దేశంలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు వీలు కలుగుతుంది. ఆర్‌బీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేసే బ్యాంకుల జాబితా ఆర్‌బీఐ యాక్ట్, 1934 రెండవ షెడ్యూల్‌లో ఉంటుంది. ఈ రెండవ షెడ్యూల్‌లో ‘బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్’ పేరును కూడా చేర్చడం జరిగిందని సెంట్రల్ బ్యాంక్ ఆగస్టు 1న ప్రకటించింది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను కూడా రెండవ షెడ్యూల్‌లో చేర్చినట్లు కూడా తెలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్యాంక్ ఆఫ్ చైనాకు అనుమతి
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : దేశంలో మామూలు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడానికి
సావరిన్ గోల్డ్ బాండ్ ధర స్థిరీకరణ
సావరిన్ గోల్డ్ బాండ్‌స 2019-2020 (సిరీస్ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు 2న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది.
2018 జీడీపీ ర్యాంకులు విడుదల
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల జాబితాను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జీడీపీ పరంగా 20.5 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో భారత్ ఏడో ర్యాంకును పొందింది.
ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకులు
ర్యాంకు | దేశం | జీడీపీ విలువ |
1 | అమెరికా | 20.5 ట్రిలియన్ డాలర్లు |
2 | చైనా | 13.6 ట్రిలియన్ డాలర్లు |
3 | జపాన్ | 4.9 ట్రిలియన్ డాలర్లు |
4 | జర్మనీ | 3.9 ట్రిలియన్ డాలర్లు |
5 | బ్రిటన్ | 2.82 ట్రిలియన్ డాలర్లు |
6 | ఫ్రాన్స్ | 2.77 ట్రిలియన్ డాలర్లు |
7 | భారత్ | 2.72 ట్రిలియన్ డాలర్లు |
8 | ఇటలీ | 2.07 ట్రిలియన్ డాలర్లు |
9 | బ్రెజిల్ | 1.87 ట్రిలియన్ డాలర్లు |
10 | కెనడా | 1.71 ట్రిలియన్ డాలర్లు |
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018 జీడీపీ ర్యాంకుల జాబితా విడుదల
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా
కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.11 కోట్ల జరిమానా విధించింది. వీటిలో అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (రూ. 2 కోట్ల చొప్పున), బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.1.5 కోట్ల చొప్పున) ఉన్నాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌పై రూ. కోటి జరిమానా విధించడం జరిగింది.
మరోవైపు సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను కార్పొరేషన్ బ్యాంక్‌పై రూ.కోటి జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ రంగ బ్యాంకులపై జరిమానా
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : కరెంట్ అకౌంట్ ప్రారంభం విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన
ఎంపీసీ ద్వైమాసిక సమావేశం ప్రారంభం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ఆగస్టు 5న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన ప్రారంభమైన ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆగస్టు 7వ తేదీన ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడనుంది.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. ప్రస్తుతం రెపో రేటు 5.75 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
కీలక పాలసీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 35 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి, రివర్స్ రెపో 5.15 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపుతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గడంతోపాటు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం కూడా తగ్గనుంది.
పాలసీ ముఖ్యాంశాలు...
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గింపు
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ
యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా గోసంరక్షణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 7న ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గోసంరక్షణశాలల్లోని లక్ష గోవులను ఎంపిక చేసిన రైతులకు, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు అందజేస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రకారం నెలకు రూ.900 వేతనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. తొలిదశలో ఈ కొత్త స్కీమ్ కింద రూ.109 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూపీలో కొత్తగా గోసంరక్షణ పథకం
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎందుకు : యూపీలోని ప్రభుత్వ గోశాలల్లో వాటిని పరిరక్షించడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో
Published date : 23 Aug 2019 12:57PM