Skip to main content

వివాదాస్పద తీర్పుపై అమికస్‌ క్యూరి నియామకం

వివాదాలకు నేపథ్యమైన బొంబై హైకోర్టు తీర్పుపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఈ అంశంలో తమకు సహకరించేందుకు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ్‌ దవేను అమికస్‌ క్యూరిగా నియమించుకుంది.
పోక్సో చట్టం(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌)లోని ఒక నిబంధన ఆధారంగా లైంగిక దాడిలో నిందితుడైన ఒక వ్యక్తిని నిరపరాధిగా విడుదల చేస్తూ బొంబైహైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది.

నేరుగా సృశించకుండా దుస్తులపై మైనర్‌ బాలిక ఛాతిని తడమడం లైంగిక దాడికిందకు రాదని ఒక కేసులో బొంబై హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ 2021, జనవరి 19న తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు జనవరి 27న స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై అటార్నీ జనరల్‌ కోరిక మేరకు అప్పీలుకు అనుమతించింది. తాజాగా ఈ అప్పీలును జస్టిస్‌ యుయు లలిత్, అజయ్‌ రస్తోగితో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేసులో ఉన్న వివాద సాంద్రతను దృష్టిలో ఉంచుకొని ధర్మాసనానికి సహకరించేందుకు అమికస్‌ క్యూరిని నియమించుకోవాలని కోర్టు భావించింది.
Published date : 07 Aug 2021 05:41PM

Photo Stories