పవర్ విమెన్ అవార్డు అందుకున్న మహిళ?
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి, పరిశ్రమలశాఖ మంత్రి జగదీశ్ షెట్టార్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని టౌన్‌హాల్‌లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు.
కలాం ఆధ్వర్యంలో...
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డులు అందజేస్తోంది. ఆవుల సంరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం కోసం దివ్యారెడ్డి అయిదేళ్ల క్రితం హైదరాబాద్‌లో క్లిమామ్ వెల్‌నెస్ ఫార్మస్ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు పలు సేవలను అందిస్తున్నారు.
గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా పుస్తకావిష్కరణ...
మహిళా ఐఎఫ్‌ఎస్ అధికారుల వివరాలతో కూడిన ‘గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా – నేషన్స్ ప్రైడ్’అనే పుస్తకాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఢిల్లీలో వర్చువల్ విధానం ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పవర్ విమెన్ అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన ఆవు పాలు, వాటి ఆధారిత ఉత్పత్తుల పంపిణీతో పాటు పలు సేవలు చేస్తున్నందుకు