Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 29th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu November 29th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Ruturaj Gaikwad:ఒకే ఓవర్లో 7 సిక్సర్లు.. రికార్డు బద్దలు.. 
నవంబర్‌ 28న జరిగిన విజయ్‌హజారే వన్డే టోరీ్నలో మహారాష్ట్ర బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదైంది. యూపీ స్పిన్నర్‌ శివ సింగ్‌ ఓవర్లో అతను 7 బంతుల్లో 7 సిక్సర్లు బాదాడు. ఆరు రెగ్యులర్‌ బంతులతో పాటు ఒక ‘నోబాల్‌’ను కూడా రుతురాజ్‌ సిక్సర్‌గా మలిచాడు. లిస్ట్‌–ఎ క్రికెట్‌లో (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు కలిపి) ఒక బ్యాట్స్‌మన్‌ ఒక ఓవర్లో గరిష్టంగా 6 సిక్స్‌లకు మించి కొట్టలేదు. గైక్వాడ్‌ దానిని సవరించాడు. ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల (43) రికార్డు కూడా దీంతో సమమైంది. ఈ మ్యాచ్‌లో 220 పరుగులు చేసిన రుతురాజ్‌ డబుల్‌ సెంచరీ చేసిన పదో భారత ఆటగాడిగా నిలిచాడు.  
భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ (3 సార్లు), సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, పృథ్వీ షా, శిఖర్‌ ధావన్, సమర్థ్‌ వ్యాస్, కరణ్‌ కౌశల్‌ తర్వాత లిస్ట్‌–ఎ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన పదో భారత ఆటగాడిగా రుతురాజ్‌ నిలిచాడు.

అంతర్జాతీయ వన్డేల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. అంతర్జాతీయ టి20ల్లో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో చెలరేగారు. దేశవాళీ వన్డేల్లో ఒక ఆటగాడు ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. దేశవాళీ టి20ల్లో ముగ్గురు బ్యాటర్లు ఓవర్లో 6 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించారు. వీరంతా ఓవర్లో ఆరేసి సిక్సర్లతో పండగ చేసుకున్నారు. ఇదంతా ఇప్పటి వరకు రికార్డు... కానీ ఇప్పుడు దీన్ని దాటి ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో కొత్త ఘనత నమోదైంది. మహారాష్ట్ర బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ నోబాల్‌ సహా 7 బంతుల్లో సిక్సర్లు బాది లిస్ట్‌–ఎ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్‌లో ప్రపంచ రికార్డు 
సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో (టెస్టులు, మూడు, నాలుగు రోజుల మ్యాచ్‌లు) మాత్రం రికార్డు లీ జెర్మన్‌ (8 సిక్స్‌లు) పేరిట ఉంది. 

6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

లీ జెర్మన్‌ కొట్టిన మ్యాచ్‌లో... 
న్యూజిలాండ్‌ మాజీ కెపె్టన్‌ లీ జెర్మన్‌ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 8 సిక్సర్లు కొట్టడం అధికారికంగానే నమోదై ఉంది. అయితే ఆ మ్యాచ్‌ జరిగిన తీరు పూర్తిగా భిన్నమైంది. వెల్లింగ్టన్‌ కెపె్టన్‌ మెక్‌ స్వీనీ ‘ప్రత్యేక వ్యూహం’లో భాగంగా ఇదంతా జరిగింది. 59 ఓవర్లలో 291 పరుగులు ఛేదించే క్రమంలో కాంటర్‌బరీ 108/8 వద్ద నిలిచింది. అయితే ఆ జట్టును అంత సులువుగా ఓడించరాదని, సులభంగా పరుగులు ఇచ్చి కాస్త ఆడిద్దామని వెల్లింగ్టన్‌ భావించింది. ఒకదశలో స్కోరు 196/8కు చేరింది. మరో 2 ఓవర్లు మిగలగా..  అసలు బౌలింగ్‌ రాని వాన్స్‌ చేతికి బంతి ఇచ్చారు. అతను ఓవర్లో ఏకంగా 17 నోబాల్స్‌ సహా 22 బంతులు వేశాడు. అంటే 5 బంతులే! ఇందులోనే లీ జెర్మన్‌ 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 77 పరుగులు (0444664614106666600401) వచ్చాయి. ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే. చివరకు మ్యాచ్‌ ‘డ్రా’ అయింది.     
ఓవర్లో 6 సిక్సర్ల వీరులు.. 
అంతర్జాతీయ టి20లు
►యువరాజ్‌ (భారత్‌)  బౌలర్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లండ్‌; 2007లో) 
►కీరన్‌ పొలార్డ్‌  (వెస్టిండీస్‌)  బౌలర్‌- అఖిల  ధనంజయ (శ్రీలంక; 2021లో) 
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ 
►సోబర్స్‌ (నాటింగమ్‌షైర్‌ కౌంటీ)- బౌలర్‌: నాష్‌ (గ్లామోర్గాన్‌; 1968లో) 
►రవిశాస్త్రి (ముంబై)- బౌలర్‌: తిలక్‌ రాజ్‌ (బరోడా; 1984లో)
►లీ జెర్మన్‌ (కాంటర్‌ బరీ)- బౌలర్‌: వాన్స్‌ (వెల్లింగ్టన్‌; 1990లో)
దేశవాళీ వన్డేలు 
►తిసారా పెరీరా (శ్రీలంక; శ్రీలంక ఆర్మీ స్పోర్ట్స్‌ క్లబ్‌)- బౌలర్‌: దిల్హాన్‌ కూరే (బ్లూమ్‌ఫీల్డ్‌; 2021లో) 
►రుతురాజ్‌ గైక్వాడ్‌ (భారత్‌; మహారాష్ట్ర)-  బౌలర్‌: శివ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌; 2022లో)
దేశవాళీ టి20లు 
►రోజ్‌ వైట్లీ (వొర్స్‌టర్‌షైర్‌) - బౌలర్‌: కార్ల్‌ కార్వర్‌ (యార్క్‌షైర్‌; 2017లో) 
►లియో కార్టర్‌ (కాంటర్‌బరీ) - బౌలర్‌: ఆంటన్‌ డెవ్‌సిచ్‌ (నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌; 2020లో)
►హజ్రతుల్లా జజాయ్‌ (కాబూల్‌ జ్వానన్‌)-  బౌలర్‌: అబ్దుల్లా మజారి (బాల్క్‌ లెజెండ్స్‌; 2018లో)


Afghanistan: వన్డే ప్రపంచకప్‌కు అఫ్గానిస్తాన్‌ అర్హత 
వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ క్రికెట్ టోర్నీకి అఫ్గానిస్తాన్‌ జట్టు అర్హత సాధించింది. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ 115 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచి బెర్త్‌ను ఖరారు చేసుకుంది. హష్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని అఫ్గానిస్తాన్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. పల్లెకెలలో రెండో వన్డే వర్షంతో రద్దు కావడంతో అఫ్గానిస్తాన్‌కు ఐదు పాయింట్లు లభించాయి. వచ్చే మార్చిలో సూపర్‌ లీగ్‌ ముగిశాక టాప్‌–8లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్‌ బెర్త్‌లు లభిస్తాయి. 

IAS Officer Success Story : నాన్న నిర్ల‌క్ష్యం.. అన్న త్యాగం.. ఇవే న‌న్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌.. కానీ

Davis Cup: కెనడాకు డేవిస్‌కప్‌ టైటిల్‌ 

Davis cup


ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆ్రస్టేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో షపోవలోవ్‌ 6–2, 6–4తో కొకినాకిస్‌పై నెగ్గగా, రెండో సింగిల్స్‌లో ఫెలిక్స్‌ అలియాసిమ్‌ 6–3, 6–4తో అలెక్స్‌ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్‌ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్‌ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 

International Film Festival: అవార్డు ప్ర‌దానం.. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ఏమ‌న్నారంటే..
గోవాలో జరుగుతున్న 53వ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)’ ముగింపు వేడుకకి సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి హాజరయ్యారు. ఈ వేదికపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – 2022’ పురస్కారాన్ని ఆయ‌న‌ అందుకున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి ప్రేమకు నేను దాసోహం.. వాళ్ల ప్రేమకు నేను దాసుణ్ని. ఆ ప్రేమ కావాలి.. ఆ ప్రేమే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. ఇలాంటి గొప్ప అవార్డులు పొందేందుకు అవకాశం కల్పించింది. మీకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను’’ అని చిరంజీవి అన్నారు. 
‘‘ఈ అవార్డును ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీగారికి థ్యాంక్స్‌. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు నాకే కాదు.. నా ఫ్యాన్స్‌లోనూ ఎంతో ఉత్సాహం నింపింది. శివశంకర్‌ వరప్రసాద్‌గా మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నాకు చిత్ర పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉన్నాను. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల కొన్నేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఆ సమయంలో సినిమా విలువ ఏంటో తెలిసింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకులు ఎప్పటిలానే నాపై ప్రేమను చూపారు. నా చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తాను. అవినీతి లేని ఏకైక రంగం సినిమా రంగం. ఇక్కడికి ఎవరైనా రావొచ్చు. ప్రతిభ ఒక్కటే కొలమానం. నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ.. వాళ్లకు ఇప్పడు కష్టకాలమే (నవ్వుతూ). గతంలో ఇలాంటి వేడుకలో పాల్గొన్నప్పుడు అక్కడ దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేకపోవడంతో చాలా బాధపడ్డాను. కానీ, ఇప్పుడు ప్రాంతీయ భేదాలు తొలగిపోయి భారతీయ సినిమా అనే రోజు రావడం హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మన భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి’’ అన్నారు. 

ప్రాక్టీస్ షురూ: జనరల్ నాలెడ్జ్ బిట్ బ్యాంక్

India GDP Growth:2022–23లో వృద్ధి 7 శాతమే!
భారత్‌ 2022–23 వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌అండ్‌పీ) కుదించింది. క్రితం (సెప్టెంబర్‌ నాటి) 7.3 శాతం అంచనాలను 7 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపింది. అయితే దేశీయంగా పటిష్టంగా ఉన్న డిమాండ్‌ పరిస్థితులు ఎకానమీని అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకుని నిలబడేలా చేస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఆసియా–పసిఫిక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ లూయీస్‌ క్యూజియెస్‌ విశ్లేషించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి  సెప్టెంబర్‌ 6.5 శాతం అంచనాను తాజాగా 6 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది.  వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022–23లో సగటును 6.8 శాతంగా ఉంటుందని, 2023 మార్చి నాటికి ఆర్‌బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్‌ బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.9 శాతం) 6.25 శాతానికి చేరుతుందని ఎస్‌అండ్‌పీ భావిస్తోంది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్‌బీఐ మే నుంచి రెపో రేటును నాలుగు దఫాల్లో 1.9 శాతం పెంచింది. దీనితో ఈ రేటు మూడేళ్ల గరిష్టానికి చేరింది.  తాజా ఆర్థిక‌ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్‌ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం.  

Private Launchpad: దేశంలో తొలి ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్‌
తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌–షార్‌ క్యాంపస్‌లో ఇస్రో ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్, మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను  నవంబర్‌ 25న ప్రారంభించినట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. అంతరి క్షయానం ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనే ఉద్దేశం ఈ ప్రైవేట్‌ లాంచ్‌ ప్యాడ్‌తో సాకార మవుతుందన్నారు. అగ్నికుల్‌ (భారత అంతరిక్ష–టెక్‌ స్టార్ట్‌అప్‌) అనే ప్రైవేట్‌ కంపెనీ ఈ లాంచ్‌ ప్యాడ్‌ను డిజైన్‌ చేసినట్లు వివరించారు. అలాగే, అగ్నికుల్‌ మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా షార్‌లో ప్రారంభించినట్లు చెప్పారు. 

National Awards: హస్తకళాకారులకు జాతీయ అవార్డులు
భారతీయ హస్త కళలు, టైక్స్‌టైల్స్‌ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. న‌వంబ‌ర్ 28న‌ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చెందిన గద్దె అశోక్‌కుమార్‌ (సిల్వర్‌ ఫిలిగ్రీ)కి, ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్‌ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్‌ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్‌ మేకింగ్‌లో కొండ్ర గంగాధర్‌ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. 

Hand Skeletal: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం!

బ్రెజిల్‌ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది. ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానంతో భయాందోళనకు గురయ్యారు. న‌వంబ‌ర్‌ 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్‌ బయాలజిస్ట్‌ ఎరిక్‌ కోమిన్‌ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్‌ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. 

చ‌ద‌వండి: అంతర్జాతీయ సరిహద్దులు​​​​​​​

Mind Controlled Wheelchair: మనసు మాట వినే చక్రాల కుర్చీ!
దివ్యాంగులకు చక్కగా ఉపయోగపడే చక్రాల కుర్చీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కుర్చీని కదిపేందుకు బటన్స్‌ నొక్కాల్సిన పనిలేదు. మనిషిలోని ఆలోచనలను బట్టి నడుచుకుంటుంది. అంటే మనస్సుతో కుర్చీని కంట్రోల్‌ చేయొచ్చు. కుర్చీలో కూర్చున్న తర్వాత కుడి వైపునకు మళ్లాలంటే రెండు చేతులను కుడి వైపునకు కదిలించినట్లు మనసులో ఊహించుకుంటే చాలు. ఎడమ వైపునకు వెళ్లాలంటే రెండు కాళ్లను అదే దిశలో కదిలించినట్లు ఊహించుకోవాలి. మెదడులోని సంకేతాలను వీల్‌ చైర్‌ కదలికలతో అనుసంధానించారు. ఇందుకోసం హెల్మెట్‌ (స్కల్‌ క్యాప్‌) లాంటిది ధరించాలి.
ఇందులో 31 ఎలక్ట్రోడ్‌లు ఉంటాయి. ఇవి మెదడు అందించే సంకేతాలను పసిగడతాయి. చైర్‌ వెనుక  ల్యాప్‌ట్యాప్‌ ఫిక్స్‌ చేసి ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ)తో మెదడు సంకేతాలు కుర్చీ కదలికలుగా మారుతాయి. దివ్యాంగులు, నడవలేని బాధితులు చేయాల్సిందల్లా కుర్చీలో కూర్చొని కాళ్లు, చేతులు ఆడించినట్లు మనసులో ఊహించుకోవడమే. మనసు మాట వినే ఈ చక్రాల కుర్చీ 80 శాతం కచ్చితత్వంతో పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. కుర్చీలను వాణిజ్యపరంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

China Protest: చైనాలో ఉక్కుపాదం.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు 

China Protests


చైనాలో జీరో కొవిడ్‌ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తీరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది. వాటిని తక్షణం కట్టడి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్‌ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు. న‌వంబ‌ర్ 27న‌ షాంఘైలో నిరసనలను కవర్‌ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్‌ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తన్నారని బీబీసీ ఆరోపించింది. కొద్ది గంటల నిర్బంధం అనంతరం వదిలేశారు. ఆయన్ను పోలీసులు హింసించడం అవాస్తవమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీ జియాన్‌ అన్నారు. తమ జీరో కోవిడ్‌ విధానం సరైందంటూ సమర్థించుకున్నారు. మీడియా చెబుతున్న స్థాయిలో నిరనసలు జరగడం లేదంటూనే, ‘‘జనాల్లో కాస్తంత వ్యతిరేకత ఉండొచ్చు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా జీరో కొవిడ్‌ విధానంలో మార్పులు తెస్తున్నాం’’ అని అంగీకరించారు. మరోవైపు కరోనా ఆంక్షలపై దేశమంతటా జనాగ్రహం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్, దేశంలో అతి పెద్ద నగరం షాంఘైతో పాటు పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆంక్షలపై గళమెత్తుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని చైనాకు ఐక్యరాజ్యసమితి హితవు పలికింది. వారి హక్కులను గౌరవించాలని సూచించింది. 
మళ్లీ 40 వేల కేసులు.. 
మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్‌డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది.  
వైట్‌ పేపర్‌ రివల్యూషన్‌.. 
దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతీకాత్మకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్‌ పేపర్‌ రివల్యూషన్‌’ పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది.  
 
Success Story: ఈ మాట కోస‌మే గ్రూప్‌–2 కొట్టా.. కానీ

Published date : 29 Nov 2022 06:18PM

Photo Stories