Daily Current Affairs in Telugu: 2022, మే 30 కరెంట్ అఫైర్స్
Cardinal status to Archbishop of Goa: గోవా ఆర్చి బిషప్‌కూ కార్డినల్ హోదా
హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) భారత్‌లో కార్డినల్‌గా నియమితులయ్యారు. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో ఆదివారం 21 మందిని కొత్త కార్డినల్స్‌గా ప్రకటించారు. వీరిలో భారత్ నుంచి ఆంథోనీతోపాటు గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో ఉన్నారు
- కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఈయనకు ఉంటుంది. ఆగస్ట్ 27వ తేదీన జరిగే సమావేశం నాటికి కార్డినల్స్ సంఖ్య 229కు పెరగనుంది. అందులో 131 మందికి పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ 1992లో మొదటిసారిగా మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. ఆగస్ట్ 27న వాటికన్‌లో కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి పూల ఆంథోనీ హాజరుకానున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగనున్నారు.
- DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
- Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటీ? ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏమిటీ.. చికిత్స ఎలా..
- GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు
IPL Champion 2022 : ఐపీఎల్ చాంపియన్‌గా గుజరాత్ టైటాన్స్
తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచిన ఘనత ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు.
మే 29 (ఆదివారం) జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్–2022 విజేతగా నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ఐపీఎల్–2022 అవార్డులు
- ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) జోస్ బట్లర్ (రాజస్తాన్; 863)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ బట్లర్ (రాజస్తాన్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ బట్లర్ (రాజస్తాన్; 45)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బట్లర్ (రాజస్తాన్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ బట్లర్ (రాజస్తాన్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- పర్పుల్ క్యాప్ – (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) -- చహల్ (రాజస్తాన్; 27)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఉమ్రాన్ మలిక్ (హైదరాబాద్)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ ఇవిన్ లూయిస్ (లక్నో)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు
- సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ దినేశ్ కార్తీక్ (బెంగళూరు)
ప్రైజ్‌మనీ: టాటా పంచ్ కారు
‘ఫెయిర్ ప్లే’ ఆఫ్ ద సీజన్: గుజరాత్, రాజస్తాన్
- మొత్తం ఫోర్లు: 2017
- మొత్తం సిక్స్‌లు: 1062
Congo Fever: ఇరాక్‌లో కాంగో ఫీవర్
- బాగ్దాద్: జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్‌లో కలకలం రేపుతోంది.
- దీనితో ఈ ఏడాది ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతి ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ 1979లో తొలిసారిగా వెలుగు చూసింది కూడా ఇరాక్‌లోనే.
DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
Monaco Grand Prix Formula One race: ‘మొనాకో’ విజేత పెరెజ్
మోంటెకార్లో: పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ విజేతగా నిలిచాడు.
- మే 29 (ఆదివారం) మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ రేసులో పెరెజ్ 64 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా గంటా 56 నిమిషాల 30.265 సెకన్లలో ముగించి ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. వర్షం కారణంగా 77 ల్యాప్‌ల రేసును 64 ల్యాప్‌లకు కుదించారు.
- GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
- కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో, వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ముగ్గురు డ్రైవర్లు అల్బోన్ (విలియమ్స్ రేసింగ్), మిక్ షుమాకర్ (హాస్), మాగ్నుసన్ (హాస్) రేసును పూర్తి చేయలేకపోయారు. తదుపరి రేసు అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది.