Exports: భారత్ నుంచి అత్యధిక ఎగుమతుల ఏ నెలలో నమోదయ్యాయి?
భారత్ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19 బిలియన్ డాలర్లకు ఎగశాయి. భారత్ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయి విలువను నమోదుచేయడం ఇదే తొలిసారి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ మే 03న ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.
GK National Quiz: తెలంగాణలో పరీక్షించిన భారతదేశపు ఆటోమేటిక్ రైలు ఢీకొనే రక్షణ వ్యవస్థ పేరు?
భారీ వాణిజ్యలోటు..
ఇక సమీక్షా నెల్లో(2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్) దిగుమతుల విలువ కూడా 26.55 శాతం ఎగసి 58.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 20.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ లోటు 15.29 బిలియన్ డాలర్లు.
ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో పాటు ఎస్‌ఎల్‌పీపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. నూతన రాజ్యాంగ నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయినా ప్రతిపక్షం అవిశ్వాసానికే మొగ్గు చూపింది. ఎస్‌జేబీతో పాటు తమిళ పార్టీ టీఎన్‌పీ, రణిల విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ సైతం అవిశ్వాసానికి ముందుకువచ్చాయి. ఎస్‌జేబీ తీర్మానం ఆమోదం పొందితే మహింద, ఆయన కేబినెట్ రాజీనామా చేయాల్సి ఉంటుంది.Digital Payments: దేశంలో రోజుకు ఎన్ని కోట్ల విలువైన డిజిటల్ లవాదేవీలు జరుగుతున్నాయి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్