Skip to main content

ప్రధాని మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ రాజీనామా

ప్రధాన మంత్రి మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న పి.కె. సిన్హా బాధ్యతల నుంచి వైదొలిగారని అధికార వర్గాలు మార్చి 16వ తేదీన తెలిపాయి.
Current Affairs

1977 బ్యాచ్‌ రిటైర్డు ఐఏఎస్‌ అధికారి అయిన సిన్హా, కొద్దికాలం పాటు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా బాధ్యతలు చేపట్టారు. 2019 సెప్టెంబర్‌ నుంచి ప్రధాని ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు, కేబినెట్‌ సెక్రటరీగా నాలుగేళ్లపాటు పనిచేశారు. ప్రధాని పదవిలో మోదీ కొనసాగినంత కాలం లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా ఉంటారని ఆయన నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ రాజీనామా
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : పి.కె. సిన్హా
Published date : 17 Mar 2021 04:58PM

Photo Stories