సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పదవీ విరమణ
Sakshi Education
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేశారు.
ఎంతో సంతృప్తిగా తాను పదవీ విరమణ చేస్తున్నానని ఆయన చెప్పారు. అయోధ్య తీర్పుతో సహా ఎన్నో ముఖ్యమైన తీర్పులను జస్టిస్ బాబ్డే వెలువరించారు. కోవిడ్–19 విజృంభణ నేపథ్యంలో న్యాయస్థానం కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ ఏప్రిల్ 24న బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ బాబ్డే నేపథ్యం ఇలా..
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు.
- నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలను అందుకున్నారు. – మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు.
- బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు.
- 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.
- 2013, ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు.
- సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా 2019, నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.
Published date : 24 Apr 2021 06:25PM