Daily Current Affairs in Telugu: 2022, మే 31 కరెంట్ అఫైర్స్
![Telugu Current Affairs Daily](/sites/default/files/images/2022/05/31/31-1654000422.jpg)
Tata hands over Ford India plant: టాటా చేతికి ఫోర్డ్ ఇండియా ప్లాంట్ గుజరాత్ ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం
న్యూఢిల్లీ: అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సాణంద్‌లో ఉన్న ప్లాంటును కొనుగోలు చేస్తున్నట్లు దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్ ఇండియా (ఎఫ్‌ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం, టాటా మోటర్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎంఎల్) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
- దీని ప్రకారం స్థలం, భవంతులు, వాహనాల తయారీ ప్లాంటు, యంత్రాలు, పరికరాలు మొదలైనవి టీపీఈఎంఎల్ కొనుగోలు చేయనుంది. అలాగే, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఎఫ్‌ఐపీఎల్ సాణంద్ ప్లాంటులోని వాహనాల తయారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే, అర్హత కలిగిన ఉద్యోగులు కూడా టీపీఈఎంఎల్‌కు బదిలీ అవుతారు. తదుపరి కొద్ది వారాల వ్యవధిలోనే టీపీఈఎంఎల్, ఎఫ్‌ఐపీఎల్ పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. సాణంద్ ప్లాంట్‌లో ఇంజిన్ల తయారీని ఫోర్డ్ కొనసాగించనుండటంతో అందుకు అవసరమైన స్థలాన్ని ఆ కంపెనీకి టాటా మోటార్స్ లీజుకు ఇవ్వనుంది. నీరు, విద్యుత్, వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంటు మొదలైనవి రెండు సంస్థలు కలిసి వినియోగించుకోనున్నాయి.
కొత్త పెట్టుబడులు..
- తమ వాహనాల ఉత్పత్తికి అనువుగా యూనిట్‌ను సిద్ధం చేసే దిశగా టీపీఈఎంఎల్ కొత్త యంత్రాలు, పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా ఏటా 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా ప్లాంటును తీర్చిదిద్దనుంది. తర్వాత రోజుల్లో దీన్ని 4 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోనుంది. ‘మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కొద్ది నెలలు పడుతుంది. ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది మాకు తోడ్పడుతుంది.
- సాణంద్‌లోని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్లాంటుకు పక్కనే ఈ యూనిట్ ఉండటం కూడా మాకు కలిసి వస్తుంది‘ అని టాటా మోటార్స్ పేర్కొంది. ‘టాటా మోటార్స్‌కు దశాబ్ద కాలం పైగా గుజరాత్‌తో అనుబంధం ఉంది. సాణంద్‌లో సొంత తయారీ ప్లాంటు ఉంది. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు ఈ ఒప్పందమే నిదర్శనం‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టీపీఈఎంఎల్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. తమ వాహనాలకు కొనుగోలుదారుల్లో డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా కంపెనీ అనేక రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు.
- UPSC: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. వారి నేపథ్యం ఇలా..
Sreesankar : వెనిజెలియా–చానియా అథ్లెటిక్స్ మీట్ లో శ్రీశంకర్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: గ్రీస్‌లో జరిగిన ‘వెనిజెలియా–చానియా అథ్లెటిక్స్ మీట్’లో భారత్‌కు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీశంకర్ స్వర్ణ పతకం సాధించాడు. కేరళకు చెందిన శ్రీశంకర్ 7.95 మీటర్ల మేర జంప్ చేసి విజేతగా నిలిచాడు. జులెస్ పొమెరి (7.73 మీటర్లు–ఫ్రాన్స్), ఎర్వన్ కొనెట్ (7.71 మీటర్లు–ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
Abhijit Gupta: అభిజిత్ గుప్తాకు కాంస్యం
- దుబాయ్: షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా కాంస్య పతకం సాధించాడు. యూఏఈలో జరిగిన ఈ టోర్నీలో రాజస్తాన్‌కు చెందిన 32 ఏళ్ల అభిజిత్ 6.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
- తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అభిజిత్ ఐదు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. అభిజిత్‌కు 7,000 డాలర్ల (రూ. 5 లక్షల 42 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
-
UPSC Civils 2021 Rankers From Telugu States; Check Their Profiles
- Yaswanth Kumar Reddy, Civils 15th Ranker: సివిల్స్‌లో నా సక్సెస్‌కు కారణం ఇదే.. వీరు లేకుంటే..