ప్రపంచ వృద్ధి అంచనాలు 2.2 శాతానికి కుదింపు
Sakshi Education
2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వెల్లడించింది.
ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘చైనాలో బైటపడిన కోవిడ్-19(కరోనా) వైరస్ ప్రపంచ ఎకానమీకి ముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది‘ అని ఈఐయూ తన నివేదికలో పేర్కొంది.
చైనా జీడీపీ వృద్ధి 5.4 శాతం..
కోవిడ్-19 ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. ‘2020, మార్చి ఆఖరు నాటికల్లా వైరస్ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం’ అని ఈఐయూ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ వృద్ధి అంచనాలు 2.2 శాతానికి కుదింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ)
ఎందుకు : కోవిడ్-19 ప్రపంచ ఎకానమీకి ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో...

Published date : 13 Feb 2020 05:46PM