శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం
Sakshi Education
ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు నవంబర్ 20న కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆ చట్టంలో భక్తుల సంక్షేమానికి తీసుకోనున్న చర్యలనూ పొందుపర్చాలంది. 2020, జనవరి 3వ వారంలోగా ఆ చట్టాన్ని తమ ముందు పెట్టాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల సహా ప్రస్తుతం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాల నిర్వహణ నిమిత్తం రూపొందించిన బిల్లులో ఇప్పటికే కొన్ని సవరణలు చేశామని కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
(చదవండి : అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం)
క్విక్ రివ్యూ :
ఏమిటి : శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : సుప్రీంకోర్టు
(చదవండి : అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం)
క్విక్ రివ్యూ :
ఏమిటి : శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : సుప్రీంకోర్టు
Published date : 21 Nov 2019 05:54PM