Skip to main content

వీజీఐఆర్-2020 సమావేశం

వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ (వీజీఐఆర్) 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5న ప్రసంగించారు.
Current Affairsఅతి తక్కువ కార్పొరేట్ పన్ను ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తన ప్రసంగంలో తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. వైవిధ్యమైన మార్కెట్లను ఒకే మార్కెట్‌లో చూడగలుగుతారని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. ప్రపంచాభివృద్ధి, సంక్షేమంపై భారత్ బహుముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు.

వీజీఐఆర్ నిర్వహకులు?
భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంయుక్తంగా వీజీఐఆర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో అమెరికా, యూరోప్, కెనడా, కొరియా, జపాన్, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు చెందిన దాదాపు 20 మంది ఉన్నత స్థాయి వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీరి నిర్వహణలో ఉన్న పెన్షన్ అండ్ సావరిన్ వెల్త్ ఫండ్‌‌స విలువ దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లను ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
Published date : 06 Nov 2020 06:03PM

Photo Stories