Skip to main content

వెన్నిస్ ఫిల్మ్ ఫెస్ట్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకున్న మరాఠీ చిత్రం?

ఇటలీలోని వెన్నిస్‌లో సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగిన 77వ వెన్నిస్ ఫెస్టివల్‌లో చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘ది డిసిపుల్’కు రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఎఫ్‌పీఆర్‌ఈఎస్‌సీఐ క్రిటిక్స్ విభాగంలో ఈ రెండు అవార్డులను గెలుచుకుంది.
Current Affairs
ఆదర్శ్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘మతిళుకల్’ (1989) తర్వాత ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం అందుకున్న చిత్రంగా ది డిసిపుల్ నిలిచింది. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణం కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు చైతన్య గతంలో తీసిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 77వ వెన్నిస్ ఫెస్టివల్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును గెలుచుకున్న మరాఠీ చిత్రం
ఎప్పుడు : సెప్టెంబర్ 2-12
ఎవరు : ది డిసిపుల్
ఎక్కడ : వెన్నిస్, ఇటలీ
Published date : 16 Sep 2020 11:51AM

Photo Stories