రాష్ట్రంలో తొలి జియోథర్మల్ ప్లాంటు ఎక్కడ ఏర్పాటు కానుంది?
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పరిధిలో రాష్ట్రంలోనే తొలి జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్...
20 కిలోవాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ రూ.1.72 కోట్లు మంజూరు చేసింది. వేడినీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటమే జియోథర్మల్. ఇందుకు ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ (ఏఆర్‌సీ) అనే సాంకేతిక ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా విద్యుదుత్పత్తి చేసేందుకు సింగరేణి చర్యలు చేపట్టింది.
బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తుండగా...
పగిడేరు గ్రామ ప్రాంతంలో కొన్నేళ్లుగా భూమి నుంచి వేడినీరు ఉబికి వస్తోంది. సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తుండగా ఈ విషయం బయటపడింది. మోటార్ల సాయం లేకుండా ఏళ్ల తరబడి వేడినీరు వందల అడుగుల నుంచి వస్తుండటంతో నీటి ఆవిరి ద్వారా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా కాలుష్యరహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూ గర్భంలోని వేడి నీటి ఆవిరి (హాట్ స్ప్రింగ్స్)తో విద్యుత్ తయారు చేయనుండటం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
రెండేళ్ల కింద కుదిరిన ఒప్పందం..
480 మీటర్ల లోతులో దాదాపు 51 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఈ వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును సింగరేణి సంస్థ... శ్రీరామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో కొంతభాగాన్ని పరిసర గ్రామాల్లోని పంట భూముల కోసం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రంలో తొలి జియోథర్మల్ ప్లాంటు ఎక్కడ ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
ఎక్కడ : పగిడేరు గ్రామం, మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ
ఎందుకు : విద్యుత్ ఉత్పత్తి కోసం...

Published date : 16 Jun 2021 07:32PM