Skip to main content

ఆగస్టు 2018 ఎకానమీ

బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభం
Current Affairs బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో సీఆర్డీఏకి చెందిన అమరావతి బాండ్ల లిస్టింగ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముంబైలో ఆగస్టు 27న ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తల తో భేటీ అయిన ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బీఎస్‌ఈ అధికారుల చంద్రబాబు కోరారు. ఆగస్టు 14న అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు అమరావతి బాండ్లను ఏపీ ప్రభుత్వం బీఎస్‌ఈలో విక్రయానికి పెట్టగా తొలి రోజే రూ.2,000 కోట్లు సమకూరాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)
ఎందుకు : అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు

జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుంది : ఆర్‌బీఐ
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అలాగే బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏలు) మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 2017-18 వార్షిక నివేదికను ఆర్‌బీఐ ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018 మార్చి నాటికి బ్యాంకింగ్ రంగంలోని మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు, పునరుద్ధరించిన ఒత్తిడిలోని రుణాలు కలిపి 12.1 శాతానికి చేరాయి. 2015 మార్చి నాటికి రూ.2,23,464 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు 2018 మార్చి నాటికి రూ.10,35,528 కోట్లకు పెరిగాయి.
2017-18లో 37.3 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) దేశంలోకి రాగా అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో ఇవి 36.3 బిలియన్ డాలర్లు, 36.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఎఫ్‌డీఐల్లో మారిషస్, సింగపూర్ నుంచే 61 శాతం వచ్చాయి.
రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి....
2016 నవంబర్ 8న డీమోనిటైజేషన్ కారణంగా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లలో 99.3 శాతం మేర బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చాయని ఆర్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది. నోట్ల రద్దు నాటికి రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉండగా, బ్యాంకులు రూ.15.31 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను స్వీకరించాయి. అంటే రూ.10,720 కోట్ల మేర రద్దయిన తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదు. నల్లధనం, అవినీతి నియంత్రణ, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం డీమోనిటైజేషన్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
మరోవైపు రద్దయిన నోట్ల స్థానంలో తిరిగి రూ.500, రూ.2,000 నోట్లతోపాటు ఇతర నోట్ల ముద్రణకు 2016-17లో రూ.7,965 కోట్లు, 2017-18లో మరో రూ.4,912 కోట్ల మేర ఖర్చయింది. 2015-16లో నోట్ల ముద్రణకు రూ.3,421 కోట్ల వ్యయమైంది. బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐకి చేరిన రద్దయిన నోట్ల లెక్కింపునకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది.
నకిలీ నోట్లు....
క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ.500, రూ.1,000 నోట్లకు సంబంధించి గుర్తించిన నకిలీ నోట్లు 59.7 శాతం మేర తగ్గాయి. అయితే 100, రూ.50 నోట్ల విషయంలో నకిలీ నోట్ల గుర్తింపు 35 శాతం, 154 శాతం మేర పెరిగింది. ఇప్పటికే 2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను ఆర్‌బీఐ కేంధ్రప్రభుత్వానికి బదిలీ చేసిన చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా ఆర్‌బీఐ అకౌంటింగ్ సంవత్సరం జూలైతో ప్రారంభమై జూన్‌తో ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుంది
ఎప్పుడు : 2018-2019 ఆర్థిక సంవత్సరంలో
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎక్కడ : భారత్

భారత్ వృద్ధి తీరు పటిష్టం : ఐఎంఎఫ్
Current Affairs
భారత్ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆగస్టు 9న పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం, 2019-20లో 7.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2018-19లో ద్రవ్యోల్బణం 5.2 శాతం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 2.6 శాతంగా ఉంటుందని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధి రేటు 7.3 శాతం
ఎప్పుడు : 2018-19 ఆర్థిక సంవత్సరం
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)

అత్యంత సంపన్నురాలుగా స్మితా కృష్ణ
దేశంలో అత్యంత సంపన్నురాలుగా గోద్రేజ్ గ్రూప్ మూడవ తరం వారసురాలైన స్మితా కృష్ణ నిలిచింది. ఈ మేరకు అత్యంత సంపద కలిగిన 100 మంది మహిళలతో కొటక్ వెల్త్, హురున్‌లు సంయుక్తంగా రూపొందించిన జాబితాను ఆగస్టు 13న విడుదల చేశారు. ఈ జాబితాలో రూ.37,570 కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్న స్మితా గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో ఐదింట ఒక వంతు వాటాను కలిగి ఉంది. ఈ జాబితాలో రూ.30,200 కోట్ల సంపదతో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రోషిణి నాడార్ రెండవ స్థానంలో ఉండగా రూ.26,240 కోట్లతో టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందు జైన్ 3వ స్థానం ఉన్నారు.
అత్యంత సంపద కలిగిన మహిళల జాబితా-2018

ర్యాంకు

పేరు

సంపద(రూ. కోట్లలో)

1

స్మితా కృష్ణ(గోద్రేజ్ గ్రూప్)

37,570

2

రోషిణి నాడార్(హెచ్‌సీఎల్ సీఈఓ)

30,200

3

ఇందు జైన్(టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్)

26,240

4

కిరణ్ మజుందార్ షా(బయోకాన్ మేనేజింగ్ డెరైక్టర్)

24,790

5

కిరణ్ నాడార్(శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ)

20,120

6

లీనా గాందీ తివారీ

10, 730

7

సంగీతా జిందాల్

10, 450

8

జయశ్రీ ఉల్లాల్

9,490

9

అను అగా

8,550

10

శ్రద్ధా అగర్వాల్

8,200

ఈ జాబితాలో మొదటి 10 మంది మహిళా సంపన్నుల కనీస ఆస్తి విలువ రూ. 8000 కోట్లు కాగా మొదటి 100 మంది సగటు ఆస్తి రూ. 4000 కోట్లు. ఈ జాబితాలో రూ. 1000 కోట్లు ఉన్న వారికే మాత్రమే చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత సంపన్నురాలు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : స్మితా కృష్ణ
ఎక్కడ : కొటక్ వెల్త్, హురున్‌ల జాబితాలో

ఫార్చూన్ జాబితాలో ఏడు భారత కంపెనీలు
Current Affairs అత్యంత విలువైన కంపెనీలతో ఫార్చూన్ రూపొందించిన ఫార్చూన్-500 జాబితాలో ఏడు భారత కంపెనీలకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఆదాయం పరంగా 65.9 మిలియన్ డాలర్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 137 స్థానం(2017లో 168వ స్థానం)లో నిలవగా ముకేశ్ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ 62.3 బిలియన్ డాలర్లతో 148వ ర్యాంకు(2017లో 203వ ర్యాంకు) సాధించింది. అలాగే 47.5 బిలియన్ డాలర్లతో ఓఎన్‌జీసీ 197 ర్యాంకు, 47.5 బిలియన్ డాలర్లతో ఎస్‌బీఐకి 216వ ర్యాంకు, టాటా మోటార్స్ 232వ ర్యాంకు, బీపీసీఎల్ 314వ ర్యాంకు (2017లో 360వ ర్యాంకు), రాజేష్ ఎక్స్‌పోర్‌‌ట్స 405వ ర్యాంకు(2017-295వ ర్యాంకు) ను సొంతం చేసుకున్నాయి.
ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. అదే విధంగా అంతర్జాతీయంగా అధిక లాభాలు కలిగిన కంపెనీల జాబితాలో భారత్ కి చెందిన ఆర్‌ఐఎల్ 99వ ర్యాంకు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్చూన్-500 జాబితాలో ఏడు భారత కంపెనీలు
ఎప్పుడు : ఆగస్టు 1
ఎక్కడ : ఆదాయం పరమైన విభాగంలో

ఐడీబీఐలో ఎల్‌ఐసీకి 51 శాతం వాటా
ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 1న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా రూ.10,000-13,000 కోట్ల నిధులను సమకూర్చుకోనుంది. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 7.5 శాతం వాటా ఉంది.
మరోవైపు హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) 15 శాతం తాజా ఈక్విటీ జారీ చేయడం ద్వారా రూ.900 కోట్లను సమీకరించేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న 76.05 శాతం వాటా 66.13 శాతానికి తగ్గిపోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడీబీఐలో 51 శాతం వాటా కొనుగోలుకు కేబినెట్ ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : ఎల్‌ఐసీ

పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీకి అగ్రస్థానం
2018 సంవత్సరంలో అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) రూపొందించిన జాబితాను ఆగస్టు 3న విడుదల చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 2017లో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెట్టుబడుల ఆకర్షణలో ఢి ల్లీకి అగ్రస్థానం
ఎప్పుడు : 2018
ఎవరు : నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్
ఎక్కడ : దేశవ్యాప్తంగా


భారత్‌లో ఏటా 11 లక్షల శిశుమరణాలు

భారత్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు ఏడాదికి దాదాపు పదకొండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ఆస్ట్రియాకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్ అనే సంస్థ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శిశుమరణాలపై చేసిన సర్వే వివరాలను ఆగస్టు 5న వెల్లడించింది. సర్వేలో భాగంగా 2015-16 మధ్య కాలంలోని 15-49 ఏళ్ల మహిళల ప్రసవాల డేటాను తీసుకొని, 2005-06 డేటాతో విశ్లేషించారు. శిశుమరణాల రేటు తగ్గించడానికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి నిర్దేశించిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్-3 (ఎస్‌డీజీ-3)ని భారత్ చేరుకోలేదని నివేదిక వివరించింది.
ఎస్‌డీజీ-3 ప్రకారం ఒక సంవత్సర కాలంలో శిశుమరణాల రేటు 1000కి 12 గా ఉండాలి. అలాగే ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల గరిష్ట రేటు 25 దాటకూడదు. కానీ ఇంతకంటే 2.4 రెట్లు మరణాలు భారత్‌లో సంభవిసున్నాయి. 1990లో శిశుమరణాల రేటు 50 ఉండగా 2013 నాటికి ఈ సంఖ్య 109కి చేరింది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలో మరణాల రేటు 141.7 ఉండగా దేశంలో 9 శాతం జిల్లాలు ఎస్‌డీజీ-3ని చేరుకోవడానికి చాలా దూరంలో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో ఏటా 11 లక్షల శిశుమరణాలు
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్
ఎక్కడ : దేశవ్యాప్తంగా

కేంద్రానికి 50 వేల కోట్ల డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2017-18)లో కేంద్ర ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది. 2017లో ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డివిడెండ్‌తో పోలిస్తే(రూ.30,659 కోట్లు) ఇది 63 శాతం అధికం. కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం - చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) ఈ మొత్తం దోహదపడనుంది. ఆర్‌బీఐ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్రానికి 50 వేల కోట్ల డివిడెండ్
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : ఆర్‌బీఐ
Published date : 18 Aug 2018 05:14PM

Photo Stories