Skip to main content

Indians Savings: బ్యాంకుల్లో జనం దాచుకుంది.. కోటీ 35 లక్షల కోట్లు

మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే.
1 crore 35 lakh crores in banks
1 crore 35 lakh crores in banks

దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్‌ ఎకానమీ స్టాటిస్టిక్స్‌ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్‌ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది. 

Also read: Ants: మేం ఎంత మంది ఉన్నామో చూశారా..

సేవింగ్స్‌ భారీగా పెరుగుతూ.. 
1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్‌ డిపాజిట్ల విలువ రూ.­17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్‌ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్‌ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి. 

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: మిస్ దివా యూనివర్స్ 2022 ప్రతిష్టాత్మక టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

2014 నుంచి సేవింగ్స్‌ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) 

ఏడాది భారత బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో మొత్తం
2014–15 21,78,847   41,046   22,19,893
2015–16 24,92,846   43,698   25,36,544
2016–17 33,40,707   52,876   33,93,583
2017–18 35,99,341   55,896   36,55,237
2018–19 39,72,547   58,630   40,31,177
2019–20 42,85,362   65,384   43,50,746
2020–21 49,74,715   81,092   50,55,807
2021–22 55,94,034   87,284   56,81,318

 

2014 నుంచి వివిధ టర్మ్‌ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) 

ఏడాది 90 రోజుల్లోపు 6 నెలలు–ఏడాది 5 ఏళ్లపైన
2014 3,64,909 7,34,703 7,73,620
2015 4,27,722 7,19,993 7,91,137
2016 4,35,318 5,55,536 8,47,659
2017 4,47,000 8,40,158 9,45,980
2018 4,25,420 8,05,586 10,00,865
2019 5,16,651 6,19,998 9,25,059
2020 10,84,623 4,58,797 9,93,286
2021 13,02,760 7,96,325 7,47,654

 

(ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్‌ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది)  

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

 
అయితే తక్కువ..  లేకుంటే సుదీర్ఘంగా.. 

  • టర్మ్‌ (ఫిక్స్‌డ్‌) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్‌ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
  • 1998లో 90 రోజుల్లోపు టర్మ్‌ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటి­కి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి. 
  • ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్‌ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 20th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 21 Sep 2022 06:50PM

Photo Stories